MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • రష్మిక నా రూమ్మేట్, అర్ధరాత్రి రోడ్లపై అలా చేసేవాళ్ళం, ప్రేరణకు ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా?

రష్మిక నా రూమ్మేట్, అర్ధరాత్రి రోడ్లపై అలా చేసేవాళ్ళం, ప్రేరణకు ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా?

బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ ప్రేరణ కంబం బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు. ఆమె రష్మిక క్లోజ్ ఫ్రెండ్ అట. అర్ధరాత్రి వేళ వారిద్దరూ కలిసి కొన్ని క్రేజీ పనులు చేసేవారట.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Sep 11 2024, 12:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Prerana Kambam

Prerana Kambam

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ లో ప్రేరణ కంబం ఒకరు. ఈ కన్నడ సీరియల్ నటి తెలుగులో కూడా పాపులర్. హైదరాబాద్ లో పుట్టిన ప్రేరణ, పెరిగింది మాత్రం బెంగుళూరులో. అక్కడే మోడలింగ్ స్టార్ట్ చేసింది. 2017లో ఆమె బుల్లి తెరకు పరిచయమయ్యారు. హర హర మహదేవ ఆమె డెబ్యూ సీరియల్. మరొక కన్నడ సీరియల్ రంగనాయకి తో పాపులారిటీ రాబట్టింది. 

2018లో సురకత్తె టైటిల్ తో విడుదలైన కన్నడ చిత్రంలో నటించింది. ఫిజిక్స్ టీచర్ అనే మరో చిత్రంలో ప్రేరణ ప్రధాన పాత్ర చేసింది. తెలుగులో కృష్ణా ముకుందా మురారి సీరియల్ లో హీరోయిన్ గా ఆమెకు అవకాశం వచ్చింది. కృష్ణ పాత్రలో ఆమె మెప్పించారు. స్టార్ మా లో ప్రసారమైన కృష్ణ ముకుంద మురారి ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
prerana kambam

prerana kambam

అందుకే కృష్ణ ముకుంద మురారి సీరియల్ కి ఎండ్ కార్డు వేశారు. ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలు చేసిన యాష్మి గౌడ, ప్రేరణ బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్ట్ చేశారు. ప్రేరణకు గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న అనుభవం ఉంది. 2021లో ప్రసారమైన బిగ్ బాస్ కన్నడలో ఆమె కొద్ది రోజులు హౌస్లో ఉన్నారు. 


 

36
Prerana Kambam

Prerana Kambam

కాగా ప్రేరణకు రష్మిక మందాన బెస్ట్ ఫ్రెండ్ అట. వీరిద్దరూ ఒకప్పుడు రూమ్ మేట్స్ అట. ఇద్దరూ కలిసి కొన్ని క్రేజీ పనులు చేశారట. అర్ధరాత్రి 2 గంటలకు స్కూటీ వేసుకుని రోడ్లపై చక్కర్లు కొట్టేవారట. రష్మిక మందాన స్టార్ హీరోయిన్ కావడంతో ప్రేరణతో పెద్దగా కలవడం లేదట. రష్మిక మందానకు ప్రేరణ ఫ్రెండ్ కావడం ఊహించని పరిణామం. 

ప్రేరణకు లవ్ స్టోరీ కూడా ఉంది. ఆమె భర్త పేరు శ్రీపాద్ దేశ్ పాండే. వీరిద్దరూ చాలా కాలం రహస్యంగా ప్రేమించుకున్నారట. ప్రేరణ సీరియల్ నటి కావడంతో ఎక్కడికెళ్లినా జనాలు గుర్తు పట్టేవారట. అందుకే శ్రీపాద్-ప్రేరణ చాటుగా కలుసుకోవాల్సి వచ్చేదట. పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదట. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించేందుకు చాలా సమయం పట్టిందట. 
 

46
Prerana Kambam

Prerana Kambam

చివరకు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారట. కన్నడ సాంప్రదాయంలో బెంగుళూరు వేదికగా ప్రేరణ వివాహం ఘనంగా జరిగింది. తరచుగా భర్తతో కలిసి వెకేషన్స్ కి చెక్కేస్తోంది ప్రేరణ. అటు పర్సనల్ లైఫ్ ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ని ప్రేరణ బ్యాలన్స్ చేస్తుంది. 
 

56
Prerana Kambam

Prerana Kambam

కాగా బిగ్ బాస్ హౌస్లో ప్రేరణ తనదైన గేమ్ తో ఆకట్టుకుంటుంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పొచ్చు. 14 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్న బిగ్ బాస్ తెలుగు 8 నుండి బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యింది. రెండో వారం ఎలిమినేషన్ లిస్ట్ లో విష్ణుప్రియ, నాగ మణికంఠ, శేఖర్ బాషా, నిఖిల్, సీత, నైనిక, పృథ్విరాజ్, ఆదిత్య ఓం ఉన్నారు. 

 

బిగ్ బాస్ హౌజ్ నుంచి రెండో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

66
Vishnu priya bigg Boss8

Vishnu priya bigg Boss8

టాప్ సెలెబ్స్ నామినేషన్స్ లో ఉండగా ఎవరు ఇంటిని వీడినా సంచలనమే. విష్ణుప్రియ వరుసగా రెండో వారం కూడా నామినేట్ అయ్యింది. ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు. విష్ణుప్రియకు ప్రేక్షకుల్లో పాజిటివిటీ పెరిగింది. సోనియా ఆకుల చేసిన నెగిటివ్ కామెంట్స్ విష్ణుప్రియకు ప్లస్ అయ్యాయి.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌, కంటెస్టెంట్లు వీరేనా.. సరికొత్త ట్విస్ట్ తో
Recommended image2
Patas Praveen: ఫైమాతో లవ్‌ బ్రేకప్‌పై ఓపెన్‌ అయిన పటాస్‌ ప్రవీణ్‌.. దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్‌
Recommended image3
Suma Kanakala: కారు దిగి నడిరోడ్డు మీద పరిగెత్తిన యాంకర్ సుమ, కారణం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved