50 లక్షలు కాదు అంతకు మించి, బిగ్ బాస్ 8 టైటిల్ విన్నర్ కి భారీ ప్రైజ్ మనీ, చరిత్రలో హైయెస్ట్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలే నేడు. ఈసారి విన్నర్ రూ . 50 లక్షల కంటే ఎక్కువ గెలుచుకోనున్నాడు. బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ప్రైజ్ మనీ దక్కనుంది.
Bigg boss telugu 8
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలే నేడు. ఆడియన్స్ టీవీలకు అతుక్కుపోయారు. విన్నర్ ఎవరనే ఉత్కంఠ అందరిలో కొనసాగుతుంది. అవినాష్, గౌతమ్, ప్రేరణ, నబీల్, నిఖిల్ టాప్ 5 కంటెస్టెంట్స్ గా ఫినాలేకి చేరారు. వీరిలో ఒకరు టైటిల్ సొంతం చేసుకోనున్నారు.
అవినాష్, గౌతమ్ వైల్డ్ కార్డు ఎంట్రీలు కాగా.. మిగతా ముగ్గురు కంటెస్టెంట్స్ మొదటి వారం నుండి హౌస్లో ఉన్నారు. కంటెస్టెంట్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ అందుకుంటాడు. గత 7 సీజన్స్ కి బిగ్ బాస్ తెలుగు ప్రైజ్ మనీ రూ. 50 లక్షలుగా ఉంది. అలాగే ఒక కారు, ప్లాట్ వంటి బహుమతులు కూడా విన్నర్ కి అందిస్తారు.
అయితే టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఎవరైనా... హోస్ట్ నాగార్జున ఆఫర్ చేసిన డబ్బులు తీసుకుని టైటిల్ రేసు నుండి తప్పుకోవచ్చు. నాగార్జున ఆఫర్ చేసిన ఆ మొత్తం విన్నర్ ప్రైజ్ మనీ తగ్గిస్తారు. సీజన్ 7లో యావర్ రూ. 15 లక్షలు తీసుకుని 4వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ కారణంగా విన్నర్ పల్లవి ప్రశాంత్ కి రూ. 35 లక్షలు ప్రైజ్ మనీగా దక్కింది.
కాగా సీజన్ 8లో ప్రైజ్ మనీ అన్ లిమిటెడ్ అని నాగార్జున ప్రకటించారు. ఈ సీజన్లో అన్నీ అన్ లిమిటెడ్, కంటెస్టెంట్స్ పెర్ఫార్మన్స్ ఆధారంగా ప్రైజ్ మనీ పెరుగుతుంది. అదే సమయంలో తగ్గుంది. కంటెస్టెంట్స్ గొప్ప ప్రదర్శన ఇచ్చిన నేపథ్యంలో రూ. 50 లక్షల కంటే ఎక్కువ విన్నర్ గెల్చుకునే అవకాశం ఉందని అన్నారు.
గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో నాగార్జున సీజన్ 8 విన్నర్ గెల్చుకునే ప్రైజ్ మనీ మొత్తాన్ని రివీల్ చేశాడు. రూ. 54,99999 ఈ సీజన్ కి గాను ప్రైజ్ మనీగా ఫిక్స్ చేశారు. దీన్ని రౌండ్ ఫిగర్ చేద్దాం అంటూ నాగార్జున రూ. 55,00000లుగా నిర్ణయించారు. కాబట్టి ఈ మొత్తం టైటిల్ విన్నర్ కి దక్కుతుంది. అయితే మధ్యలో ఎవరైనా.. కంటెస్టెంట్ నాగార్జున ఆఫర్ చేసిన డబ్బులు తీసుకుని టైటిల్ రేసు నుండి తప్పుకుంటే.. ఆ మొత్తాన్ని ప్రైజ్ మనీ నుండి తగ్గిస్తారు.