Bigg Boss Telugu 7: విన్నర్ ని డిసైడ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్..!
ప్రతి సీజన్ విన్నర్ ని నిర్ణయించే విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈసారి కూడా వారు వారి ఓట్లు కీలకం కానున్నాయి. మరి పవన్ ఫ్యాన్స్ సపోర్ట్ ఎవరికో తెలుసా?

Bigg Boss Telugu 7
పవన్ కళ్యాణ్ టాలీవుడ్ అతిపెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన హీరో. టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు ఆయన చిత్రాలకు దక్కుతాయి. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కలిసి కట్టుగా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా తమ గళం విప్పుతుంటారు. కాగా బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్ ఎవరనేది కూడా నిర్ణయించేది వాళ్లే.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ ఉన్న కంటెస్టెంట్ ఈజీగా గెలుస్తాడు. గతంలో ఇది నిరూపితమైంది. ఎన్టీఆర్ హోస్టింగ్ చేసిన సీజన్ లో టాప్ సెలెబ్స్ పార్టిసిపేట్ చేశారు. శివ బాలాజీ టైటిల్ విన్నర్ అయ్యాడు. తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని శివ బాలాజీ గతంలో పలు సందర్భాల్లో చెప్పారు. పవన్ కళ్యాణ్ తో అన్నవరం మూవీలో కీలక రోల్ చేశాడు.
koushal
సీజన్ 1లో శివ బాలాజీని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు. అతడు విన్నర్ అయ్యాడు. అలాగే సీజన్ 2లో పవన్ ఫ్యాన్స్ కౌశల్ మందాకు సపోర్ట్ చేశాడు. అతడు హౌస్లో పలుమార్లు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాడు. పెద్ద అభిమానిని మనసులో మాట బయట పెట్టాడు.
Bigg Boss Telugu 7
కౌశల్ మందా కోసం కౌశల్ ఆర్మీ పేరుతో ఒక గ్రూప్ తయారైంది. వారు కౌశల్ కి ఓట్లు పడేలా చేశారు. అందులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధికంగా ఉన్నారు. సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ విజయంలో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హస్తం ఉందని సమాచారం.
Bigg Boss Telugu 7
మరి సీజన్ 7లో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారనే సందేహాలు ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం వారు శివాజీ, పల్లవి ప్రశాంత్ లకు సపోర్ట్ చేస్తున్నారట. శివాజీ హౌస్లోకి వస్తూనే పవన్ ఫ్యాన్స్ స్లోగన్ అయిన 'మనల్ని ఎవడ్రా ఆపేది' అని అన్నాడు. తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పకనే చెప్పాడు.
Bigg Boss Telugu 7
వేదిక మీదకు వచ్చిన శివాజీ భార్యకు తాము ఈ పొజీషన్ లో ఉన్నామంటే చిరంజీవి, నాగార్జునలే కారణం అని చెప్పింది. కాబట్టి శివాజీకే మెజారిటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్లు వేస్తున్నారట. ఇక రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ పుష్ప మూవీలో అల్లు అర్జున్ సిగ్నేచర్ స్టైల్ 'తగ్గేదేలే' ఫాలో అవుతున్నాడు. మెగా అభిమానిగా హింట్ ఇచ్చాడు.
Bigg Boss Telugu 7
అలాగే శివాజీ, పల్లవి ప్రశాంత్ తమ ఆట తీరుతో మెప్పించారు. ఈ కారణాలతో ఈ సీజన్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీరిద్దరికీ సపోర్ట్ చేస్తున్నారట. కాబట్టి వీరిలో ఒకరు విన్నర్ అవుతారనే వాదన వినిపిస్తుంది. కాగా అమర్ దీప్ కూడా టైటిల్ రేసులో ఉన్నాడు....