MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • బండ్ల గణేష్ ఇంట్లో స్టార్ దివాళి.. కొత్త ట్రెండ్ స్టార్ట్ చేసిన నిర్మాత.. అల్లు అరవింద్ ను పిలవలేదా?

బండ్ల గణేష్ ఇంట్లో స్టార్ దివాళి.. కొత్త ట్రెండ్ స్టార్ట్ చేసిన నిర్మాత.. అల్లు అరవింద్ ను పిలవలేదా?

దివాళి పార్టీ అంటే బాలీవుడ్ వైపు చూస్తారు ఆడియన్స్, అక్కడ దివాళీకి స్టార్ సెలబ్రిటీలు స్పెషల్ పార్టీలు చేసుకోవడం కామన్. ఇక ఈ ట్రెండ్ ను టాలీవుడ్ లో కూడా మొదలుపెట్టాడు నిర్మాత బండ్ల గణేష్.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 19 2025, 11:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బండ్ల గణేష్‌ ఏం చేసినా చాలా స్పెషల్
Image Credit : our own

బండ్ల గణేష్‌ ఏం చేసినా చాలా స్పెషల్

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వెరైటీ ఏదైనా చేయాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది నిర్మాత బండ్ల గణేష్‌. ఆయన ఏది చేసినా చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇక పండుగల్లో ఆయన ప్రత్యకంగా చేసేది దివాళి మాత్రమే. ప్రతి సంవత్సరం బండ్ల దివాళీ పేరుతో తానుపేల్చబోయే పటాకులతో ప్రదర్శన నిర్వహిస్తుంటాడు గణేష్. ఇక ఈసారి బండ్ల దివాళి వేడుకలు మరింత వైభవంగా సాగాయి. 2025 దీపావళి సందర్భంగా ‘బండ్ల దివాళీ 2025’ పేరుతో ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన ఈ గ్రాండ్ పార్టీకి టాలీవుడ్‌ సీనియర్ స్టార్లు, యంగ్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలు హాజరయ్యారు.

25
ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి
Image Credit : Asianet News

ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి

ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవ్వగా.. విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్, సిద్దు జొన్నలగడ్డ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు తదితరులు సందడి చేశారు. చిరంజీవి వచ్చీరాగానే బండ్ల గణేష్‌ పాదాభివందనం చేయడం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెగాస్టార్ కోసం ప్రత్యేకంగా చైర్ కూడా వేయించాడు బండ్ల. అంతేకాదు, బండ్ల గణేష్‌తో విభేదాలు ఉన్నాయని ప్రచారంలో ఉన్న దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈ పార్టీకి హాజరవడం విశేషం. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు గణేష్. ఈ పార్టీతో బండ్ల మళ్లీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.

Related Articles

Related image1
యమగోల రివ్యూ, ఎన్టీఆర్ దెబ్బకు ఒళ్లు నొప్పులతో 3 రోజులు మంచమెక్కిన జయప్రద, బాలకృష్ణ చేయాల్సిన సినిమా ఎలా మిస్ అయ్యింది?
Related image2
500 కోట్ల బడ్జెట్‌తో 10 సినిమాలు తీయొచ్చు.. ఆ ఇద్దరు హీరోల ఆస్తి ఎంత ? సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 10 రిచ్ హీరోలు?
35
కమెడియన్ గా కెరీర స్టార్ట్ చేసి..
Image Credit : Asianet News

కమెడియన్ గా కెరీర స్టార్ట్ చేసి..

బండ్ల గణేష్‌ కమెడియన్ గా తన జీవితం స్టార్ట్ చేసి... ఆతరువాత వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు. ఫౌల్ట్రీ వ్యాపారంలో విజయవంతమై అనంతరం నిర్మాతగా మారారు. పవన్ కల్యాణ్‌తో గబ్బర్ సింగ్, ఎన్టీఆర్‌తో బాద్షా, మహేష్ బాబుతో బిజినెస్‌మ్యాన్ వంటి భారీ చిత్రాలను నిర్మించి పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోనూ అడుగుపెట్టిన ఆయన ఈమధ్య జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్సీ టికెట్ ఆశించగా అది రాలేదు. అయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిప్రాయాలను వెల్లడిస్తూ వచ్చారు.ఇక రాజకీయంగా యాక్టీవ్ గా ఉంటూనే ఇండస్ట్రీలో కూడా మళ్లీ యాక్టీవ్ అవ్వాలని చూస్తున్నాడట బండ్ల.

45
అల్లు అరవింద్ ను పిలిచారా?
Image Credit : Asianet News

అల్లు అరవింద్ ను పిలిచారా?

ఇక తాజాగా జరిగిన బండ్ల దివాళీ 2025 వేడుకల్లో అల్లు అరవింద్ కానీ, ఆయన టీమ్ కానీ ఎవరు హాజరుకాలేదు. బండ్ల గణేష్‌కు, అల్లు అరవింద్‌ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు టాలీవుడ్ లో టాక్ ఉంది. రీసెంట్ గా బండ్ల కామెంట్స్.. దానికి అరవింద్ టీమ్ ఇస్తున్న కౌంటర్ల గురించి తెలిసిందే. రీసెంట్ గా ఒక ఫంక్షన్‌లో బండ్ల గణేష్‌ మాట్లాడుతూ ‘‘ అందరం ముందు నుంచి కష్టపడితే.. అల్లు అరవింద్ చివర్లో వచ్చి క్రెడిట్ తీసుకెళ్తారు’’, ఆయన జాతకం అలాంటిది అంటూ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలతో అల్లు అరవింద్ ముందే ఉన్నప్పటికీ హుందాగా స్పందించగా, అదే ఈవెంట్‌లో బన్నీ వాసు బండ్ల గణేష్‌ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఇది ఫిల్మ్ నగర్లో పెద్ద చర్చకు దారి తీసింది.

55
బండ్ల మార్క్ కౌంటర్
Image Credit : Bandla Ganesh

బండ్ల మార్క్ కౌంటర్

తాజాగా జరిగిన 'మిత్ర మండలి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బన్నీ వాసు మాట్లాడుతూ తనపై కుట్ర జరుగుతోందని, తన వెంట్రుక కూడా ఎవ్వరూ పీకలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై బండ్ల గణేష్ ‘‘మాటలు మన చేతిలో ఉంటాయి... కానీ ఆట ఎవరిదో ప్రజలే తీర్మానిస్తారు’’ అంటూ ట్వీట్ చేయడం మరోసారి ఈ వివాదానికి దారి తీసింది. ఈ పరిణామాల మధ్య బండ్ల గణేష్ దీపావళి వేడుకలకు అల్లు టీమ్ దూరంగా ఉండటం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. గణేష్ పిలిచారా లేదా అనేది స్పష్టంగా తెలియదు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ పని ఔట్, బాలుని ట్రాప్ చేసిన వింధ్య, అత్తను వణికించేసిన మీనా
Recommended image2
Karthika Deepam 2 Today Episode: కార్తీక్, దీప ఏడుపు- జ్యోని కూతురు కాదన్న దాసు- నిజం చెప్పిన దశరథ?
Recommended image3
Gunde Ninda Gudi Gantalu: దినేష్ వేసిన వలలో చిక్కుకున్న మనోజ్.. బాలు,మీనాలను ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్న ప్రభావతి
Related Stories
Recommended image1
యమగోల రివ్యూ, ఎన్టీఆర్ దెబ్బకు ఒళ్లు నొప్పులతో 3 రోజులు మంచమెక్కిన జయప్రద, బాలకృష్ణ చేయాల్సిన సినిమా ఎలా మిస్ అయ్యింది?
Recommended image2
500 కోట్ల బడ్జెట్‌తో 10 సినిమాలు తీయొచ్చు.. ఆ ఇద్దరు హీరోల ఆస్తి ఎంత ? సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 10 రిచ్ హీరోలు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved