MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • వైల్డ్ కార్డు ఎంట్రీలు: లాభం లేదు! వారిద్దరూ రావాల్సిందే, ఒకరు ఫైర్ బ్రాండ్, మరొకరు ఎంటర్టైనర్!

వైల్డ్ కార్డు ఎంట్రీలు: లాభం లేదు! వారిద్దరూ రావాల్సిందే, ఒకరు ఫైర్ బ్రాండ్, మరొకరు ఎంటర్టైనర్!

ఈసారి వైల్డ్ కార్డు ఎంట్రీలు భిన్నంగా ఉండనున్నాయని సమాచారం. ఓ ఇద్దరు మాజీ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇవ్వడం ఖాయమట.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Sep 21 2024, 08:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bigg Boss Telugu 8

Bigg Boss Telugu 8


ఐదవ వారం మరో 5 మంది సెలెబ్స్ బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తారన్న సంగతి తెలిసిందే. అందుకే లాంచింగ్ ఎపిసోడ్ లో కేవలం 14 మందిని పరిచయం చేశారు. ఈసారి వైల్డ్ కార్డు ద్వారా మాజీ కంటెస్టెంట్స్ హౌస్లోకి వస్తున్నారని ప్రచారం జరుగుతుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 1న గ్రాండ్ గా ప్రారంభమైంది. 14 మంది సెలెబ్స్ హౌస్లోకి కంటెస్టెంట్స్ గా ప్రవేశించారు. ఈసారి పెద్దగా పేరున్న నటులు లేరు. విష్ణుప్రియ, ఆదిత్య ఓం, అభయ్ నవీన్... ఇలా ఒకరిద్దరు మాత్రమే తెలిసిన ముఖాలు. సీరియల్ బ్యాచ్ ని ఎక్కువగా హౌస్లోకి తోశారు. 

నిఖిల్, ప్రేరణ, యష్మి, పృథ్విరాజ్... వీరంతా స్టార్ మా సీరియల్ నటులు. అందులోనూ కన్నడ బ్యాచ్. తెలుగు బిగ్ బాస్ షోలో ఇతర బాషల వారు ఎక్కువగా కంటెస్ట్ చేశారు. సీజన్ 7 స్థాయిలో సీజన్ 8 లేదనేది గట్టిగా వినిపిస్తున్న మాట. అందుకు కంటెస్టెంట్స్ ఎంపిక కూడా కారణం. 
 

36

బిగ్ బాస్ మేకర్స్ కి కంటెస్టెంట్స్ కొరత ఉందనిపిస్తుంది. లక్షలు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నా... కొందరు సెలబ్రిటీలు ముందుకు రావడం లేదు. బిగ్ బాస్ షో వలన పాజిటివ్ కంటే నెగిటివ్ ఇమేజ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని భావిస్తున్నారు. 

 బిగ్ బాస్ కెరీర్ కి ఉపయోగపడకపోగా ఉన్న కెరీర్ ని కూడా నాశనం చేస్తుందని భయపడుతున్నారు. చాలా మంది సెలెబ్స్ విషయంలో ఇది నిజమైంది. పెద్దగా నేమ్ ఫేమ్ లేని నటులు, బుల్లితెర సెలబ్రిటీలకు బిగ్ బాస్ కరెక్ట్. దాని వలన వారి గురించి ప్రేక్షకులకు తెలిసే అవకాశం ఉంది. 
 

46

ఫార్మ్ లో ఉన్న నటులు, సెలెబ్రిటీలు బిగ్ బాస్ షోపై ఆసక్తి చూపడం లేదనేది నిజం. అందుకే గతంలో మాదిరి హౌస్లో స్టార్స్ పార్టిసిపేషన్ లేకుండా పోతుంది. సీజన్ 8లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కనీసం వైల్డ్ కార్డు ఎంట్రీల ద్వారా అయినా... పేరున్న నటులను హౌస్లోకి తేవాలని మేకర్స్ భావిస్తున్నారట. 

ఈ క్రమంలో విభిన్నంగా మాజీ కంటెస్టెంట్స్ పై వారి దృష్టి పడిందట. గతంలో సక్సెస్ అయిన కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్లో పంపాలని ప్రణాళికలు వేస్తున్నారట. కాగా సీజన్ 1లో పాల్గొన్న హరి తేజ, సీజన్ 4 కంటెస్టెంట్ ముక్కు అవినాష్ రావడం పక్కా అంటున్నారు. సీజన్ వన్ ఫైనలిస్ట్ హరితేజను సంప్రదించగా ఆమె ఓకే అన్నారట. హరితేజ సీజన్ 1లో 3వ స్థానంలో నిలిచింది. ఈమె ఫైర్ బ్రాండ్ అని చెప్పొచ్చు. 
 

56

అలాగే సీజన్ 4లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి రాణించిన జబర్దస్త్ అవినాష్ సైతం మరోసారి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాడట. అవినాష్ మంచి ఎంటర్టైనర్. జోక్స్ తో పాటు తన బాడీ లాంగ్వేజ్ తో నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తాడు. అవినాష్ పది వారాలకు పైగా హౌస్లో ఉన్నాడు. 

వీరిద్దరితో పాటు రోహిణి వస్తుందని టాక్. ఈమె కూడా మాజీ కంటెస్టెంట్. సీజన్ 3లో పాల్గొంది. నటిగా, జబర్దస్త్ కమెడియన్ గా రోహిణి ఫుల్ బిజీ. మరి ఆమె ఆసక్తి చూపుతుందా లేదా అనేది చూడాలి. హరితేజ, అవినాష్ వచ్చినా కూడా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. 


 

66
Abhai Naveen Bigg bos8

Abhai Naveen Bigg bos8


ఇక మూడవ వారానికి గాను 8 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. వీరి నుండి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. నటుడు అభయ్ నవీన్ డేంజర్ జోన్లో ఉన్నాడట. అతడు ఎలిమినేట్ అయ్యే అవకాశం కలదంటూ గట్టిగా వినిపిస్తున్న మాట. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి మూడో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmi Gautam: సుడిగాలి సుధీర్‌తో సినిమాపై యాంకర్ రష్మి షాకింగ్‌ రియాక్షన్‌.. పేరు పలకడానికి కూడా ఇబ్బంది
Recommended image2
OTT Series: ఓటీటీలో దుమ్ములేపుతున్న సరికొత్త తెలుగు కామెడీ ఫ్యామిలీ సిరీస్‌.. హాట్‌ స్టార్‌లో ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌
Recommended image3
Bigg Boss Telugu 10: కామన్‌ మ్యాన్‌కి నాగార్జున బంపర్‌ ఆఫర్‌.. బిగ్‌ బాస్‌ టైటిల్‌ గెలిచే ఛాన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved