- Home
- Entertainment
- TV
- ప్రియాంక ముందు అమర్, శివాజీ డబుల్ మీనింగ్ డైలాగ్స్... ఒంటరి లేడీ కంటెస్టెంట్స్ ని ఇబ్బంది పెట్టేస్తున్నారుగా!
ప్రియాంక ముందు అమర్, శివాజీ డబుల్ మీనింగ్ డైలాగ్స్... ఒంటరి లేడీ కంటెస్టెంట్స్ ని ఇబ్బంది పెట్టేస్తున్నారుగా!
బిగ్ బాస్ హౌస్లో వన్ అండ్ ఓన్లీ లేడీ కంటెస్టెంట్ ప్రియాంక. ఆమె ముందు డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో రచ్చ చేశారు అమర్-శివాజీ.

Bigg Boss Telugu 7
బిగ్ బాస్ తెలుగు 7 ఆదివారం ముగియనున్న విషయం తెలిసిందే. హౌస్లో టాప్ సిక్స్ ఉన్నారు. శివాజీ, అమర్ దీప్, ప్రశాంత్, యావర్, అర్జున్, ప్రియాంక ఉన్నారు. వీరిని ఫైనలిస్ట్స్ గా నాగార్జున ప్రకటించారు. సాధారణంగా టాప్ 5 మాత్రమే ఫినాలేకి వెళతారు. ఈ క్రమంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందా లేదా అనే సందిగ్ధత కొనసాగుతుంది.
Bigg Boss Telugu 7
తాజా సమాచారం ప్రకారం మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదు. ఆరుగురు కంటెస్టెంట్స్ ఫైనల్ కి వెళతారు. వీరిలో ఒకరు ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా టైటిల్ విన్నర్ అవుతారు. ఫినాలే షూట్ కూడా మొదలైందని తెలుస్తుంది. మహేష్ బాబు ఫినాలే గెస్ట్స్ గా వస్తారని ప్రచారం జరుగుతుంది.
Bigg Boss Telugu 7
ఇదిలా ఉంటే హౌస్ మేట్స్ కొంచెం రిలాక్స్ అవుతున్నారు. ఒకప్పటి నామినేషన్స్, ఎలిమినేషన్స్, కెప్టెన్సీ టాస్క్స్ లేవు. ఇంటి సభ్యులను సరదా ఆటలు ఆడిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. సొంత ఇంటి నుండి హౌస్ మేట్స్ కి ఫుడ్ వస్తుంది. దాన్ని పొందాలంటే ఒకరు బిగ్ బాస్ చెప్పిన టాస్క్ ఆడి గెలవాలి.
Bigg Boss Telugu 7
కాగా బిగ్ బాస్ మరో ఫన్నీ టాస్క్ ఆడించాడు. అమర్ దీప్ ని జ్యోతిష్కుడుగా మార్చాడు. జ్యోతిష్కుడు గెటప్ లో అమర్ ని సిద్ధం చేశారు. అయితే పల్లవి ప్రశాంత్ జాతకం చెబుతూ అమర్ డబుల్ మీనింగ్స్ మాట్లాడాడు. ముందుగా జాతకం చెప్పించుకునేందుకు ప్రశాంత్ వెళ్ళాడు. బూతద్దం నుండి చేతి రేఖలు చూస్తూ... అబ్బో చాలా పెద్దది, అన్నాడు.
Bigg Boss Telugu 7
అమర్ మాటలను అందుకుంది పెద్దదా... అన్నాడు. అమర్ మరలా చాలా పెద్దది అంటూ సాగతీశాడు. లేడీ కంటెస్టెంట్ ప్రియాంక ఉందని కూడా పట్టించుకోకుండా ఇద్దరూ ద్వందార్థాలతో రెచ్చిపోయారు. పాపం ఒంటరి లేడీ కంటెస్టెంట్ ప్రియాంకకు ఏం చేయాలో తెలియక నవ్వుతూ ఉండిపోయింది.
Bigg Boss Telugu 7
ఇక శివాజీ వరుసగా యావర్, అర్జున్, శివాజీ జాతకాలు కూడా చెప్పాడు. అమర్ జ్యోతిష్కుడిగా ఆకట్టుకున్నాడు. ఈ ఫన్నీ టాస్క్ ప్రేక్షకులను అలరించింది. లేటెస్ట్ ప్రోమోలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నేటి ఎపిసోడ్ ఫన్నీగా సాగుతుందని ఈ ప్రోమో చెప్పకనే చెబుతుంది.