ముగింపు దశలో ఓటింగ్, ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
మూడో వారానికి గాను విష్ణుప్రియ, సీత, ప్రేరణ, యష్మి గౌడ, అభయ్, నాగ మణికంఠ, పృథ్విరాజ్, నైనిక నామినేషన్స్ లో ఉన్నారు. శుక్రవారంతో ఓటింగ్ లైన్స్ ముగియనున్నాయి. ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ కొనసాగుతోంది.
మరో వీకెండ్ వచ్చేస్తుంది. అంటే బిగ్ బాస్ హౌస్ నుండి ఒకరు ఎలిమినేట్ అయ్యేందుకు సమయం దగ్గర పడింది. 14 మంది సెలెబ్స్ తో మొదలైన సీజన్ 8లో రెండు ఎలిమినేషన్స్ చోటు చేసుకున్నాయి.
Bigg boss telugu 8
ఫస్ట్ వీక్ బెజవాడ బేబక్క ఎలిమినేటైన సంగతి తెలిసిందే. ఈ సోషల్ మీడియా స్టార్ హౌస్లో సత్తా చాటుతుందని ప్రేక్షకులను భావించారు. కానీ ఆమె తేలిపోయింది. బేబక్క వయసు రీత్యా ఫిజికల్ టాస్క్ లలో ఇబ్బందిపడేవారు. అలాగే ఆమెలో ఫైర్, అగ్రెషన్ లేకపోవడం మైనస్ అయ్యింది.
రెండో వారం షాకింగ్ ఎలిమినేషన్ చోటు చేసుకుంది. ఫైనలిస్ట్స్ లో ఒకడని ఆడియన్స్ ఫిక్స్ అయిన... శేఖర్ బాషా నిష్క్రమించాడు. శేఖర్ బాషా ఫస్ట్ వీక్ నుండి హౌస్లో ప్రత్యేకత చాటుకుంటున్నాడు. ఈ సీజన్ కి గాను ఎంటర్టైనర్ గా అవతరించాడు. అతని పంచులు, జోక్స్ కొంత మేర ఆడియన్స్ ఎంజాయ్ చేసేవారు.
Bigg boss telugu 8
సాధారణంగా ఆడియన్స్ ఓట్ల ఆధారంగా ఎలిమినేషన్ ఉంటుంది. శేఖర్ బాషా మాత్రం భిన్నంగా ఎలిమినేట్ అయ్యాడు. తోటి కంటెస్టెంట్స్ అతన్ని ఇంటి నుండి బయటకు పంపారు. శేఖర్ బాషా-ఆదిత్య ఓం లలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. అది ఎవరో డిసైడ్ చేయాలని హోస్ట్ నాగార్జున, కంటెస్టెంట్స్ ని కోరాడు. మెజారిటీ కంటెస్టెంట్స్ శేఖర్ బాషా ఎలిమినేట్ కావాలని కోరుకున్నారు.
బేబక్క, శేఖర్ బాషా ఎలిమినేషన్ అనంతరం హౌస్ 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. మూడవ వారానికి గాను విష్ణుప్రియ, సీత, ప్రేరణ, యష్మి, నైనిక, అభయ్, నాగ మణికంఠ, పృథ్విరాజ్ నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు ఇంటిని వీడాల్సి ఉంది.
ఓటింగ్ చివరి దశలో ఉంది. శుక్రవారం అర్ధరాత్రి నుండి ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవుతాయి. కొన్ని గంటల సమయం మాత్రమే ఉండగా.. ఎలిమినేట్ అయ్యేది ఎవరనే ఉత్కంఠ నెలకొంది. బిగ్ బాస్ అధికారిక ఓటింగ్ చాలా సీక్రెట్. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది, బయటపెట్టరు.
అయితే పలు మీడియా సంస్థలు అనధికారిక పోల్స్ నిర్వహిస్తాయి. మెజారిటీ పోల్స్ ఫలితాల ఆధారంగా మనం ఒక నిర్ణయానికి రావచ్చు. ఈ అనధికారిక పోల్స్ సమాచారం ప్రకారం... విష్ణుప్రియకు అత్యధికంగా ఓట్లు పోల్ అవుతున్నాయట. విష్ణుప్రియకు ఉన్న ఫేమ్ ఆమెకు ఓట్లు తెచ్చిపెడుతుంది.
గేమ్ పరంగా విష్ణుప్రియ అంత స్ట్రాంగ్ గా లేదు. గుడ్లు సేకరించే టాస్క్ లో ఆమె రూడ్ గా బిహేవ్ చేసింది. సోషల్ మీడియాలో ఒకింత వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. నాగ మణికంఠ, యష్మి గౌడ, ప్రేరణలు కూడా ఓటింగ్ లో ముందంజలో ఉన్నారని సమాచారం.
చివరి నాలుగు స్థానాల్లో నైనిక, సీత, అభయ్, పృథ్విరాజ్ ఉన్నారట. నైనిక సేఫ్ అంటున్నారు. ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. అభయ్, పృథ్విరాజ్ ల కంటే సీత మెరుగైన ఓట్లు రాబట్టిందట. తాజా సమాచారం ప్రకారం.. పృథ్విరాజ్, అభయ్ డేంజర్ జోన్లో ఉన్నారట.
పృథ్విరాజ్ చాలా అగ్రెసివ్ గా గేమ్ ఆడుతున్నాడు. కోపంలో బూతులు మాట్లాడుతన్నాడు. పృథ్విరాజ్ బిహేవియర్ ఆమోదయోగ్యం కాదు. అయినప్పటికీ బిగ్ బాస్ మేకర్స్ అలాంటి కంటెస్టెంట్స్ ని కోరుకుంటారు. కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్ ని వదులుకోరు. నాగార్జున మరోసారి వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది.
పృథ్విరాజ్ ఎలిమినేట్ కాకపోవచ్చు. కాబట్టి కిరాక్ సీత, అభయ్ లలో ఒకరు ఇంటిని వీడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అభయ్ నవీన్ ఎలిమినేట్ కావచ్చు. అతడు గేమ్ పరంగా వెనుకబడ్డాడు. అలాగే అతనిలో ఎలాంటి ప్రత్యేకత లేదు. అయితే బిగ్ బాస్ హౌస్లో ఏదైనా జరగొచ్చు. అధికారిక ఎలిమినేషన్ వరకు ఎవరనేది చెప్పలేం..