MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • నాగ మణికంఠ పరువు తీసిన శ్రీముఖి.. విగ్గు మేటర్ అలా రిపీట్!

నాగ మణికంఠ పరువు తీసిన శ్రీముఖి.. విగ్గు మేటర్ అలా రిపీట్!

బిగ్ బాస్ హౌస్లో ఉన్న నాగ మణికంఠ పరువు తీసేసింది శ్రీముఖి. స్టార్ ఛానల్ లో ప్రసారం అవుతున్న ఓ షోలో కంటెస్టెంట్ ని ట్రోల్ చేయడం చర్చకు దారి తీసింది.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Sep 10 2024, 06:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నాగ మణికంఠ బిగ్ బాస్ తెలుగు  8 కంటెస్టెంట్స్ లో ఒకరు. హౌస్లో ఉన్న యంగెస్ట్ కంటెస్టెంట్ అని చెప్పొచ్చు. నాగ మణికంఠ ఇంట్లో పరిస్థితులను అర్థం చేసుకోవడంలో తడబడ్డాడు. మొదట్లో ప్రతి చిన్న విషయానికి ఏడుపు లంకించుకునేవాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
Bigg boss telugu 8

Bigg boss telugu 8

నామినేషన్స్ డేలో నాగ మణికంఠ మరింత ఎమోషనల్ అయ్యాడు. తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ బయటపెట్టాడు. బాల్యంలోనే తండ్రి చనిపోతే తల్లి వేరే పెళ్లి చేసుకుంది. పెంపుడు తండ్రి వలన అవమానాలు, కష్టాలు పడ్డాను. చివరికి నా తల్లి మరణిస్తే దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేక అడుక్కున్నాను, అంటూ ఏడ్చేశాడు. దాంతో నాగ మణికంఠ సింపతీ గేమ్ ఆడుతున్నాడన్న విమర్శలు వెల్లువెత్తాయి. 


 

36
Bigg Boss Telugu 8

Bigg Boss Telugu 8

అనంతరం బెడ్ పై ఏడుస్తూ నాగ మణికంఠ.. ఇంతకంటే ట్రాన్స్పరెంట్ గా ఉండలేను బిగ్ బాస్. హౌస్ నుండి బయటకు వెళ్ళాక నా జీవితం ఏమవుతుందో తెలియదని కన్నీరు పెట్టుకున్నాడు. అప్పటి వరకు నాగ మణికంఠ విగ్ వాడుతున్నాడన్న విషయం ఎవరికీ తెలియదు. నాగ మణికంఠ విగ్ విసిరేసిన వీడియో బాగా ట్రోల్ అయ్యింది. సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరిగింది. 

46

బిగ్ బాస్ షోపై ఈ ఎపిసోడ్ లో కామెడీ చేశారు. ఈ క్రమంలో బ్రహ్మముడి ఫేమ్ దీపికా రంగరాజ్ శ్రీముఖి సమక్షంలో నాగ మణికంఠను ట్రోల్ చేసింది. నెత్తిపై ఉన్న విగ్గును విసిరికొట్టింది. ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో 100వ ఎపిసోడ్ ప్రోమోలో నాగ మణికంఠను దీపిక ఇమిటేట్ చేయడం చర్చకు దారి తీసింది. సొంత ఛానల్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ పై ట్రోల్స్ ఏంటని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 

బిగ్ బాస్ హౌజ్ నుంచి రెండో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

56

కాగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ కమ్ రివ్యూవర్ గీతూ రాయల్ ఈ విషయంలో నాగ మణికంఠకు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. నాగ మణికంఠ విగ్గు తీసేయడాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు.అది పూర్తి విగ్గు కూడా కాదు. జస్ట్ ఎక్స్టెన్షన్ వాడాడు. గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఇవన్నీ తప్పదు. మహేష్ బాబుకు జుట్టు పలుచబడితే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోలేదా... అని ఆమె అన్నారు. 

 

66
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

నాగ మణికంఠ విషయంలో మహేష్ బాబును ఆమె ఉదహరించడం వివాదమైంది. మహేష్ బాబు ఫ్యాన్స్ గీతూ రాయల్ పై ఫైర్ అయ్యారు. ఆమెకు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు నాగ మణికంఠ స్ట్రాంగ్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అతని గేమ్ లో కొంత పరిపక్వత వచ్చింది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Folk Song: యూట్యూబ్‍లో 110 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్..ఈ పాట వింటే ప్రతి ఒక్కరి గుండె బరువెక్కాల్సిందే
Recommended image2
Kalyan Padala: తెరపైకి కళ్యాణ్‌ పడాల.. తన లవ్‌ స్టోరీనే బహిర్గతం చేయబోతున్న బిగ్‌ బాస్‌ విన్నర్‌
Recommended image3
Trisha Krishnan: విజయ్ ప్రత్యర్థులతో చేతులు కలిపిన త్రిష..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved