- Home
- Entertainment
- TV
- Bigg Boss Telugu 7: బిగ్ బాస్ అనూహ్య నిర్ణయం.. టైటిల్ ఒకరికి, రూ. 50 లక్షలు మరొకరికి?
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ అనూహ్య నిర్ణయం.. టైటిల్ ఒకరికి, రూ. 50 లక్షలు మరొకరికి?
బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా ఫల్టా సాగుతున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ నిర్ణయాలు ఒక్కోసారి గేమ్ మార్చేస్తున్నాయి. టైటిల్, ప్రైజ్ మనీ విషయంలో కూడా బిగ్ బాస్ నిర్ణయం అనూహ్యంగా ఉంటుందనే చర్చ మొదలైంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Bigg Boss Telugu 7
బిగ్ బాస్ తెలుగు 7 మరో మూడు వారాల్లో ముగియనుంది. హౌస్లో టాప్ 8 కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఐదుగురు మాత్రమే ఫైనల్ కి వెళతారు. మిగతా ముగ్గురు ఎలిమినేట్ అవుతారు. కాగా టైటిల్ ఫేవరేట్స్ గా ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి.
శివాజీ 10వ వారం వరకు టాప్ లో ఉన్నాడు. అతనిదే టైటిల్ అన్న మాట వినిపించింది. అయితే గత రెండు వారాలుగా శివాజీ గ్రాఫ్ పడిపోతుంది. అమర్ దీప్ కెప్టెన్సీ విషయంలో శివాజీ కొంచెం సాఫ్ట్ గా వ్యవహరించాల్సింది. అమర్ ఏడ్చి గగ్గోలు పెట్టుకున్నా శివాజీ వినలేదు. అది అమర్ కి సింపథీ తెచ్చిపెట్టింది.
Bigg Boss Telugu 7
అదే సమయంలో శివాజీకి జనాల్లో నెగిటివిటీ పెరిగింది. శివాజీ రేసు నుండి తప్పుకుంటే పల్లవి ప్రశాంత్ దే టైటిల్ అని గట్టిగా వినిపిస్తోంది. ప్రధానంగా పోటీ మాత్రం వీరిద్దరి మధ్యే ఉంటుందని అంటున్నారు. శివాజీ-ప్రశాంత్ గురు శిష్యులుగా మెలిగారు. ప్రశాంత్ మంచి ఆట కనబరుస్తూ వస్తున్నాడు.
Bigg Boss Telugu 7
పల్లవి ప్రశాంత్ చెప్పుకోవడానికి చాలా విజయాలు ఉన్నాయి. అతడు 4వ పవర్ అస్త్ర గెలిచాడు. ఈ సీజన్ మొదటి కెప్టెన్ అయ్యాడు. అలాగే అవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు. మొత్తంగా పల్లవి ప్రశాంత్ టైటిల్ కి అర్హుడనే వాదన ఉంది. ఇది ఆడియన్స్ ఓట్ల రూపంలో తెలియజేస్తున్నారు.
ప్రశాంత్ నామినేషన్స్ లో ఉన్న ప్రతిసారి ఓటింగ్ లో టాప్ లో ఉండేవాడు. శివాజీ ఉంటే సెకండ్ ప్లేస్ లో ఉంటాడు. ఈ వారం ఇద్దరూ నామినేషన్స్ లో ఉన్నారు. ఓటింగ్ లో శివాజీని పల్లవి ప్రశాంత్ వెనక్కి నెట్టినట్లు సమాచారం. శివాజీ రెండో స్థానానికి పడిపోయాడట.
Bigg Boss Telugu 7
టైటిల్ రేసులో అమర్ దీప్ కూడా ఉండొచ్చని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఎలిమినేటైన ఆట సందీప్ ఒక షాకింగ్ ఈక్వేషన్ చెప్పారు. ఈసారి కప్ ఒకరికి, ప్రైజ్ మనీ మరొకరికి అన్నారు. శివాజీ మైండ్ గేమ్ బాగా ఆడుతున్నాడు. ఆయన టైటిల్ కి అర్హుడు. ప్రశాంత్ కి కూడా టైటిల్ గెలిచే అర్హత ఉంది. కాబట్టి టైటిల్ శివాజీకి ఇచ్చి, ప్రైజ్ మనీ ప్రశాంత్ కి ఇస్తారు, అన్నాడు.
Bigg Boss Telugu 7
మీకు ఎలా తెలుసంటే... అంతే నాకు అలా తెలిసిపోతాయని సెటైర్ వేశాడు. ఇది సందీప్ అంచనా మాత్రమే ఫైనల్ లో ఏమవుతుంది అనేది చూడాలి. గత సీజన్లో ఇలాగే జరిగింది. ప్రేక్షకుల ఓట్లతో గెలిచిన శ్రీహాన్ డబ్బులు తీసుకుని టైటిల్ రేసు నుండి తప్పుకున్నాడు. దాంతో తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ రేవంత్ విన్నర్ అయ్యాడు.
Bigg Boss Telugu7: అమర్ దీప్ కాకుండా ప్రియాంకపై ఇంకొకరు అటాక్ చేసి ఉంటే.. లాజిక్ పట్టుకున్న శివాజీ..