అనసూయ మనస్సు ఉప్పొంగే మాట.. ఎన్నేళ్ల నుంచి ఎదురుచూస్తుందో!
స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ Anasuya Bharadwaj తాజాగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. తన అభిమాని నుంచి మనస్సు ఉప్పొంగిపోయే మాటను వింది. దీంతో ఆసక్తికరంగా పోస్ట్ చేసింది.
యాంకర్ నుంచి, నటిగా ఎదుగుతున్న యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా కనిపిస్తారో తెలిసిందే. తన గురించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
‘జబర్దస్త్’ కామెడీ షోతో అనసూయా చాలా పాపులర్ అయ్యారు. తనదైన శైలిలో యాంకరింగ్ చేసి టీవీ ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యారు. మరోవైపు తన బ్యూటీఫుల్ లుక్స్ తోనూ అనసూయ మంచి క్రేజ్ దక్కించుకున్నారు.
అయితే, అనసూయ తను చేసే షోలు, సినిమాలతో కంటే.. వ్యక్తిగత విషయాలతోనే నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారుతుండే వారు. తన దుస్తులతో, అలాగే కాంట్రవర్శీయల్ కామెంట్స్ తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే వచ్చారు.
ఇక కొన్నాళ్లుగా అనసూయను పలు రకాల పేర్లతో పిలుస్తూ ట్రోల్ చేశారు. కానీ ఆమె వాటిని ఎదుర్కొంటూ ధీటుగా బదులిస్తూనే వచ్చారు. అయితే అనసూయ తన అభిమానుల నుంచి వినాలనుకున్న ఓ మాటను తాజాగా వినింది.
అనసూయ అభిమాని ఒకరు ఆమెను చాలా గౌరవంగా పిలిచారు. ఆ మధ్యలో బుల్లితెరపై అలనాటి నటి సావిత్రిగారిని ఇమిటేట్ చేస్తూ పెర్ఫామెన్స్ ఇచ్చారు. తాజాగా ఆ వీడియోను పోస్ట్ చేస్తూ ‘సావిత్రి గారిలా అనసూయ గారు’ అంటూ చాలా గౌరవంగా పిలిచారు.
కొన్నాళ్లుగా అనసూయ ఇలాంటి అభిమాన్నానే కోరుకుంటున్నట్టు పరోక్షంగా తన మాటలు, పోస్టుల ద్వారా చెప్పుకుంటూ వచ్చేంది. తాజాగా అదే జరగడంతో మనస్సు ఉప్పొంగినంతగా సంతోషించింది. అఫీషియల్ ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసి తన సంతోషాన్ని పంచుకుంది. ఎప్పుడూ ఇలా ఉంటే ఎంత బాగుంటో అని అభిమానులు కోరుకోవడం విశేషం.