వచ్చే జన్మలో మీరు నా మొగుడు... అశ్విని శ్రీ కోరికపై నాగార్జున క్రేజీ రియాక్షన్
బిగ్ బాస్ బ్యూటీ అశ్విని శ్రీ హోస్ట్ నాగార్జున మీద తనకున్న కోరిక బయటపెట్టింది. వచ్చే జన్మలో మీరు నాకు కావాలి సర్ అంటూ, ఓపెన్ గా చెప్పేసింది.

Bigg Boss Telugu 7
బిగ్ బాస్ సీజన్ 7 ఫినాలేకు మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. విజేతను ప్రకటించే చివరి ఎపిసోడ్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు. యంగ్ హీరోయిన్స్, ఎలిమినేటైన కంటెస్టెంట్స్ దుమ్మురేపే పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు. ఇక కొత్త చిత్రాల ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, సుమ కనకాల, కళ్యాణ్ రామ్ వంటి స్టార్స్ సందడి చేయనున్నారు.
Bigg Boss Telugu 7
బిగ్ బాస్ సీజన్ 7 లో 19 మంది కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేశారు. వారిలో శివాజీ, అమర్ దీప్, యావర్, ప్రశాంత్, అర్జున్, ప్రియాంక ఫైనలిస్ట్స్ గా ఉన్నారు. వీరిలో ఒకరు టైటిల్ విన్నర్ కానున్నారు. ఒక ఎలిమినేట్ అయిన 13 మంది కంటెస్టెంట్స్ ఆడియన్స్ గ్యాలరీలో కనిపిస్తారు.
Bigg Boss Telugu 7
వీరి కామెంట్స్ షోలో హైలెట్ కానున్నాయి. కాగా అశ్వినిశ్రీ నాగార్జున మీద తనకున్న కోరిక బయటపెట్టింది. మరో జన్మంటూ ఉంటే నాగ్ సర్ నాకు కావాలి. ప్లీజ్ దేవుడా... అని గట్టిగా అరిచేసింది. నాగార్జున పక్కనే ఉన్న యాంకర్ సుమ... వద్దు సర్, అని ఫన్నీ రియాక్షన్ ఇచ్చింది. ఎలిమినేట్ అయ్యారు. భోలే షావలికు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు. భోలేతో అశ్విని శ్రీ స్నేహం చేసింది.
Bigg Boss Telugu 7
అశ్విని శ్రీ కోరికపై నాగార్జున వెంటనే స్పందించాడు. ఐ యామ్ హ్యాపీ విత్ అమల అన్నాడు. నాకు ఎవరూ వద్దు, అమలతో నా జీవితం హ్యాపీగా ఉందని నాగార్జున చెప్పడంతో అందరూ నవ్వేశారు. అది నిజమే సర్ అని అశ్వినిశ్రీ కూడా ఒప్పుకుంది అంత పెద్ద రియాలిటీ షోలో అశ్వినిశ్రీ బోల్డ్ కామెంట్ చేయడం చర్చకు దారి తీసింది.
Bigg Boss Telugu 7
అశ్విని శ్రీ పలు చిత్రాల్లో నటించింది. బిగ్ సీజన్ 7లో ఆమె వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. ఐదు వారాల అనంతరం మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ఫైవ్ కంటెస్టెంట్స్ ని హౌస్లోకి పంపారు. వారిలో అశ్విని శ్రీ ఒకరు.
Bigg Boss Telugu 7
అశ్విని శ్రీ 12వ వారం ఎలిమినేట్ అయ్యింది. ఆ వారం డబుల్ ఎలిమినేషన్ అని తెలిసి కూడా అశ్విని శ్రీ సెల్ఫ్ నామినేట్ అయ్యింది. అశ్విని శ్రీ శనివారం, ఆదివారం రతికా రోజ్ ఎలిమినేట్ అయ్యారు. భోలే షావలికు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు. భోలేతో అశ్విని శ్రీ స్నేహం చేసింది.