- Home
- Entertainment
- TV
- Rashmi Gautam: ఏంటి కొరకాలనిపిస్తుందా, ఇటు రావే... జబర్దస్త్ షోలో ఆడోళ్ళ రొమాన్స్!
Rashmi Gautam: ఏంటి కొరకాలనిపిస్తుందా, ఇటు రావే... జబర్దస్త్ షోలో ఆడోళ్ళ రొమాన్స్!
ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో అడల్ట్ కంటెంట్ డోసు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆడవాళ్లు రష్మీ గౌతమ్, జోర్దార్ సుజాత రొమాన్స్ చేయడంతో నోరెళ్ళబెట్టడం ప్రేక్షకుల వంతు అయ్యింది.

Rashmi Gautam
లెజెండరీ కామెడీ షో జబర్దస్త్ దశాబ్దం పూర్తి చేసుకుంది. 2013లో మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ప్రయోగాత్మకంగా ఈ షో నిర్మాణం చేపట్టింది. రోలర్ రఘు, ధనాధన్ ధన్ రాజ్, షకలక శంకర్, వండర్స్ వేణు అనే టీమ్స్ ఉండేవి. మొదట్లో ఈ షోలో డబుల్ మీనింగ్ డైలాగ్స్, అడల్ట్ జోక్స్ పరిమితికి మించి ఉండేవి. విమర్శలు రావడంతో డోసు తగ్గించారు.
Rashmi Gautam
రాకెట్ రాఘవ, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, రాకింగ్ రాకేష్ వంటి టీమ్స్ హెల్తీ కామెడీ ట్రై చేశారు. బిగ్ బాస్ నుండి స్టార్స్ మొత్తం వైదొలిగారు. రోజా, నాగబాబు, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్రతో పాటు పలువురు జబర్దస్త్ కి దూరమయ్యారు. దీంతో ఆదరణ తగ్గింది.
Rashmi Gautam
ఈ క్రమంలో మరలా అడల్ట్ కంటెంట్ జోక్స్ ట్రై చేస్తున్నారనే సందేహాలు కలుగుతున్నాయి. లేటెస్ట్ ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోలో రష్మీ గౌతమ్-సుజాత మధ్య చోటు చేసుకున్న సీన్స్ ఆ అనుమానాలను బలపరుస్తున్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేయగా రష్మీ ఎక్స్ప్రెషన్స్ చాలా హాట్ గా ఉన్నాయి.
Rashmi Gautam
టీమ్ లీడర్స్ ఈ ఎపిసోడ్లో స్పూఫ్స్ థీమ్ ట్రై చేశారు. బుల్లెట్ భాస్కర్ అపరిచితుడు మూవీలో రాము గెటప్ వేశాడు. ఇక ఇమ్మానియేల్ యానిమల్ చిత్రంలో రన్బీర్ కపూర్ గెటప్ లో సందడి చేశాడు. యానిమల్ మూవీ స్పూఫ్ స్కిట్ లో ఇమ్మానియేల్ నవ్వులు పూయించారు.
Rashmi Gautam
అనంతరం జోర్దార్ సుజాత మేల్ గెటప్ లో వచ్చింది. యాంకర్ రష్మీ వైపు చూస్తూ... రష్మీ నువ్వు నాకు పడిపోయావ్ నాకు తెలుసు, అని అంది. ఏంటి కొరకాలనిపిస్తుందా ? అని రష్మీని ఉద్దేశించి చెప్పింది. దగ్గరకు వచ్చిన సుజాత చేయి పట్టుకున్న రష్మీ మీదకు లాక్కుని 'రావే' అంటూ రొమాంటిక్ మూడ్ లో డైలాగ్ చెప్పింది.
Rashmi Gautam
ఎక్స్ట్రా జబర్దస్త్ వేదిక మీద ఆడోళ్ళ రొమాన్స్ చూసి ఆడియన్స్ షాక్ అయ్యారు. రష్మీ-సుజాత ఇలా తెగించారేంటని కామెంట్స్ చేస్తున్నారు. కాగా చాలా కాలం తర్వాత సింగర్ మను జబర్దస్త్ జడ్జి సీట్లో కనిపించారు. ఇంద్రజ, కుష్బూ హాజరు కాని నేపథ్యంలో మను రంగంలోకి దిగాడు.
Rashmi Gautam
ఇక జబర్దస్త్ యాంకర్ గా ఉన్న సౌమ్యరావు షో నుండి తప్పుకుంది. ఏడాదికి పైగా ఆమె యాంకర్ గా ఉన్నారు. ఆమె స్థానంలో బిగ్ బాస్ ఫేమ్ సిరి హన్మంత్ వచ్చారు. సిరి హన్మంత్ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. ఎక్స్ట్రా జబర్దస్త్ కి రష్మీ, జబర్దస్త్ కి సిరి యాంకర్స్ గా వ్యవహరిస్తున్నారు.