Bigg Boss Telugu 7: పల్లవి ప్రశాంత్ గెలవాలని అభిమాని సాహసం... ఏం చేశాడో తెలుసా?
రైతుబిడ్డగా హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ ఫేవరేట్ గా మారాడు. అతనికి భారీగా ఫ్యాన్స్ ఏర్పడ్డాడు. కాగా పల్లవి ప్రశాంత్ టైటిల్ కొట్టాలని ఓ అభిమాని సాహసానికి పూనుకున్నాడు.

Bigg Boss Telugu 7
రీల్స్ తో ఫేమస్ అయిన పల్లవి ప్రశాంత్ కి బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ చేయాలనే కోరిక బలంగా ఉండేది. ప్రతి సీజన్ క్రమం తప్పకుండ చూసేవాడు. కొన్ని సీజన్స్ కి వీకెండ్ ఎపిసోడ్ ప్రేక్షకుడిగా కూడా హాజరయ్యాడు. రైతుబిడ్డగా సోషల్ మీడియాలో పాప్యులర్ అయ్యాక, బిగ్ బాస్ షోలో అవకాశం కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాడు.
ఎట్టకేలకు అతడి ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి. సీజన్ 7లో పాల్గొనే ఆఫర్ వచ్చింది. 14 మంది కంటెస్టెంట్స్ లో ఒకడిగా పల్లవి ప్రశాంత్ హౌస్లో అడుగుపెట్టాడు. టాప్ సెలెబ్స్ మధ్య కామనర్ ప్రశాంత్ మీద ఎలాంటి అంచనాలు లేవు. మొదట్లోనే రతిక రోజ్, అమర్ దీప్ అతని మీద అటాక్ స్టార్ట్ చేశారు.
Bigg Boss Telugu 7
హౌస్లో ప్రశాంత్ నిలబడటం కష్టమే అనుకుంటున్న తరుణంలో ప్రశాంత్ తనని తాను నిరూపించుకోవడం స్టార్ట్ చేశాడు. ప్రశాంత్ కి శివాజీ, యావర్ సపోర్ట్ గా నిలిచారు. సీరియల్ బ్యాచ్ అమర్, ప్రియాంక, శోభలకు స్పై బ్యాక్ శివాజీ, ప్రశాంత్, యావర్ ల నుండి గట్టి పోటీ ఎదురైంది.
Bigg Boss Telugu 7
ప్రశాంత్ మొదట పవర్ అస్త్ర గెలిచాడు. అనంతరం బిగ్ బాస్ హౌస్ మొదటి కెప్టెన్ అయ్యాడు. అవిక్షన్ పాస్ కూడా ప్రశాంత్ సొంతం అయ్యింది. టాస్క్ లలో ప్రశాంత్ చిరుతగా విజృంభిస్తాడు. అతడు ఉంటే గెలవలేమని ప్రత్యర్ధులు ఫిక్స్ అయ్యేవాళ్ళు. అంతగా ప్రశాంత్ దడ పుట్టించాడు. షో చివరి దశకు చేరుకోగా అతడు టైటిల్ కొట్టాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు.
Bigg Boss Telugu 7
ఓ అభిమాని పల్లవి ప్రశాంత్ గెలవాలి అంటూ సాహసానికి పూనుకున్నాడు. చిట్యాల గ్రామానికి చెందిన ప్రశాంత్ అభిమాని సైకిల్ యాత్ర చేపట్టాడు. చిట్యాల నుండి బిగ్ బాస్ హౌస్ కి ఆయన సైకిల్ మీద రానున్నాడు. మొత్తంగా 150 కిలోమీటర్లు సైకిల్ యాత్ర పూర్తి చేయనున్నాడు.
Pic Source: Dillu Chityala vlongs
Bigg Boss Telugu 7
స్టార్ హీరోల కోసం అభిమానులు ఇలాంటి యాత్రలు చేస్తారు. అభిమాన బిగ్ బాస్ టైటిల్ గెలవాలని సైకిల్ యాత్ర చేయడం ఇదే మొదటిసారి. అమర్ దీప్ పల్లవి ప్రశాంత్ ని అటాక్ చేస్తున్నాడు. ప్రశాంత్ ని తక్కువగా చూస్తూ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడని ఆ అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు. అమర్ దీప్ అతిగా ప్రవర్తించే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తున్నాడు.
Pic Source: Dillu Chityala vlongs
Bigg Boss Telugu 7
కాగా టైటిల్ పోరు ప్రధానంగా అమర్ దీప్, శివాజీ, ప్రశాంత్ మధ్య జరగనుంది. ఈ ముగ్గురిలో ఒకరు టైటిల్ కొడతారని మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం. అనధికారిక ఓటింగ్లో పల్లవి ప్రశాంత్ ముందంజలో ఉన్నాడు. రెండో స్థానం కోసం శివాజీ, అమర్ పోటీపడుతున్నారు.