- Home
- Entertainment
- 500 కోట్ల బడ్జెట్‌తో 10 సినిమాలు తీయొచ్చు.. ఆ ఇద్దరు హీరోల ఆస్తి ఎంత ? సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 10 రిచ్ హీరోలు?
500 కోట్ల బడ్జెట్‌తో 10 సినిమాలు తీయొచ్చు.. ఆ ఇద్దరు హీరోల ఆస్తి ఎంత ? సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 10 రిచ్ హీరోలు?
Top 10 Richest South Indian Actors : సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ధనవంతులైన హీరోలు ఎవరు? ఇద్దరు స్టార్ హీరోల ఆస్తితో 500 కోట్ల బడ్జెట్‌తో 10 సినిమాలు తీయొచ్చు. ఇంతకీ ఎవరా హీరోలు?

నాగార్జున
సౌత్ ఫిల్మ్ స్టార్స్‌లో అత్యంత ధనవంతుడు నాగార్జున. రిపోర్ట్స్ ప్రకారం, ఆయన ఆస్తి విలువ 3010 కోట్లు. ఈ ఏడాదే వచ్చిన కూలీ సినిమాలో విలన్ గా ఆయన కనిపించారు. త్వరలో 100వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు నాగ్.
మెగాస్టార్ చిరంజీవి
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ధనవంతుల జాబితాలో చిరంజీవి రెండో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తి విలువ 1650 కోట్లు అని సమాచారం. ఆయన ఇప్పటికీ వరుస సినిమాలతో చురుగ్గా ఉన్నారు. విశ్వంభర, మనశంకరవరప్రసాదు తో పాటు బాబి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.
రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్నారు. ఆయన ఆస్తి విలువ 1370 కోట్లు. ప్రస్తుతం ఆయన పెద్ది సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. నెక్ట్స్ సుకుమార్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ కూడా కోట్లాది రూపాయల ఆస్తికి అధిపతి. రిపోర్ట్స్ ప్రకారం, ఆయన ఆస్తి విలువ 571 కోట్లకు పైనే. ఎన్టీఆర్ ప్రస్తుతం తన అప్‌కమింగ్ ఫిల్మ్ డ్రాగన్ షూటింగ్‌లో ఉన్నారు. ఈసినిమా తరువాత ఆయన దేవర 2 సెట్ లో జాయిన్ కాబోతున్నాడు.
అల్లు అర్జున్
అల్లు అర్జున్ ఆస్తి విలువ 460 కోట్లు. సినిమాలతో పాటు రకరకాల వ్యాపారాలు కూడా బన్నీ చేస్తున్నాడు. ఆయన తన అప్‌కమింగ్ ఫిల్మ్ AA22xA6 కోసం పనిచేస్తున్నారు. ఇందులో ఆయన 4 పాత్రల్లో కనిపించనున్నారు. అట్లీ డైరెక్షన్ లో 800 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈసినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.
కమల్ హాసన్
కమల్ హాసన్ కూడా సౌత్ ధనవంతుల జాబితాలో ఉన్నారు. రిపోర్ట్స్ ప్రకారం, ఆయన ఆస్తి విలువ 450 కోట్లు. కమల్ కూడా రాబోయే సినిమాల పనుల్లో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా రాజ్యసభకు ఎన్నియ్యారు కమల్.
విజయ్ దళపతి
దళపతి విజయ్ కూడా సౌత్ స్టార్స్ ధనవంతుల జాబితాలో ఉన్నారు. ఆయన ఆస్తి విలువ 450 కోట్లు అని సమాచారం. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తన చివరి సినిమా జననాయకన్ రిలీజ్ కు రెడీగా ఉంది.
రజినీకాంత్
రజనీకాంత్ ఆస్తి విలువ 430 కోట్లు. ఈ ఏడాది విడుదలైన ఆయన సినిమా కూలీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ప్రస్తుతం జైలర్ 2 సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు రజినీ.
మహేష్ బాబు
సౌత్ సూపర్‌స్టార్ మహేష్ బాబు ధనవంతుల జాబితాలో 9వ స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తి విలువ 273 కోట్లు అని తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు.
ప్రభాస్
ప్రభాస్ కూడా సౌత్ స్టార్స్ ధనవంతుల జాబితాలో ఉన్నారు. అయితే, ఈ జాబితాలో ఆయన 10వ స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తి విలువ 241 కోట్లు. ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరలో రెండు సీక్వెల్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.