రాజకీయాల్లోకి పల్లవి ప్రశాంత్, ఏ పార్టీకి మద్దతు?... క్లారిటీ ఇచ్చిన రైతుబిడ్డ!
బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ రాజకీయాల్లోకి రానున్నాడా? వస్తే ఏ పార్టీకి మద్దతు?... ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చాడు రైతుబిడ్డ. మీడియా ముఖంగా అసలు మేటర్ బయటపెట్టాడు.

తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీ అయిపోయాడు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్. ప్రస్తుతం అతడు తెలియని బుల్లితెర ప్రేక్షకుడు లేడు. పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియా సెలబ్రిటీ కావాలనుకున్నాడు. వ్యవసాయం చేస్తున్న వీడియోలు పోస్ట్ చేశాడు. అలా రైతుబిడ్డగా పాప్యులర్ అయ్యాడు.
ఒక కామనర్ హోదాలో హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ పై ఎలాంటి అంచనాలు లేవు. వారాలు గడిచే కొద్దీ పల్లవి ప్రశాంత్ తన గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చాడు. టాస్క్ లలో సత్తా చాటుతూ, మంచి ప్రవర్తతో పల్లవి ప్రశాంత్ అభిమానులు సొంతం చేసుకున్నాడు. మెజారిటీ ఆడియన్స్ పల్లవి ప్రశాంత్ ని ఇష్టపడటం స్టార్ట్ చేశారు.
తోటి కంటెస్టెంట్స్ లో కొందరు పల్లవి ప్రశాంత్ ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ప్రశాంత్ కృంగిపోకుండా మరింత కసితో ఆడి టైటిల్ గెలిచాడు. పలు మీడియా సంస్థలు జరిపిన సర్వేలలో పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అని తేలింది. శివాజీ, అమర్, ప్రశాంత్ మధ్యే టైటిల్ పోరు అన్నారు. పోల్స్ చెప్పినట్లే ఈ ముగ్గురు టాప్ 3లో నిలిచారు. శివాజీ సెకండ్ రన్నర్, అమర్ ఫస్ట్ రన్నర్ అయ్యారు.
పల్లవి ప్రశాంత్ గెలిచాడన్న న్యూస్ సోషల్ మీడియాలో లీకైంది. దాంతో డిసెంబర్ 17 ఆదివారం పెద్ద సంఖ్యలో అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నారు. పల్లవి ప్రశాంత్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. పల్లవి ప్రశాంత్ కారులో ఊరేగింపుగా సన్మాన సభ వద్దకు వెళ్ళాడు. ఫ్యాన్స్ ఆయన కోసం వేదిక ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మీడియా పల్లవి ప్రశాంత్ ని అనేక ప్రశ్నలు అడిగారు. ముందుగా చెప్పినట్లే గెలిచిన డబ్బులు పేద రైతులకు సహాయం చేయడానికి ఖర్చు చేస్తాను అన్నాడు. చాలా మంది అమర్ గురించి అడిగారు. అమర్ నీ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాడు. నాగార్జున ఎందుకు సారీ చెప్పలేదని అడిగారు. నాకు తెలియదని పల్లవి ప్రశాంత్ చెప్పాడు. అమర్ నన్ను గుంజుకుంటూ తీసుకెళ్లాడు. అప్పుడు బాధేసింది అన్నాడు.
రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? వస్తే, మీ సపోర్ట్ ఏ పార్టీకి? అని మీడియా ప్రతినిధి ఒకరు అడిగారు. దానికి సమాధానంగా ''నేను ఎప్పుటికీ రైతుబిడ్డగానే ఉంటాను'' అని నవ్వేశాడు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని పల్లవి ప్రశాంత్ చెప్పకనే చెప్పాడు. రైతుబిడ్డగా వ్యవసాయం చేసుకుని జీవిస్తానని వెల్లడించాడు.
బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా ప్రశాంత్ రూ. 35 లక్షల ప్రైజ్ మనీ, రూ. 15 లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్, మారుతీ సుజుకీ బ్రీజా కారు గెలుచుకున్నాడు. ఓ అభిమాని రూ. 15 లక్షలు పైగా విలువ చేసే గిఫ్ట్ బహుమతిగా ఇచ్చాడని సమాచారం...