- Home
- Entertainment
- TV
- టైటిల్ వద్దని బయటకు వచ్చేసిన అమర్, కన్నీళ్లు పెట్టుకున్న భార్య... ఇంతకీ ఏం జరిగింది?
టైటిల్ వద్దని బయటకు వచ్చేసిన అమర్, కన్నీళ్లు పెట్టుకున్న భార్య... ఇంతకీ ఏం జరిగింది?
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే వేదిక అనేక సంచనాలు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రవితేజ వీరాభిమాని అయిన అమర్ ఏకంగా టైటిల్ వాడుకోవడంతో అందరూ షాక్ అయ్యారు.

Bigg Boss Telugu 7
బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్ విన్నర్ ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. హౌస్లో టాప్ 6 కంటెస్టెంట్స్ అయిన అమర్ దీప్, శివాజీ, పల్లవి ప్రశాంత్, అర్జున్, యావర్, ప్రియాంక ఉన్నారు. గత ఆరు సీజన్స్ లో టాప్ 5 మాత్రమే ఫైనల్ కి వెళ్లారు. ఈ సీజన్లో మాత్రం ఆరుగురు ఫైనలిస్ట్స్ గా ప్రకటించారు.
Bigg Boss Telugu 7
బిగ్ బాస్ ఫినాలే ఈవెంట్ కలర్ఫుల్ గా సాగనుంది. హీరోయిన్స్, మాజీ కంటెస్టెంట్స్ డాన్స్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు. కళ్యాణ్ రామ్ తన డెవిల్ మూవీ ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ ఫినాలేకి వచ్చారు. అలాగే నాగార్జున తాను నటించిన నా సామిరంగా చిత్ర ప్రొమోషన్స్ లో భాగంగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లను ఆహ్వానించాడు.
Bigg Boss Telugu 7
అలాగే సుమ కుమారుడు రోషన్, హీరోయిన్ మానస చౌదరి బబుల్ గమ్ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ ఫినాలేలో సందడి చేశారు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఒక సూట్ కేస్ పట్టుకుని హౌస్లోకి వెళ్లారు. కంటెస్టెంట్స్ కి డబ్బులు ఆఫర్ చేశారు. ఒకరే విన్నర్ అవుతారు కాబట్టి... ఒట్టి చేతులతో వెళ్లకుండా ఈ డబ్బులు తీసుకుని రేసు నుండి తప్పుకోవాలని సలహా ఇచ్చారు.
Bigg Boss Telugu 7
కాగా రవితేజ ఎంట్రీతో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాస్ మహరాజ్ రవితేజకు అమర్ దీప్ వీరాభిమాని. బిగ్ బాస్ హౌస్లో కూడా రవితేజను అనుకరిస్తూ ఉండేవాడు. పవర్ అస్త్ర టాస్క్ లో అమర్ జుట్టు కత్తిరించుకోవాల్సి వచ్చింది. అమర్ అందుకు ససేమిరా ఒప్పుకోలేదు. నేను రవితేజ ఫ్యాన్ ని, ఆయన నా హెయిర్ స్టైల్ చూసి ఒకసారి మెచ్చుకున్నారు. జుట్టు తీయడానికి ఒప్పుకోను అన్నాడు.
Bigg Boss Telugu 7
బిగ్ ఫినాలే వేదికపై రవితేజను చూసిన అమర్ దీప్ ఆనందానికి ఆశ్చర్యానికి గురయ్యాడు. రవితేజ కూడా అమర్ ని చక్కగా పలకరించాడు. కాగా రవితేజ డై హార్డ్ ఫ్యాన్ అమర్ దీప్ కి నాగార్జున ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. బిగ్ బాస్ హౌస్ గేట్లు ఓపెన్ అవుతున్నాయి. నీకు 7 సెకండ్స్ టైం ఇస్తున్నాను. టైటిల్ వద్దనుకుని బయటకు వచ్చేస్తే... నెక్స్ట్ రవితేజ మూవీలో ఆయనతో నటించే అవకాశం నీ సొంతం అవుతుంది, అన్నాడు.
Bigg Boss Telugu 7
రూ. 50 లక్షలు ప్రైజ్ మనీ టైటిల్ వదిలేసి అమర్ దీప్ పరుగున బయటకు వచ్చేశాడు. అమర్ నిర్ణయానికి భార్య తేజస్వినితో పాటు మదర్ షాక్ అయ్యారు. రవితేజకు దిగ్బ్రాంతికి గురయ్యాడు. ఏం మాట్లాడాలో తెలియడం లేదు అన్నాడు. 105 రోజులు అమర్ దీప్ అక్కడ కష్టపడ్డాడు. మీ సినిమాలో ఆఫర్ అనగానే వదిలేసుకు వచ్చాడని చెప్పాడు.
Bigg Boss Telugu 7
బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే ప్రోమో ఇలా కట్ చేశారు. మరి నిజంగా అమర్ దీప్ టైటిల్ రేసు నుండి తప్పుకున్నాడా? నాగార్జున ఏమైనా ట్విస్ట్ ఇస్తాడా అనేది చూడాలి. ఇది ఉల్టా పుల్టా సీజన్, కాబట్టి ఏదైనా జరగొచ్చు.