MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Bigg Boss 7 Grand Finale: రెమ్యునరేషన్ లో శివాజీ రికార్డు... చరిత్రలో మొదటివాడు!

Bigg Boss 7 Grand Finale: రెమ్యునరేషన్ లో శివాజీ రికార్డు... చరిత్రలో మొదటివాడు!

బిగ్ బాస్ తెలుగు 7 విన్నర్ ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. టైటిల్ రేసులో శివాజీ గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఆయన అందరి కంటే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 17 2023, 06:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


బిగ్ బాస్ షో మొదలవుతుంటే అనేక ఊహాగానాలు తెరపైకి వస్తాయి. ఆ సెలబ్రిటీ కంటెస్టెంట్ చేస్తున్నారు అంటూ, హోస్ట్ మారడంటూ... పలు పుకార్లు వినిపిస్తాయి. బిగ్ బాస్ తెలుగు 7 మరో వారం రోజుల్లో ప్రారంభం అవుతుందనగా  శివాజీ పేరు వినిపించింది. నిజంగా అందరూ షాక్ అయ్యారు. ఇది నిరాధార ప్రచారం కూడా కావొచ్చని భావించారు. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

లాంచింగ్ ఎపిసోడ్లో నాగార్జున శివాజీ పేరు ప్రకటించే వరకు కూడా అనుమానంగానే ఉంది. సినిమాలు మానేశాక శివాజీ అనేక వివాదాలు రాజేశాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డాడు. ఏపీ గవర్నమెంట్ మీద బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఒక థీరీ చెప్పాడు. గరుడ పురాణం అంటూ అప్పట్లో అది ఫేమస్. 
 

37

పరోక్షంగా కొందరు హీరోలు, పరిశ్రమ పెద్దల మీద కూడా శివాజీ ఆరోపణలు చేశాడు. శివాజీ నేచర్ కి ఆయన ఎక్కువ రోజులు ఉండరని చాలా మంది భావించారు. కానీ శివాజీ హౌస్లో తన అనుభవాన్ని అంతా ఉపయోగించాడు. సీరియల్ బ్యాచ్ అమర్, శోభ, ప్రియాంక కలిసి ఆడుతున్నారని గ్రహించి ప్రశాంత్, యావర్ లతో తన టీమ్ ఏర్పాటు చేసుకున్నాడు. 

 

47

శివాజీ మైండ్ గేమ్ ఆడుతుంటే... ప్రశాంత్, యావర్ టాస్క్ లలో దుమ్మురేపాడు. వాళ్ళ విజయాలను తన విజయాలుగా శివాజీ చెప్పుకున్నాడు. శివాజీ లేకపోతే ప్రశాంత్, యావర్ లేడు అనే ఒక సందేశం జనాల్లోకి వెళ్లేలా చేశాడు. దాంతో టైటిల్ ఫేవరేట్ అయ్యాడు. అయితే చివరి ఎపిసోడ్లో పల్లవి ప్రశాంత్ మరింత విజృంభించడం, శివాజీకి నెగిటివ్ ఎపిసోడ్స్ పడటం మైనస్ అయ్యింది. 
 

57

అయినా శివాజీ టైటిల్ రేసులో ఉన్నాడు. శివాజీ, ప్రశాంత్, యావర్ టైటిల్ ఫేవరేట్స్ గా ప్రచారం అవుతున్నారు. వీరిలో ఒకరు టైటిల్ విన్నర్ కానున్నారు. కాగా శివాజీ టైటిల్ గెలిచినా గెలవకున్నా అతనికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎందుకంటే... శివాజీ రెమ్యూనరేషన్ గా టైటిల్ విన్నర్ కి మించి తీసుకుంటున్నాడు. 

 

67

విశ్వసనీయ సమాచారం ప్రకారం శివాజీ వారానికి రూ. 4 లక్షల ఒప్పందంపై హౌస్లో అడుగుపెట్టాడట. 15 వారాలకు రూ. 60 లక్షలు ఆయనకు ముట్టనుంది. ఇది తెలుగు బిగ్ బాస్ చరిత్రలో హైయెస్ట్ అంటున్నారు. ఎవరూ రెండు మూడు లక్షలకు మించి తీసుకుంది లేదు. శివాజీ మాత్రం వారానికి నాలుగు లక్షలు వసూలు చేశాడు అంటున్నారు. 

77
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7


ఒక వేళ శివాజీ టైటిల్ కొడితే... రెమ్యునరేషన్, ప్రైజ్ మనీ, బహుమతులు కలుపుకుని ఈజీగా కోటి రూపాయలు గెలుచుకుంటాడు. టైటిల్ గెలవకున్నా అరవై లక్షలతో హ్యాపీగా ఇంటిని వీడుతాడు. ఏ విధంగా చూసినా శివాజీకి లాభమే... 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Jabardasth: నాగబాబు కమ్ బ్యాక్ తో మారిన హైపర్ ఆది తీరు.. అందరి ముందు మాటిచ్చిన స్టార్ కమెడియన్
Recommended image2
Folk Song: యూట్యూబ్‍లో 110 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్..ఈ పాట వింటే ప్రతి ఒక్కరి గుండె బరువెక్కాల్సిందే
Recommended image3
Kalyan Padala: తెరపైకి కళ్యాణ్‌ పడాల.. తన లవ్‌ స్టోరీనే బహిర్గతం చేయబోతున్న బిగ్‌ బాస్‌ విన్నర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved