- Home
- Entertainment
- TV
- Bigg Boss Telugu 7: మిడ్ వీక్ ఎలిమినేషన్... బిగ్ బాస్ కీలక నిర్ణయం, టెన్షన్ లో ఫ్యాన్స్!
Bigg Boss Telugu 7: మిడ్ వీక్ ఎలిమినేషన్... బిగ్ బాస్ కీలక నిర్ణయం, టెన్షన్ లో ఫ్యాన్స్!
బిగ్ బాస్ రియాలిటీ షో ఆడియన్స్ లో ఓ సందిగ్ధత కొనసాగుంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా లేదా? ఉంటే ఎవరు ఇంటిని వీడనున్నారని ఛార్జ్ నడుస్తుంది. అయితే బిగ్ బాస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Bigg Boss Telugu 7
తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ ఫినాలే ఫీవర్ నడుస్తుంది. బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్ విన్నర్ ఎవరనే చర్చ జోరుగా సాగుతుంది. ఫినాలే వీక్ కి ముందు శోభ శెట్టి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఆమె నిష్క్రమణ తర్వాత హౌస్లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. శివాజీ, అర్జున్, అమర్, ప్రశాంత్, యావర్, ప్రియాంకలను ఫైనలిస్ట్స్ గా నాగార్జున ప్రకటించారు.
Bigg Boss Telugu 7
ప్రతి సీజన్ కి ఐదుగురు మాత్రమే ఫైనల్ కి వెళతారు. ఆరో కంటెస్టెంట్ ఫైనల్ వీక్లో అడుగుపెట్టినప్పటికీ మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తారు. సీజన్ 6లో ఆరుగురు ఫైనల్ కి వెళ్లారు. శ్రీసత్య మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యింది. అర్థరాత్రి లేచి బట్టలు సర్దుకుని వెళ్ళిపోయింది.
Bigg Boss Telugu 7
సీజన్ 7లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే అర్జున్, ప్రియాంక, యావర్ లలో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఓటింగ్ లో ఈ ముగ్గురు వెనుకబడ్డారు. ప్రియాంక లేడీ కంటెస్టెంట్. కాబట్టి ఫైనల్ లో ఒక్క లేడీ కంటెస్టెంట్ అయినా ఉండాలి. ఈ కారణంగా ప్రియాంక సేఫ్. అర్జున్, యావర్ లలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సీజన్ కి మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదంటున్నారు. ఆరుగురు కంటెస్టెంట్స్ ఫైనల్ కి వెళతారట. వీరిలో ఒకరు టైటిల్ విన్నర్ కానున్నారు. ఇక టైటిల్ పోరు శివాజీ, అమర్, ప్రశాంత్ మధ్యనే అంటున్నారు. ఈ ముగ్గురి మధ్య టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది.
Bigg Boss Telugu 7
అనధికారిక పోల్స్ లో పల్లవి ప్రశాంత్ దూసుకుపోతున్నాడు. అతడికి యాభై శాతానికి పైగా ఓట్లు నమోదు అవుతున్నాయి. ఇక రెండో స్థానం కోసం శివాజీ, అమర్ పోటీ పడుతున్నారు. పలు మీడియా సర్వేల ఫలితాల్లో ప్రశాంత్ దూసుకుపోతున్నాడు. మిస్డ్ కాల్, హాట్ స్టార్ ఓటింగ్ రిజల్ట్ విన్నర్ ని డిసైడ్ చేయనున్నాయి.