Bigg Boss Telugu 7: 13వ నామినేషన్స్ లిస్ట్ లీక్... ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకుంది. ఇంకా మూడు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. 13వ వారానికి నామిషన్స్ ప్రక్రియ మొదలు కాగా లిస్ట్ ఎపిసోడ్ కంటే ముందే లీక్ అయ్యింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
మరో మూడు వారాల్లో బిగ్ బాస్ తెలుగు 7 ముగియనుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. శనివారం అశ్విని శ్రీ ఎలిమినేట్ కాగా, ఆదివారం రతిక ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్లో రతిక, అశ్విని శ్రీ జర్నీ ముగిసింది. అశ్విని వైల్డ్ కార్డు ఎంట్రీ, ఇక రతిక ఒకసారి ఎలిమినేటై సెకండ్ ఛాన్స్ దక్కించుకుంది.
Bigg Boss Telugu 7
రతిక, అశ్విని ఎలిమినేషన్ తో హౌస్లో 8 మంది మిగిలారు. వీరిలో వచ్చే వారం ఒకరు లేదా ఇద్దరు ఎలిమినేట్ కానున్నారు. డబుల్ ఎలిమినేషన్ కి ఛాన్స్ ఉంది. కారణం... 5గురు మాత్రమే ఫైనల్ కి వెళతారు. ఇంకా రెండు ఎలిమినేషన్స్ వీక్స్ మాత్రమే ఉన్నాయి. ముగ్గురు ఎలిమినేట్ కావాలి కాబట్టి డబుల్ ఎలిమినేషన్ కి ఛాన్స్ ఉంది.
Bigg Boss Telugu 7
సోమవారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. తగు కారణాలు చెప్పి ప్రతి కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేయాలి. నామినేట్ చేసిన కంటెస్టెంట్ ముఖానికి రంగు పూయాలని బిగ్ బాస్ ఆదేశించాడు.
అర్జున్, ప్రియాంక, గౌతమ్... శివాజీని నామినేట్ చేశారు. ఈసారి మెజారిటీ కంటెస్టెంట్స్ శివాజీని నామినేట్ చేసినట్లు తెలుస్తుంది. నామినేషన్ ప్రక్రియ ముగియగా శివాజీ, ప్రియాంక, అర్జున్, గౌతమ్, ప్రశాంత్, యావర్, శోభ నామినేట్ అయినట్లు సమాచారం. అమర్ ఈ వారం నామినేషన్స్ లో లేడని సమాచారం. అమర్ ఒక్కడు సేవ్ అయ్యాడు.
Bigg Boss Telugu 7
నేటి సాయంత్రం నుండి ఓటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. నామినేషన్ లో ఉన్న ఏడుగురిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు. అంచనా ప్రకారం శివాజీ, ప్రశాంత్ ఓటింగ్ లో టాప్ లో ఉంటారు. ప్రియాంక కూడా సేవ్ అవుతుంది. ఈ వారం శోభ, యావర్, అర్జున్, గౌతమ్ ల మధ్య ఓటింగ్ టైట్ గా జరిగే అవకాశం ఉంది. వీరిలో ఒకరు ఎలిమినేట్ కావచ్చు...