- Home
- Entertainment
- TV
- శోభ శెట్టి ఫ్యాన్స్ కోసం ఏం చేసిందో తెలుసా... కప్పు కొడితే ఇంకా ఎలాంటి సర్ప్రైజ్ లు ఇచ్చేదో!
శోభ శెట్టి ఫ్యాన్స్ కోసం ఏం చేసిందో తెలుసా... కప్పు కొడితే ఇంకా ఎలాంటి సర్ప్రైజ్ లు ఇచ్చేదో!
శోభ శెట్టి ఈ వారం ఎలిమినేట్ అయ్యారు. ఆమెకు గ్రాండ్ వెల్కమ్ లభించింది. కాగా తనను కలిసేందుకు వచ్చిన ఫ్యాన్స్ కోసం శోభ చేసిన ఏర్పాట్లకు సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కుతున్నాయి...

సీరియల్ నటి శోభ శెట్టి బిగ్ బాస్ తెలుగు 7లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆమె 14 వారాలు హౌస్లో ఉన్నారు. శోభ శెట్టి ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. అదే సమయంలో ఆమె ప్రవర్తన నెగిటివిటీ కారణమైంది. సోషల్ మీడియాలో శోభ శెట్టిపై విపరీతమైన విమర్శలు వినిపించాయి.
అలాగే శోభ శెట్టి స్టార్ మా ఛానల్ లో సీరియల్ నటిగా ఏళ్ల తరబడి పని చేసింది. ఈ కారణంగా ఆమెను ఎలిమినేట్ చేయడం లేదు. ప్రేక్షకుల ఓట్లను పట్టుంచుకోకుండా ఇష్టం వచ్చిన వాళ్ళను ఎలిమినేట్ చేస్తున్నారనే వాదనలు వినిపించాయి. శోభ శెట్టిని సేవ్ చేసేందుకు టాప్ కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేశారని నెటిజెన్స్ కామెంట్స్ చేశారు.
ఏది ఏమైనా శోభ బిగ్ బాస్ జర్నీ ముగిసింది. బయటకు వచ్చిన శోభ శెట్టికి గ్రాండ్ వెల్కమ్ దక్కింది. ఆమె కోసం అభిమానులు వేచి చూశారు. మీడియా చుట్టుముట్టి శోభ మీద ప్రశ్నల వర్షం కురిపించారు. శోభ ప్రియుడు యశ్వంత్ రెడ్డి వేదిక ఏర్పాటు చేసి చిన్న సభ నిర్వహించాడు.
శోభ ఫ్రెండ్ టేస్టీ తేజా కూడా హాజరయ్యాడు. శోభ శెట్టి వెల్కమ్ సభలో అభిమానులు పాల్గొన్నారు. వీరి కోసం శోభ మంచి భోజనం ఏర్పాటు చేసింది. మటన్, చికెన్ బిర్యానీతో విందు ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అభిమానుల కడుపు నింపాలన్న శోభ ఆలోచనకు ప్రశంసలు దక్కుతున్నాయి. అసలు కప్ కొడితే ఏ రేంజ్ లో ట్రీట్ ఇచ్చేదో అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Shobha Shetty
ఇక మీడియా సంధించిన కొన్ని ప్రశ్నలకు శోభ సమాధానం చెప్పింది. శివాజీతో గొడవ వలనే ఎలిమినేట్ అయ్యారని భావిస్తున్నారా? అని అడగ్గా... శివాజీతో నాకు పెద్దగా ఆర్గుమెంట్ ఏమీ కాలేదు. మేము హౌస్లో 24 గంటలు ఉంటాము. మీరు మాత్రం కేవలం వన్ హౌర్ ఎపిసోడ్ చూస్తారని సమాధానం చెప్పింది.
Shobha Shetty
మీరు సేఫ్ ప్లేయర్ అందుకే ఎలిమినేట్ అయ్యారా? మరొకరు అడగ్గా.. నేను సేఫ్ ఆడితే ఇంకా హౌస్లో ఉండేదాన్ని. ఎలిమినేట్ అయ్యేదాన్ని కాదని శోభ సమాధానం చెప్పింది. అయితే హౌస్లో ఉన్న వాళ్ళు సేఫ్ ప్లేయర్స్ అని మీ అర్థమా? అని అడగ్గా శోభ దగ్గర సమాధానం లేదు.
ఎవరికి మీ సపోర్ట్? విన్నర్ ఎవరు? అనే ప్రశ్నలకు శోభ శెట్టి అస్పష్టంగా స్పందించింది. విన్నర్ ఎవరో మీరు చెప్పాలి. అలాగే నా సపోర్ట్ ఎవరికీ లేదు. నేను వేసే ఒక్క ఓటు వలన గెలవరు. కాబట్టి విన్నర్ ని మీరు డిసైడ్ చేయాలని శోభ శెట్టి చెప్పుకొచ్చింది.
తనను సపోర్ట్ చేసిన అభిమానులకు ధన్యవాదాలు చెప్పిన శోభ శెట్టి, ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించాలి. అంత ఆటలో భాగమే అని చెప్పుకొచ్చారు. వేడుకలు ముగిసిన అనంతరం శోభ శెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది...