- Home
- Entertainment
- TV
- Bigg Boss 7 Grand Finale: శివాజీ టాప్ సీక్రెట్ లీక్ చేసిన కొడుకు రిక్కీ... అందుకే హౌస్లోకి వచ్చాడట!
Bigg Boss 7 Grand Finale: శివాజీ టాప్ సీక్రెట్ లీక్ చేసిన కొడుకు రిక్కీ... అందుకే హౌస్లోకి వచ్చాడట!
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి టాప్ 6 కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు వచ్చారు. శివాజీ కోసం ఇద్దరు కొడుకు కెన్నీ, రిక్కీ వచ్చారు. చిన్న కొడుకు రిక్కీ తండ్రి టాప్ సీక్రెట్ బయటపెట్టాడు.

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా సాగుతుంది. ఎలిమినేటైన ఎక్స్ హౌస్ మేట్స్ తో పాటు టాప్ 6లో ఉన్న కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. శివాజీ కోసం కెన్నీ, రిక్కీ వచ్చాడు. ఫ్యామిలీ వీక్ లో శివాజీని కలిసేందుకు పెద్ద కొడుకు కెన్నీ వచ్చాడు. హౌస్లోకి వచ్చినప్పుడు త్వరలో పై చదువులకు అమెరికా వెళ్ళాలి అని చెప్పాడు. అందరు కుటుంబ సభ్యులతో మాట్లాడిన నాగార్జున శివాజీ కొడుకులతో కూడా ముచ్చటించాడు.
Bigg Boss Telugu 7
ఏంటి కెన్నీ నువ్వు యూఎస్ వెళ్ళాలి అన్నావు కదా? అని అడిగాడు. ఓ కారణంగా ఆగిపోయాను. నెక్స్ట్ బుధవారం వెళుతున్నానని చెప్పాడు. తర్వాత చిన్న కొడుకు రిక్కీతో మాట్లాడాడు. ఏం రిక్కీ... మీ నాన్న కనీసం నాలుగు వారాలు ఉండలేవని ఎగతాళి చేశావట. ఏకంగా ఫైనల్ వరకు వచ్చాడు అని నాగార్జున ప్రశ్నించాడు. ఈ విషయంలో నాన్న గురించి ఒక సీక్రెట్ చెప్పాలి సర్. ఆయన మీద రివర్స్ సైకాలజీ ప్లే చేయాలి. బిగ్ బాస్ షోకి పంపాలని నేను అలా రెచ్చగొట్టాను. అందుకే ఆయన బిగ్ బాస్ షోకి వచ్చారని చెప్పాడు.
Bigg Boss Telugu 7
ఇదే విషయంలో శివాజీతో నాగార్జున చెప్పారు. మీ అబ్బాయి నీ గురించి ఒక టాప్ సీక్రెట్ చెప్పాడు. నీ మీద రివర్స్ సైకాలజీ ప్లే చేయాలట. అందుకే రిక్కీ నువ్వు నాలుగు వారాలు కూడా బిగ్ బాస్ హౌస్లో ఉండలేవని రెచ్చగొట్టాడట అన్నాడు. మరోవైపు టైటిల్ ఎవరిదనే ఉత్కంఠ నడుస్తుంది. శివాజీ, అమర్, ప్రశాంత్, యావర్, అర్జున్, ప్రియాంక ఫైనలిస్ట్స్ గా ఉన్నారు.
కాగా శివాజీ సీజన్ 7 విజేతగా నిలుస్తాడు అని అందరూ భావించారు. ఫ్యామిలీ వీక్ తర్వాత అంతా రివర్స్ అయింది. శివాజీకి వరుసగా నెగిటివ్ ఎపిసోడ్స్ పడటంతో .. అమర్ గ్రాఫ్ పెరిగిపోయింది. దీంతో టైటిల్ చేజారిపోయింది. అయినప్పటికీ విన్నర్ రేసులో అమర్, ప్రశాంత్ లకు గట్టి పోటీ ఇచ్చాడు శివాజీ. కనీసం రన్నర్ గా నిలుస్తారని ఆడియన్స్ అనుకున్నారు .. కానీ ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యాడు.
Bigg Boss Telugu 7
అయితే శివాజీ 15వ వారంలో ఎలిమినేట్ అయ్యాడు. కాగా బిగ్ బాస్ నిర్వాహకులతో శివాజీ భారీ మొత్తానికి ఒప్పందం చేసుకున్నాడట. తాజా సమాచారం ప్రకారం శివాజీ ఒక్క వారానికి రూ. 4. 25 లక్షలు తీసుకున్నాడని తెలిసింది.
Photo credit - star maa
ఆయన రోజుకు 60 వేలకు ఛార్జ్ చేసాడట. అలా 15 వారాల పాటు హౌస్లో ఉన్న శివాజీ మొత్తంగా రూ. 63. 75 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నాడని సమాచారం. ఇది తెలుగు బిగ్ బాస్ చరిత్రలో హైయెస్ట్. ప్రైజ్ మనీ కంటే ఎక్కువగా ఆయన వసూలు చేశారు.