నాగార్జున చేసిన అతిపెద్ద సాయం బయటపెట్టిన గంగవ్వ, ఆమె ఎంట్రీతో అంతా తికమక!
బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గంగవ్వ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. హోస్ట్ నాగార్జున చేసిన సాయాన్ని ఆమె బయటపెట్టింది.
Bigg boss telugu 8
బిగ్ బాస్ సీజన్ 8 కి గాను వైల్డ్ కార్డ్ ఎంట్రీలు పెద్ద మొత్తంలో చోటు చేసుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 8 మంది ఐదు వారాల అనంతరం హౌస్లోకి ప్రవేశించారు. హరితేజ, టేస్టీ తేజ, నయని పావని, మెహబూబ్, గౌతమ్ కృష్ణ, అవినాష్, రోహిణిలతో పాటు గంగవ్వ ఎంట్రీ ఇచ్చింది.
Bigg boss telugu 8
నాగార్జున చేసిన సహాయాన్ని ఆమె గుర్తు చేసుకుంది. సొంత ఇంటి నిర్మాణం కోసం రూ. 20 లక్షల వరకు నాగార్జున, బిగ్ బాస్ మేకర్స్ సహాయం చేసినట్లు ఆమె వెల్లడించారు. కాగా మిగతా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పట్ల ప్రేక్షకులు సంతృప్తిగా ఉన్నారు. కానీ గంగవ్వ విషయంలో కాదు. అందుకు కారణాలు ఏమిటని పరిశీలిస్తే..
గంగవ్వ హౌస్లోకి వస్తే ఆట స్వరూపమే మారిపోతుంది. ప్రతి ఒక్కరు ఆమెపై సింపతీ చూపుతూ పూర్తి స్థాయిలో గేమ్ ఆడలేరు. గంగవ్వను ఎవరూ నామినేట్ చేయలేరు. ప్రేక్షకుల్లో ఆమె పట్ల పెద్ద మొత్తంలో సింపతీ ఉంటుంది. ఆమెను నామినేట్ చేసినా, వ్యతిరేకంగా మాట్లాడినా... నెగిటివ్ అవుతామని కంటెస్టెంట్స్ భావిస్తారు. అలాగే ఫిజికల్ టాస్క్ లలో గంగవ్వకు మినహాయింపు ఇవ్వాల్సి వస్తుందనేది ఆడియన్స్ అభిప్రాయం. ఇది మిగతా కంటెస్టెంట్స్ ఆటపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.
Bigg boss telugu 8
కాగా మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా వెలుగులోకి వచ్చింది గంగవ్వ. ఈమెది తెలంగాణ రాష్ట్రంలోని లంబాడిపల్లి అనే కుగ్రామం. గంగవ్వలోని ప్రత్యేకతలు గుర్తించిన స్థానిక యువకులు, వీడియోలు చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. గంగవ్వ వీడియోలకు విశేష ఆదరణ దక్కింది. అలా సోషల్ మీడియా స్టార్ గా ఎదిగింది.
గంగవ్వ అనూహ్యంగా బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్ట్ చేసే ఛాన్స్ దక్కించుకుంది. దాంతో ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. మంచి ఇల్లు నిర్మించుకోవాలి అనేది గంగవ్వ కల. దానికి అవసరమైన డబ్బుల కోసమే బిగ్ బాస్ షోకి వచ్చానని గంగవ్వ వెల్లడించింది. స్వచ్ఛమైన పల్లెటూరు వాతావరణంలో పుట్టి పెరిగిన గంగవ్వకు బిగ్ బాస్ హౌస్ సరిపడలేదు.
Gangavva
ఎలాగైనా చివరి వరకు హౌస్లో ఉండాలని ఆమె ప్రయత్నం చేసింది. వయసు రీత్యా అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఇల్లు, పిల్లలు గుర్తుకొచ్చి దిగులు చెందింది. దాంతో 5వ వారం ఎలిమినేట్ కాకుండానే గంగవ్వ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసింది. అయితే ఇంటి నిర్మాణానికి డబ్బులు సమకూర్చుతామని నాగార్జున హామీ ఇచ్చారు. చెప్పినట్లే గంగవ్వకు కొంత ఆర్థిక సహాయం చేశారు.
రూ. 22 లక్షల ఖర్చుతో గంగవ్వ ఇల్లు నిర్మించుకుంది. గంగవ్వకు ఒక కల ఉందట. 50 ఆవుల ఒక ఫార్మ్ ఏర్పాటు చేసి, పాలు అమ్ముకుంటూ జీవించాలనేది చిరకాల వాంఛ అట. ఎప్పటికైనా అది చేస్తానని గంగవ్వ అంటున్నారు. గంగవ్వ అరడజనుకు పైగా సినిమాల్లో నటించింది. చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన మల్లేశం మూవీలో ఓ పాత్ర చేసింది. ఇస్మార్ట్ శంకర్, ఎస్ ఆర్ కళ్యాణమండపం, రాజ రాజ చోర, లవ్ స్టోరీ, గాడ్ ఫాదర్ చిత్రాల్లో గంగవ్వ నటించిన సంగతి తెలిసిందే.