ఒక్కరోజులో తారుమారైన ఓటింగ్, డేంజర్ జోన్లో లేడీ కంటెస్టెంట్స్, నబీల్ దెబ్బకు అందరూ షాక్
బిగ్ బాస్ షోలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. దానికి తాజా పరిణామం గట్టి ఉదాహరణ. నిన్నటి వరకు ఓటింగ్ లో ముందున్నవారు వెనక్కి, వెనకున్న వారు ముందుకు వెళ్లారు.
Bigg boss telugu 8
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ముగియడానికి మరో వారం మాత్రం మిగిలి ఉంది. సెప్టెంబర్ 1న మొదలైన లేటెస్ట్ సీజన్ 14 వారాలు పూర్తి చేసుకుని చివరి వారంలో అడుగుపెట్టనుంది. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో 14 మంది సెలెబ్స్ ని ప్రవేశపెట్టారు. ఐదు వారాల అనంతరం మరో 8 మంది మాజీ కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డు ద్వారా పంపించారు. మొత్తంగా 22 మంది కంటెస్ట్ చేశారు.
హౌస్లో గౌతమ్, ప్రేరణ, నిఖిల్, రోహిణి, అవినాష్, నబీల్, విష్ణుప్రియ ఉన్నారు. టికెట్ టు ఫినాలే గెలుచుకున్న అవినాష్ నేరుగా ఫైనల్ కి వెళ్ళాడు. మిగిలిన ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో నలుగురు మాత్రమే ఫైనల్ కి వెళతారు. ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. ఒకటి రెగ్యులర్ ఎలిమినేషన్, మరొకటి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండొచ్చు. గత సీజన్లో మాదిరి ఒకరిని ఎలిమినేట్ చేసి ఆరుగురిని ఫైనల్ కి పంపినా ఆశ్చర్యం లేదు.
ఈసారి ప్రేక్షకుల ఓటింగ్ చాలా కీలకం. ఎలిమినేషన్ నుండి బయటపడితే.. ఫైనల్ లో పాల్గొనే ఛాన్స్ దక్కుతుంది. ఓటింగ్ సరళి గమనిస్తే... డే వన్ నుండి గౌతమ్ టాప్ లో ఉంటున్నాడు. అతడికి నిఖిల్ కంటే ఎక్కువ ఓట్లు పోల్ అవుతున్నాయట. నిఖిల్ రెండో స్థానానికి పరిమితం అవుతున్నాడు. ఇక మూడో స్థానంలో ప్రేరణ ఉంది. టాప్ 3 లో గౌతమ్, నిఖిల్, ప్రేరణ ఉన్నారు. రోహిణి, విష్ణుప్రియ, నబీల్ వరుసగా తర్వాత స్థానాల్లో ఉన్నారు..
శుక్రవారం అర్ధరాత్రి ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవుతాయి. అంటే మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఒక్కరోజులో ఓటింగ్ అనూహ్యంగా మార్పు చెందింది. చివరి స్థానాల్లో ఉన్న నబీల్ మూడో స్థానానికి వెళ్లిపోయాడు. డేంజర్ జోన్లో ఉన్న మరో కంటెస్టెంట్.. విష్ణుప్రియ నాలుగో స్థానంకి ఎగబాకింది. సేఫ్ జోన్లో ఉన్న ప్రేరణ, రోహిణి డేంజర్ జోన్లోకి వచ్చారు.
ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం రోహిణి, ప్రేరణలలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. నిజంగా ఇది ఊహించని పరిణామం అని చెప్పాలి. సోషల్ మీడియాలో కన్నడ, వెర్సెస్ తెలుగు అనే చర్చ నడుస్తుంది. అది గౌతమ్ కి ఫేవర్ చేస్తుంది. ఈ కారణంగానే నబీల్, విష్ణుప్రియ ఓటింగ్ లో దూసుకువెళ్లారని తెలుస్తుంది. ప్రేరణ టాప్ త్రీ నుండి కిందకు పడిపోయింది.
కాగా ఇది అనధికారిక ఓటింగ్ మాత్రమే. పలు మీడియా సంస్థలు నిర్వహించే పోల్స్ ఆధారంగా నిర్ణయించిన ఫలితాలు. అధికారిక పోలింగ్ స్టార్ మా వెల్లడించదు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో శనివారం సాయంత్రానికి క్లారిటీ వస్తుంది. ఇక టైటిల్ రేసులో నిఖిల్, గౌతమ్ ఉన్నారు. గెలిచేది ఎవరో చూడాలి...
కాగా ఇది అనధికారిక ఓటింగ్ మాత్రమే. పలు మీడియా సంస్థలు నిర్వహించే పోల్స్ ఆధారంగా నిర్ణయించిన ఫలితాలు. అధికారిక పోలింగ్ స్టార్ మా వెల్లడించదు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో శనివారం సాయంత్రానికి క్లారిటీ వస్తుంది. ఇక టైటిల్ రేసులో నిఖిల్, గౌతమ్ ఉన్నారు. గెలిచేది ఎవరో చూడాలి...