టైటిల్ విన్నర్ కంటే అమర్ కే ఎక్కువ క్యాష్... గెలవకపోతే నేమీ!
బిగ్ బాస్ తెలుగు 7 ముగిసింది. పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు. అయితే టైటిల్ విన్నర్ కి మించి అమర్ దీప్ రెమ్యూనరేషన్ గా రాబట్టాడని తెలుస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ సక్సెస్. డిసెంబర్ 17న జరిగిన ఫినాలే ఎపిసోడ్లో పల్లవి ప్రశాంత్ ని విన్నర్ గా ప్రకటించారు. శివాజీ, అమర్ దీప్, అర్జున్, ప్రశాంత్, యావర్, ప్రియాంక ఫైనలిస్ట్స్ గా ఉన్నారు.
మొదట అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు. హౌస్లోకి వెళ్లిన యాంకర్ సుమ ఎలిమినేటైన అర్జున్ ని వేదిక మీదకు తీసుకొచ్చారు. టాప్ 5లో నిలిచిన ప్రియాంక తర్వాత ఎలిమినేట్ అయ్యింది. యావర్ రూ. 15 లక్షలు తీసుకుని టైటిల్ రేసు నుండి తప్పుకున్నాడు. టాప్ 3 లో శివాజీ, అమర్, ప్రశాంత్ మిగిలారు.
శివాజీ కూడా ఎలిమినేట్ అయ్యారు. ఇక టైటిల్ పోరు అమర్-ప్రశాంత్ మధ్య నెలకొంది. టైటిల్ విన్నర్ ఎవరవుతారనే ఉత్కంఠ నడిచింది. ఇద్దరి చేతులు పట్టుకున్న నాగార్జున ప్రశాంత్ చేయి పైకి లేపి విన్నర్ గా ప్రకటించాడు. ఫస్ట్ రన్నర్ గా అమర్ దీప్ నిలిచారు.
అమర్ చివరి వారాల్లో పుంజుకున్నాడు. అయితే పల్లవి ప్రశాంత్ పట్ల అతడు ప్రవర్తించిన తీరు విమర్శలపాలైంది. అతనికి టైటిల్ దూరం కావడానికి ఇది కూడా ఒక కారణం. అమర్ అత్యధికంగా నామినేట్ చేసిన కాంటస్టెంట్స్ లో ప్రశాంత్ ఉన్నాడు. సింపథీ గేమ్ ఆడుతున్నాడని అమర్ ఆరోపణలు చేశాడు.
ఈ క్రమంలో అమర్ దీప్ కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేశారు. కారు అద్దాలు పగలగొట్టి బూతులు తిట్టారు. అమర్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర నుండి ఇంటికి అతికష్టం మీద వెళ్ళాడు. అమర్ పై దాడిని సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ ఖండిస్తున్నారు.
ఇదిలా ఉంటే టైటిల్ చేజారినా అమర్ రెమ్యూనరేషన్ రూపంలో భారీగానే రాబట్టాడట. అమర్ దీప్ వారానికి రూ. 2.5 లక్షల ఒప్పందంపై హౌస్లో అడుగుపెట్టాడట. ఆ లెక్కన అమర్ దీప్ 15 వారాలకు రూ. 37.5 లక్షలు తీసుకున్నాడు. పల్లవి ప్రశాంత్ కేవలం రూ. 15 లక్షలు రెమ్యూనరేషన్ గా తీసుకున్నాడట.