ముఖం వాచేలా కొట్టుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్, ఇవేం టాస్కులురా బాబు..
బిగ్ బాస్ కాన్సెప్ట్ కొన్ని భాషల్లో దారుణంగా తయారయ్యింది. ఫిజికల్ డ్యామేజ్ వరకూ వెళ్తోంది. టాస్కుల సమరం కట్టుతప్పుతుండటంతో.. గాయాలతో కంటెస్టెంట్స్ ఇబ్బంది పడాల్సి వస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ వల్ల ముఖం వాచిపోయేలా దెబ్బలు తగిలించుకున్నది ఎవరు?

బిగ్ బాస్ తెలుగు సీజన 9 కి భారీ రెస్పాన్స్
ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9 Telugu) దూసుకుపోతోంది. ఈసిజన్ కు బ్లాక్ బస్టర్ టీఆర్ఫీ రేటింగ్స్ రావడంతో టీమ్ కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు. ప్రతీ ఎపిసోడ్ అత్యంత ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఇప్పటికే 10వ వారం లోకి ప్రవేశించిన ఈ రియాలిటీ షోలో.. కంటెస్టెంట్స్ అందరు ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు. కొంత మంది మాత్రం కాస్త అటు ఇటుగా ఉన్నారు.. వారు ఈ రెండు మూడు వారాల్లో హౌస్ నుంచి బయటకు వెళ్లిపోవడం ఖయమని తెలుస్తోంది. ఇక ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకోవడంతో.. టీఆర్పీలు కూడా భారీగా పెరిగాయి. అందుకే ఈ సీజన్ ప్రత్యేకంగా నిలిచింది. ఓటీటీలో కూడా ఈ సీజన్ ఎక్కువ మంది చూస్తున్నారు.
తమిళ్ బిగ్ బాస్ లో గొడవలు
అయితే కొన్ని భాషల్లో మాత్రం బిగ్ బాస్ కాస్త కట్టుతప్పుతున్నట్టు కనిపిస్తోంది. టాస్క్ లు కాస్త ఫిజికల్ దాడుల వరకూ వెళ్తున్నాయి. తెలుగు బిగ్ బాస్ లో మాట మాట పెరిగి గొడవలు జరగడం కామన్. కానీ అవి ఎప్పుడు ఫిజికల్ డ్యామేజ్ వరకూ వెళ్లలేదు. చిన్న చిన్న దెబ్బలు టాస్క్ లలో కామన్. కానీ పెద్ద దెబ్బలు తగలడం అనేది ఇంత వరకూ లేదు. కానీ తమిళ బిగ్ బాస్ లో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా బిగ్ బాస్ సీజన్ 9 నడుస్తోంది. కానీ తెలుగు కంటే కాస్త లేట్ గా అక్కాడ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యింది. హోస్ట్ గా గతంలో కమల్ హాసన్ ఉండగా.. 8వ సీజన్ నుండి విజయ్ సేతుపతి హోస్ట్‌గా కొనసాగుతున్నారు. తమిళ బిగ్ బాస్ 9 కూడా మంచి రేటింగ్స్ తో ముందుకు సాగుతోంది.
బిగ్ బాస్ కంటెస్టెంట్ కంటికి గాయం
కానీ తమిళ్ బిగ్ బాస్ లో ఈ మధ్య కాలంలో గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవలే కంటెస్టెంట్స్ మధ్య జరిగినట్లు కనిపించిన పెద్ద గొడవ వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయింది. ఆ వీడియోలో ఉన్న సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఆందోళన కలిగించగా, చివరకు అది ప్రాంక్ మాత్రమే అన్న విషయం బయటపడింది. అయితే తాజాగా మరో వీడియో వైరల్ అయ్యి.. బిగ్ బాస్ పై కొత్త రచ్చకు దారితీస్తోంది. తమిళ బిగ్ బాస్ లో టాప్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న వీజే పార్వతి, ఒక భారీ ఫిజికల్ టాస్క్‌లో తీవ్రంగా గాయాపడింది. శబరినాథ్ అనే కంటెస్టెంట్‌తో పోటీ పడుతున్న సమయంలో అతని మోకాలు అనుకోకుండా పార్వతి కంటికి బలంగా తగలడంతో ఆమె క్షణాల్లో కిందపడి.. నొప్పిభరించలేక ఏడదవడం స్ట్రాట్ చేసింది. పార్వతి గాయపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. యంతో బాధపడిన పార్వతిని మెడికల్ రూమ్‌కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందించారు. ఆరోగ్యపరంగా పెద్ద సమస్య ఏమి లేదని బిగ్ బాస్ టీమ్ తెలిపింది.
గాయాన్ని కూడా లెక్క చేయని కంటెస్టెంట్
ఇంత పెద్ద గాయం అయినప్పటికీ కూడా పార్వతి టాస్క్ లో పోరాడేందుకు రెడీ అయ్యింది. కన్నుమొత్తం వాచిపోయిన పరిస్థితుల్లో ఆమె నిర్ణయం, పట్టుదల అందరిని ఆశ్చర్యపరిచింది. కానీ ఇలాంటివి జరగడం మంచిది కాదు అని ఆడియన్స్ అభిప్రాయం.. కంటికి ఏమైనా జరిగి ఉంటే..పరిస్థితి ఎలా ఉండేదని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో నటి వనితా విజయ్ కుమార్ మీద కూడా.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కోపంతో.. బయట దాడి జరిగిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా వనిత కంటిమీదనే గాయం అయ్యింది. తాజాగా బిగ్ బాస్ టాస్క్ లో ఇలా పార్వతిగాయపడటంతో.. ఇలాంటి టాస్క్ లు తగ్గించాలి అంటున్నారు.. బిగ్ బాస్ అభిమానులు. అయితే ఎక్కువ వారాలు గడిచే కొద్దీ కంటెస్టెంట్స్‌పై ఒత్తిడి పెరగడం తో.. టాస్క్ లు గెలవాలన్న ఆలోచనతో.. ఆటలో వేగం పెరిగి ఇలా గాయాలు చేసుకుంటున్నారు.