MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • ఐదేళ్ల ప్రేమ కథ, పెళ్లి వరకు వెళ్ళాక బ్రేకప్... బిగ్ బాస్ కిరాక్ సీత అందుకే బేబీ మూవీకి కనెక్ట్ అయ్యిందట!

ఐదేళ్ల ప్రేమ కథ, పెళ్లి వరకు వెళ్ళాక బ్రేకప్... బిగ్ బాస్ కిరాక్ సీత అందుకే బేబీ మూవీకి కనెక్ట్ అయ్యిందట!

బిగ్ బాస్ షోలో తన మార్క్ గేమ్ తో ఆకట్టుకుంటుంది కిరాక్ సీత. బేబీ మూవీతో ఫేమ్ తెచ్చుకున్న కిరాక్ సీతకు కూడా బ్రేకప్ స్టోరీ ఉందట. ఐదేళ్ల ప్రేమ పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయిందట.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Sep 10 2024, 11:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Kirrak Seetha

Kirrak Seetha

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 1 ఘనంగా మొదలైంది. సక్సెస్ఫుల్ గా మొదటి వారం పూర్తి చేసుకుంది. 14 మంది సెలెబ్స్ కంటెస్టెంట్స్ గా హౌస్లో అడుగుపెట్టారు. వారిలో కిరాక్ సీత ఒకరు. కిరాక్ సీత యూట్యూబ్ వీడియోలతో పాప్యులర్ అయ్యింది. బోల్డ్ కంటెంట్ తో యువతను ఆకర్షించింది. సోషల్ మీడియాలో ఆమెకున్న ఇమేజ్ రీత్యా బేబీ మూవీలో ఆఫర్ దక్కింది.

26
Kirrak Seetha

Kirrak Seetha

దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన బేబీ చిత్రంలో కిరాక్ సీత ఓ కీలక పాత్ర దక్కించుకుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు చేసిన బేబీ మూవీ బ్లాక్ బస్టర్ అందుకుంది. అత్యధిక లాభాలు పంచిన టాలీవుడ్ చిత్రాల జాబితాలో నిలిచింది. బేబీ వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. 

36

బేబీ సక్సెస్ నేపథ్యంలో కిరాక్ సీత పేరు మీడియాలో ప్రముఖంగా వినిపించింది. ఆ పాపులారిటీ కిరాక్ సీతకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చేలా చేసింది. బేబీ మూవీ విడుదల అనంతరం కిరాక్ సీత ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర కామెంట్స్ చేసింది. 
 

46

తనకు కూడా క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురయ్యాయని కిరాక్ సీత ఓపెన్ అయ్యారు. ఒక మూవీ ఆఫర్ ఉంది. రూ. 25 లక్షలు ఇస్తారు.. కాకపోతే నిర్మాతను కలవడానికి ఫార్మ్ హౌస్ కి వెళ్లాలి. ఫారిన్ ట్రిప్ కి వెళ్ళాలి అన్నారు. కెరీర్ బిగినింగ్ లోనే ఇంత పెద్ద రెమ్యూనరేషన్ ఎందుకు ఇస్తున్నారు, అనే సందేహం కలిగింది. 

తర్వాత నాకు విషయం అర్థమైంది. నాకు ఆఫర్ వద్దని చెప్పాను, అని కిరాక్ సీత అన్నారు. బేబీ మూవీ చూసి తాను కూడా ఏడ్చేసినట్లు కిరాక్ సీత వెల్లడించారు. అందుకు కారణం.. బేబీ మూవీ క్లైమాక్స్ ఏమిటో దర్శకుడు ఆమెకు చెప్పలేదట. ట్రాజిక్ ఎండింగ్ చూసి కిరాక్ సీత ఎమోషనల్ అయ్యిందట. 

56

నా జీవితంలో కూడా లవ్ బ్రేకప్ ఉంది. అందుకే బేబీ మూవీ నాకు కనెక్ట్ అయిందేమో, అన్నారు. తన ప్రేమ కథ వివరిస్తూ... ఐదేళ్లు నేను ఓ అబ్బాయితో రిలేషన్ లో ఉన్నాను. పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నాము. కానీ ఆ అబ్బాయి పేరెంట్స్ ఒప్పుకోలేదు. ప్రేమ కంటే పేరెంట్స్ ముఖ్యం కదా అని నేను నా ప్రేమను వదిలేశాను. ఒకరినొకరు మోసం చేసుకోవడం లాంటివి ఏమీ లేవు, అన్నారు కిరాక్ సీత. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి రెండో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?


 

66

ఆ విధంగా కిరాక్ సీత ప్రేమ కథకు ఎండ్ కార్డు పడిందట. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో కిరాక్ సీత ఒకరు. పాయింట్స్ గట్టిగా మాట్లాడుతూ కిరాక్ సీత తన మార్క్ గేమ్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. సెకండ్ వీక్ నామినేషన్స్ లో కిరాక్ సీత-సోనియా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: ప్రభావతితో మీనా ఛాలెంజ్, సంజూని వణికించిన పూలగంప
Recommended image2
Karthika Deepam 2 Today Episode:దీప‌ అనాథ కాదన్న దశరథ-షాక్ అయిన జ్యో-దశరథ ఎమోషనల్-జ్యో డౌట్ క్లియర్?
Recommended image3
ఆకలి తీర్చినందుకే ఆ డైరెక్టర్ నన్ను హీరో చేశాడు.. రూ. 3 కోట్లతో సినిమా తీశాడు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved