MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • అమాయకుడైన పల్లవి ప్రశాంత్ నెలకు 10 లక్షలు పోగొట్టుకున్నాడా?

అమాయకుడైన పల్లవి ప్రశాంత్ నెలకు 10 లక్షలు పోగొట్టుకున్నాడా?

పల్లవి ప్రశాంత్ చాలా అమాయకుడు. అతడికి ఓ విషయం తెలియక నెలకు రూ. 10 లక్షలు కోల్పోయాడట. ఈ విషయాన్ని పల్లవి ప్రశాంత్ గురువు శివాజీ వెల్లడించాడు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 03 2024, 06:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్ విన్నర్ గా అవతరించాడు కామనర్ పల్లవి ప్రశాంత్. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్లో అడుగుపెట్టి ఏకంగా టైటిల్ తన్నుకుపోయాడు. పల్లవి ప్రశాంత్ విజయంలో శివాజీ పాత్ర కూడా ఉంది. మొదటి నుండి శివాజీ ప్రశాంత్ ని గైడ్ చేస్తూ వస్తున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నిజానికి శివాజీ టైటిల్ విన్నర్ అని అందరూ భావించారు. వారాలు గడిచే కొద్దీ పల్లవి ప్రశాంత్ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. శివాజీ గ్రాఫ్ పడిపోయింది. తాను టైటిల్ కోల్పోయిన పర్లేదు, పల్లవి ప్రశాంత్ గెలవడం ఎంతో ఆనందంగా ఉందంటూ శివాజీ ఇప్పటికే పలుమార్లు చెప్పాడు. 
 

36

పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుతూ శివాజీ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. పల్లవి ప్రశాంత్ చాలా అమాయకుడు. మంచివాడు అందుకే సపోర్ట్ చేశాను. పల్లవి ప్రశాంత్ కి సోషల్ మీడియా అకౌంట్స్, యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. వాటిని లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఆ అకౌంట్స్ ని మానిటైజ్ చేసుకుంటే డబ్బులు వస్తాయని కూడా ప్రశాంత్ కి తెలియదు. 
 

46

ఆ కారణంగా పల్లవి ప్రశాంత్ నెలకు రూ. 10 లక్షల వరకూ కోల్పోయాడు.  నన్ను కలిశాక పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియా అకౌంట్స్ మానిటైజ్ చేయించాను. అంతటి అమాయకుడు పల్లవి ప్రశాంత్ అని చెప్పుకొచ్చాడు. 

56

బిగ్ బాస్ హౌస్లో స్పై బ్యాచ్ గా శివాజీ, ప్రశాంత్, యావర్ పేరుగాంచారు. అమర్ దీప్, శోభ, ప్రియాంక మరొక బ్యాచ్. సీజన్ మొత్తం స్పై బ్యాచ్ వెర్సస్ స్పా బ్యాచ్ అన్నట్లుగా సాగింది. ఫైనల్ గా స్పై బ్యాచ్ దే పై చేయి అయ్యింది. పల్లవి ప్రశాంత్ విన్నర్ కాగా, శివాజీ మూడో స్థానం, యావర్ నాలుగో స్థానంలో పొందారు. 

 

66

అయితే బిగ్ బాస్ ఫినాలే రోజు జరిగిన రచ్చ పల్లవి ప్రశాంత్ పరువు తీశాయి. పోలీసుల మాట వినకుండా అన్నపూర్ణ స్టూడియో వద్ద హల్చల్ చేసిన పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల అనంతరం బెయిల్ పై విడుదలయ్యాడు. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ ని శివాజీ ఖండించారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmi Gautam: యాంకర్‌ రష్మి ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే, వామ్మో పెద్దదే.. తాను మాత్రమే దారి తప్పిందట
Recommended image2
Rashmi Gautam: సుడిగాలి సుధీర్‌తో సినిమాపై యాంకర్ రష్మి షాకింగ్‌ రియాక్షన్‌.. పేరు పలకడానికి కూడా ఇబ్బంది
Recommended image3
OTT Series: ఓటీటీలో దుమ్ములేపుతున్న సరికొత్త తెలుగు కామెడీ ఫ్యామిలీ సిరీస్‌.. హాట్‌ స్టార్‌లో ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved