Intinti Gruhalakshmi: అంకిత, శృతి మధ్య చిచ్చు పెట్టిన లాస్య.. లాస్యకు బుద్ధి చెప్పిన తులసి?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు జనవరి 17వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో తులసి బుక్ స్టాల్ కి వెళ్లి ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం బుక్కు అడగడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడు తులసి ఇబ్బంది పడుతూ ఇప్పటివరకు నేను అబద్ధాలు చెప్పాను. మా అబ్బాయికి కాదు నాకే అని అనగా దాంట్లో ఇబ్బంది ఏముంది మేడం అని చెప్పి అతను ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే బుక్ తెచ్చి ఇస్తాడు. అప్పుడు తులసి ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం నాలుగు పుస్తకాలు తీసుకొని ఇంటికి వెళుతుంది. ఆ తర్వాత పుస్తకాలు అక్కడ పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్లగా ఇంతలో పదందామయ్య అక్కడికి వచ్చి ఆ బుక్స్ తీసుకొని వారం రోజులు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనగా వారం రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంకేం అనడంతో రాదంటారా మామయ్య అని అక్కడికి వస్తుంది తులసి. ఎందుకు రాధమ్మ వస్తుంది అని అంటాడు.
ఇంతలోనే శృతి అక్కడికి వచ్చి అంత తొందరగా ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఆంటీ అని అడుగుతుంది. అమెరికన్ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక ప్రాజెక్ట్ కి నన్ను సామ్రాట్ గారు ఇన్చార్జిగా చేశారు వాళ్లతో మాట్లాడాలంటే ఇంగ్లీష్ రావాలి కదా అని అంటుంది తులసి. అప్పుడు తులసి కొంచెం భయంగా ఉంది అనడంతో అప్పుడు శృతి ఎందుకు భయం ఆంటీ ఫస్ట్ లో అందరికీ అలాగే ఉంటుంది నాతో మాట్లాడండి ఏవైనా తప్పులు ఉంటే నేను చెప్తాను అనగా ఇప్పుడు చూడు రెచ్చిపోతాను అని అంటుంది తులసి. ఇంతలోనే లాస్య అక్కడికి వస్తుంది. అప్పుడు అంకిత అక్కడికి వచ్చి మీకు కావాల్సింది అమెరికన్ ఇంగ్లీష్ ఆంటీ ఈ లోకల్ ఇంగ్లీష్ పనికిరాదు అని అంటుంది.
ఇప్పుడెలా మరి నేను ఆయన కుదరదు అని చెప్పేస్తాను వేరే వాళ్ళని చూసుకుంటారు అనడంతో నేను కాన్వెంట్ లో చదువుకున్నాను కదా అంటే నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను అనడంతో అవకాశం దొరికింది కదా అని లాస్య అదేంటి అంకిత, శృతిది బట్లర్ ఇంగ్లీష్ అంటావా అంటూ వారి మధ్య చిచ్చు పెట్టడంతో శృతి అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకు ఆంటి మీరు ఇలా చేశారు చూశారు కదా శృతి ఎలా హర్ట్ అయింది అనడంతో నేనేం చేశాను అంకిత అంటూ ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతూ ఉంటుంది లాస్య. అప్పుడు అంకిత ఆంటీ శృతి బాధపడుతుందేమో అని అనగా తులసి బుక్కులు పక్కన పడేస్తాను మళ్ళీ చూసుకుంటాను అనడంతో ఏదైనా శుభకార్యానికి ముందు శ్రీకారం చుట్టాలి ఇలా పోస్ట్ పోన్ చేయకూడదు అంటాడు పరందామయ్య.
ఆ తర్వాత శృతి బట్టల సర్దుకుంటూ ఉండగా ఇంతలో తులసి అక్కడికి వెళ్లి ప్రేమగా మాట్లాడిస్తుంది. నేను నా కోడళ్ళను ఎప్పుడూ కోడలుగా చూసుకోలేదు కూతుర్లాగే చూసుకున్నాను మా కోడలు కూడా నన్ను ఎప్పుడు తల్లిలాగే భావించారు అని అంటుంది తులసి. అప్పుడు తులసి శృతికి నచ్చచెబుతూ ఉంటుంది. అప్పుడు శృతి మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా అలాగే ఉంటుంది. ఇంతలోనే అంకిత అక్కడికి వస్తుంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నేను నా సొంత చెల్లెలు గానే భావించాను భావిస్తున్నాను. నేను నిన్ను హట్ చేసే ఉద్దేశంతో అలా మాట్లాడలేదు శృతి అని అంటుంది. నేను కావాలని ఉద్దేశంతో మాట్లాడలేదు లాస్య ఆంటీని కావాలని గొడవలు సృష్టిస్తోంది అంకిత అర్థం చేసుకో అని అంటుంది.
ఇంతలోనే ప్రేమ్ అక్కడికి శృతి కోసం ఐస్ క్రీమ్ తీసుకుని వస్తాడు. అప్పుడు తులసి నువ్వు నీ భార్యకు తినిపించు అని తులసి అనగా అదేంటి నేను ఐస్ క్రీమ్ అడిగితే వాడు లస్సి ఇచ్చాడు అనడంతో శృతి నవ్వుతూ ఉంటుంది. ఆ తర్వాత పనుందామయ్య ఏంటి రెండవసారి ఇచ్చే కాఫీ ఇంకా రాలేదు అని అంటుండగా ఇంతలోనే లాస్య అక్కడికి కాఫీ తీసుకొని వస్తుంది. అప్పుడు పరంధామయ్య నాకొద్దు మీ అత్తయ్యకి ఇవ్వమ్మా కడుపులో కాలుతూ ఉందంట అనగా నాకు వద్దు అని అంటుంది అసూయ. అప్పుడు పరంగామయ్య కాఫీ తాగడానికి భయపడుతూ ఫీల్ ఉంటాడు. పరంధామయ్య కాఫీ తాగి ఒక లాగా ముఖం పెట్టడంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి తులసి హారతి తీసుకుని వస్తుంది.
అప్పుడు పరంధామయ్య ఏంటమ్మా మాకు ఈ శిక్ష రెండోసారి ఇంకా కాఫీ ఇవ్వలేదు అనడంతో ఇప్పుడే తెచ్చి ఇస్తాను మామయ్య అని అంటుంది. అప్పుడు నందు బయటికి వెళ్లడానికి రెడీ అవ్వగా తులసి హారతి ఇస్తూ ఉండడంతో ఆగు నందు భార్య ఇవ్వాలి కదా హారతి అని అంటుంది. అప్పుడు నందు హారతి తీసుకుంటుండగా ఎక్కడికి బయలుదేరావు అనడంతో నందు ముఖం ఒకలాగా పెడతాడు. అప్పుడు నందు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నన్ను దీవించండి అని పరంధామయ్య ఆశీస్సులు తీసుకోవడంతో వెంటనే లాస్య ఇలా దండాలు పెడితే ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతారా అని అంటుంది. అలా కాదు నేను ఎదురొస్తాను అని లాస్య నందుకి ఎదురు వస్తుంది. అది చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు.
ఆ తర్వాత తులసి ఆఫీస్ కి బయలుదేరగా ఇంతలో దివ్య అక్కడికి వచ్చి నాకు కొత్త లాప్టాప్ కావాలి అంటూ తులసీని సతాయిస్తూ ఉంటుంది. అప్పుడు దివ్య నేను సామ్రాట్ అంకుల్ ని అడుగుతాను అనడంతో తులసి సీరియస్ అవుతుంది. అప్పుడు దివ్య హర్ట్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అనవసరంగా నువ్వు దివ్య అని హర్ట్ చేస్తున్నావ్ అని అక్కడికి వస్తుంది లాస్య. అప్పుడు లాస్యకి తగిన విధంగా బుద్ధి చెప్పి తులసి ఎక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు నందు కారులో వెళ్తూ నాకు ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది అయినా ఈ దరిద్రం ఏంటో నాకు ఒక్క జాబు కూడా రాలేదు అనుకుంటూ ఉంటాడు.