- Home
- Entertainment
- TV
- Bigg Boss 7 Grand Finale Guests: బిగ్ బాస్ ఫినాలే గెస్ట్స్ గా ఇద్దరు స్టార్ హీరోలు!
Bigg Boss 7 Grand Finale Guests: బిగ్ బాస్ ఫినాలే గెస్ట్స్ గా ఇద్దరు స్టార్ హీరోలు!
బిగ్ బాస్ తెలుగు 7 అంచనాలకు మించి సక్సెస్ అయ్యింది. సీజన్ 6 ఫెయిల్యూర్స్ నేపథ్యంలో నిర్వాహకులు షోని సరికొత్తగా డిజైన్ చేశారు. టాస్క్స్, ఎలిమినేషన్స్, నామినేషన్స్ విభిన్నంగా రూపొందించారు. కంటెస్టెంట్స్ సైతం శక్తి మేర ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు.

బిగ్ బాస్ తెలుగు 7 అంచనాలకు మించి సక్సెస్ అయ్యింది. సీజన్ 6 ఫెయిల్యూర్స్ నేపథ్యంలో నిర్వాహకులు షోని సరికొత్తగా డిజైన్ చేశారు. టాస్క్స్, ఎలిమినేషన్స్, నామినేషన్స్ విభిన్నంగా రూపొందించారు. కంటెస్టెంట్స్ సైతం శక్తి మేర ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు.
Bigg Boss Telugu 7
షో విజయం సాధించడంతో మేకర్స్ తో పాటు హోస్ట్ నాగార్జున ఫుల్ హ్యాపీగా ఉన్నారు. గత సీజన్లో నాగార్జున విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన హోస్టింగ్ లో పస తగ్గిందనే వాదన వినిపించింది. సీజన్ 7కి హోస్ట్ ని మారుస్తున్నారు. నాగార్జున తప్పుకున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే స్టార్ మా నాగార్జున మీద నమ్మకం ఉంచి... వరుసగా ఐదోసారి హోస్టింగ్ బాధ్యతలు అప్పగించింది.
వాళ్ళ నమ్మకాన్ని నిలబెడుతూ నాగార్జున బిగ్ బాస్ తెలుగు 7ని సక్సెస్ చేసి చూపారు. ఇక ముగింపు మరింత ఆసక్తికరంగా ప్లాన్ చేస్తున్నారట. ఇద్దరు బడా స్టార్స్ ని గెస్ట్స్ గా తీసుకొస్తున్నారని లేటెస్ట్ న్యూస్. వారిలో ఒకరు మహేష్ బాబు కాగా, మరొకరు నందమూరి బాలకృష్ణ అంటున్నారు.
నాగార్జున-బాలయ్య ఎడ మొహం పెడ మొహంగా ఉంటారు. ఆ మధ్య బాలకృష్ణ అక్కినేని బొక్కినేని అంటూ ఫ్లోలో నోరు జారాడు. ఇది వివాదాస్పదం అయ్యింది. మామూలుగానే అక్కినేని కార్యక్రమాలకు బాలయ్య హాజరు కాడు. అలాగే నాగార్జున కూడా బాలకృష్ణ అంత సత్సంబంధాలు కలిగి లేడు. అయితే ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో నాగ చైతన్య పాల్గొన్నాడు.
పర్సనల్ గా ఎన్ని ఉన్నా... బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే గెస్ట్ గా బాలకృష్ణ వస్తున్నాడట. నాగార్జున ఆయన్ని ఆహ్వానించాడట. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఇద్దరు సీనియర్ హీరోలతో బిగ్ బాస్ వేదిక పంచుకుంటారట. ఎటూ గుంటూరు కారం విడుదల సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కోసం కూడా మహేష్ బాబు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే గెస్ట్ గా రావాలని అనుకుంటున్నారట.
ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ప్రస్తుతం హౌస్లో టాప్ 6 ఉన్నారు. శివాజీ, అమర్, ప్రశాంత్, అర్జున్, ప్రియాంక, యావర్ లను ఫైనలిస్ట్స్ గా ప్రకటించారు.
Bigg Boss Telugu 7
మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే... వీరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఇక టైటిల్ పోరు ప్రశాంత్, శివాజీ, అమర్ మధ్య జరగనుంది. మెజారిటీ ఆడియన్స్ వీరిలో ఒకరు విన్నర్ అవుతారని కామెంట్స్ చేస్తున్నారు. ఆదివారం ఉత్కంఠకు తెరపడనుంది.