ఆడలేనని బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోయిన ఫైర్ బ్రాండ్, ఫినాలే దగ్గర పడుతుండగా ఊహించని ట్విస్ట్
స్ట్రాంగ్ కంటెస్టెంట్ శోభ శెట్టి బిగ్ బాస్ హౌస్ నుండి సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యింది. నా వల్ల కాదు, నేను ఉండలేనంటూ.. కన్నీరు పెట్టుకుంది. దాంతో హోస్ట్ బయటకు పంపాడు. అందుకు కారణాలు ఏమిటో చూద్దాం..
Shobha Shetty
కార్తీక దీపం సీరియల్ ఒక సెన్సేషన్. టీఆర్పీ లో నేషనల్ రికార్డ్స్ దాని పేరిట ఉన్నాయి. సదరు బ్లాక్ బస్టర్ సీరియల్ లో విలన్ రోల్ చేసింది శోభ శెట్టి. ఆమెకు తెలుగు ప్రేక్షకుల్లో పాపులారిటీ ఉంది. ఈ ఫేమ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో పాల్గొనేలా చేసింది. శోభ శెట్టి గేమ్ ఒకింత విమర్శలపాలైంది. ఆమెపై సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటి నడిచింది.
Shivaji
శోభ మాట తీరు, యాటిట్యూడ్ చిరాకు తెప్పించేవి. ఆమె నామినేషన్స్ లో ఉన్న ప్రతిసారి ఎలిమినేట్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తేవి. స్టార్ మా ఆమెను కాపాడుతూ వచ్చిందనే వాదన కూడా ఉంది దానికి తోడు శోభ శెట్టి వంటి ఫైర్ బ్రాండ్ షోలో ఉంటేనే మజా అని మేకర్స్ భావించి ఉండొచ్చు. శోభ శెట్టి.. ఫినాలేకి ఒకటి రెండు వారాల ముందు ఎలిమినేట్ అయ్యింది.
బయటకు వచ్చాక ఆమెపై ఎంత నెగిటివిటీ పెరిగిందో చూసింది. ఈ క్రమంలో ఆడియన్స్ కి శోభా శెట్టి క్షమాపణలు చెప్పింది. తాను ఏం చేసినా ఆటలో భాగమే. నా గేమ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే... క్షమించండి, అన్నారు. శోభ శెట్టికి పెద్దగా సీరియల్ ఆఫర్స్ కూడా రావడం లేదు. కార్తీకదీపం అనంతరం ఆమె మరో తెలుగు సీరియల్ చేయలేదు.
కాగా సెప్టెంబర్ 29న బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 మొదలైంది. 17 మంది సెలెబ్స్ కంటెస్టెంట్ చేశారు. అనంతరం కొందరు వైల్డ్ కార్ద్ ఎంట్రీ ఇచ్చారు. వారిలో శోభ శెట్టి ఒకరు. పరాయి భాషకు చెందిన బిగ్ బాస్ షోలోనే నిప్పులు చెరిగిన శోభ, కన్నడ షోలో సంచలనాలు చేయడం ఖాయమని అనుకున్నారు. శోభ శెట్టి కన్నడ అమ్మాయి అన్న విషయం తెలిసిందే.
బిగ్ బాస్ కన్నడలో కూడా శోభ శెట్టి తన మార్క్ అగ్రెషన్ చూపించింది. తన జోలికి వచ్చిన వారిపై విరుచుకుపడేది. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న శోభ శెట్టి సేవ్ అయ్యింది. అయినప్పటికీ నేను హౌస్లో ఉండలేనంటూ కన్నీరు పెట్టుకుంది. వెళ్లిపోతానని హోస్ట్ సుదీప్ ని అభ్యర్థించడంతో ఆయన.. అందుకు అంగీకరించారు. శోభ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యింది. శోభ నిర్ణయానికి అనారోగ్య సమస్యలే కారణం అని తెలుస్తుంది. అందుకే షోకి శోభ గుడ్ బై చెప్పింది.
కేవలం శోభ రెండు వారాల మాత్రమే హౌస్లో ఉంది. కాగా శోభ సీరియల్ నటుడు యశ్వంత్ రెడ్డిని ప్రేమించింది. ఆ మధ్య శోభ యూట్యూబ్ ఛానల్ లో ఒక టాక్ షో చేసింది. మేకప్ కోర్సుల కోసం ఇన్స్టిట్యూట్ పెడతానని శోభ అన్నారు. కార్తీక దీపం 2 స్టార్ మాలో ప్రసారం అవుతుంది. శోభకు కార్తీకదీపం 2 లో ఛాన్స్ దక్కలేదు.