బిగ్ బాస్ 11వ వారం ఓటింగ్ లో షాకింగ్ రిజల్ట్... డేంజర్ జోన్లో వారిద్దరూ! ఎలిమినేట్ అయ్యేదెవరు?
బిగ్ బాస్ తెలుగు 7 ఆసక్తికరంగా సాగుతుంది. 11వ వారానికి 8 మంది హౌస్ మేట్స్ నామినేట్ అయ్యారు. ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిన నేపథ్యంలో షాకింగ్ రిజల్ట్స్ వెలుగుచూస్తున్నాయి.

Bigg Boss Telugu 7
బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకుంది. మరో ఐదు వారాల్లో షో ముగియనుంది. 10వ వారం సింగర్ అండ్ మ్యూజిక్ కంపోజర్ భోలే షావలి ఎలిమినేట్ అయ్యాడు. యావర్-భోలే డేంజర్ జోన్లోకి వచ్చారు. వీరిద్దరిలో యావర్ సేవ్ కాగా భోలే ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. భోలే హుందాగా ఇంటిని వీడాడు.
Bigg Boss Telugu 7
భోలే ఎలిమినేషన్ తో హౌస్లో 10 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. 11వ వారానికి ఇంటి నుండి పంపేందుకు నామినేషన్స్ ప్రక్రియ సోమవారం మొదలైంది. అది మంగళవారం ముగిసింది. తగు కారణాలు చెప్పి ప్రతి హౌస్ మేట్ ఇద్దరు హౌస్ మేట్స్ ని నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. శివాజీ కెప్టెన్ కాగా అతడికి మినహాయింపు దొరికింది.
Bigg Boss Telugu 7
వాడివేడిగా నామినేషన్స్ జరిగాయి. ప్రక్రియ ముగియగా అర్జున్, అమర్, అశ్విని, గౌతమ్, ప్రియాంక, శోభ, యావర్, రతిక నామినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. శివాజీతో పాటు పల్లవి ప్రశాంత్ కూడా నామినేషన్స్ లో లేడు. ఇద్దరు మినహాయించి అందరూ నామినేట్ అయ్యారు.
Bigg Boss Telugu 7
మంగళవారం రాత్రి నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. పలు ఛానల్స్ పోల్స్ నిర్వహిస్తున్నాయి. మెజారిటీ పోల్ రిజల్ట్ ప్రకారం అమర్ దీప్, యావర్, గౌతమ్ స్వల్ప ఓటింగ్ తేడాతో ఫస్ట్ మూడు స్థానాల్లో ఉన్నారట. తర్వాత అర్జున్ ఉన్నాడని సమాచారం. అనంతరం ప్రియాంక, అశ్విని ఉన్నారట.
Bigg Boss Telugu 7
ఈవారం నామినేషన్స్ లో మేల్ కంటెస్టెంట్స్ స్ట్రాంగ్. అమర్, యావర్, గౌతమ్, అర్జున్ లలో ఎవరూ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక సీరియల్ బ్యాచ్ ప్రియాంక, శోభలను స్టార్ మా కాపాడుతూ వస్తుందనే వాదన ఉంది. కాబట్టి ఈ వారం రతిక లేదా అశ్విని ఎలిమినేట్ కావచ్చు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన ఐదుగురిలో ముగ్గురు ఎలిమినేట్ కాగా అర్జున్, అశ్విని మాత్రమే మిగిలారు .
Bigg Boss Telugu 7
చివరి రెండు స్థానాల్లో రతిక ,శోభ ఉన్నారట. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావచ్చని అంటున్నారు. రతిక, శోభ మీద ఆడియన్స్ లో వ్యతిరేకత ఉంది. వీరికి తక్కువ ఓట్లు పోల్ అయ్యే అవకాశం కలదు. గత మూడు వారాలుగా మేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతున్నారు.
ఈవారం నామినేషన్స్ లో మేల్ కంటెస్టెంట్స్ స్ట్రాంగ్. అమర్, యావర్, గౌతమ్, అర్జున్ లలో ఎవరూ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక సీరియల్ బ్యాచ్ ప్రియాంక, శోభలను స్టార్ మా కాపాడుతూ వస్తుందనే వాదన ఉంది. కాబట్టి ఈ వారం రతిక లేదా అశ్విని ఎలిమినేట్ కావచ్చు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన ఐదుగురిలో ముగ్గురు ఎలిమినేట్ కాగా అర్జున్, అశ్విని మాత్రమే మిగిలారు .