- Home
- Entertainment
- TV
- గీతూ రాయల్ పై దాడి, కారు అద్దాలు పగలగొట్టి మిస్ బిహేవ్... ఆ ఇద్దరిని పట్టించిన వాళ్లకు నజరానా!
గీతూ రాయల్ పై దాడి, కారు అద్దాలు పగలగొట్టి మిస్ బిహేవ్... ఆ ఇద్దరిని పట్టించిన వాళ్లకు నజరానా!
గీతూ రాయల్ పై కొందరు దాడి చేశారు. ఆమె కారు అద్దాలు పగలగొట్టి మిస్ బిహేవ్ చేశారట. గీతూ రాయల్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియో వెలుపల గందరగోళం నెలకొంది. గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో ఫ్యాన్స్ భారీగా అక్కడకు చేరుకున్నారు. ఫినాలే ముగిసిన తర్వాత టాప్ 6 గా ఉన్న శివాజీ, అమర్, ప్రశాంత్, ప్రియాంక, అర్జున్, యావర్ బయటకు వచ్చారు. వీరిలో కొందరిపై దాడి జరిగింది.
ముఖ్యంగా అమర్ దీప్ పై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. బూతులు తిడుతూ అతని కారును చుట్టుముట్టారు. కారు దిగాలి అంటూ డిమాండ్ చేశారు. అద్దాలు పగలగొట్టారు. గార్డ్స్ సహాయంతో అమర్ దీప్ అక్కడి నుండి బయటపడ్డాడు. బిగ్ బాస్ హౌస్లో పల్లవి ప్రశాంత్-అమర్ దీప్ మధ్య ఫైట్ జరిగింది. పలు సందర్భాల్లో పల్లవి ప్రశాంత్ ని అమర్ దీప్ కించపరుస్తూ మాట్లాడాడు. దాంతో ఫ్యాన్స్ అమర్ దీప్ మీద అటాక్ చేశారు.
Geethu Royal
అనూహ్యంగా బిగ్ బాస్ బజ్ హోస్ట్ గీతూ రాయల్ మీద కూడా దాడి జరిగింది. కొందరు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించారు. కారు అద్దాలు పగలగొట్టారు. వారి నుండి తప్పించుకున్న గీతూ రాయల్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. దాడి జరిగిన తీరు వివరించారు.
ఫినాలే కావడంతో నేను తమ్ముడిని కూడా తీసుకెళ్ళాను. బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలు ముగిశాక నేను కారులో బయటకు వచ్చాను. సడన్ గా కొందరు నా కారును చుట్టుముట్టారు. వెళ్లిపోవాలని ప్రయత్నం చేసినా కుదర్లేదు. కారు అద్దాలు పగలగొట్టారు. నా చేతులు పట్టుకుని బయటకు లాగే ప్రయత్నం చేశారు.
నేను ఎంతో ఇష్టపడి కొనుకున్న కారు ఇది. నేను సెలెబ్రిటీని అయినా నా దగ్గర కోట్లు లేవు. సొంత సంపాదనతో ఒక కారు కొనుక్కున్నాను. దాన్ని ఇలా నాశనం చేశారు. కారులో నా జ్యువెలరీ, కాస్ట్యూమ్స్ ఉన్నాయి. అందుకే ఇంటికి వెళ్లి వాటిని భద్రపరచి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు పెట్టాను. అప్పుడే ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది.
ఒక రెడ్ టీషర్ట్ వేసుకుని ఉన్నాడు. వాడిది బట్టతల వాడు నాకు దొరికితే కొడతాను. నాకు అద్దం పగులగొట్టిన వాడిని, ఆ రెడ్ టీ షర్ట్ వాడిని అప్పగిస్తే పదివేలు ఇస్తాను. వీడియోలు చూసి వాడిని కనిపెట్టండి... అంటూ తన వేదన బయటపెట్టింది. ఆవేశంలో గీతూ రాయల్ బూతులు కూడా మాట్లాడింది. గీతూ రాయల్ పై దాడి వీడియో వైరల్ అవుతుంది.
గీతూ రాయల్ సీజన్ 6 కంటెస్టెంట్. ఆమె 9వ వారం ఎలిమినేట్ అయ్యింది. అందుకు చాలా బాధపడింది. నేను వెళ్ళను అంటూ చిన్నపిల్ల మాదిరి ఏడ్చింది. సీజన్ కి ఆమె బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని ఇంటర్వ్యూ చేస్తుంది.