MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Intinti Gruhalakshmi: మళ్లీ ఒక్కటైన నందు మాధవి.. సంతోషంలో తులసి కుటుంబం?

Intinti Gruhalakshmi: మళ్లీ ఒక్కటైన నందు మాధవి.. సంతోషంలో తులసి కుటుంబం?

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు జనవరి 27వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.  

3 Min read
Author : Navya G
Published : Jan 27 2023, 09:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్లో ప్రేమ్ అల్లరి చేస్తూ రావాలండి రావాలి అనడంతో అందరూ అక్కడికి వచ్చి మేము రెడీ అని అంటారు. అప్పుడు పరంధామయ్య అనసూయ ఇద్దరు ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉండటంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలోనే లాస్య నందు అక్కడికి రావడంతో అప్పుడు దివ్య నాన్న ఈ రోజే నేను ఢిల్లీకి వెళ్ళేది ఈ రోజైనా ఇంట్లో ఉండొచ్చు కదా అనడంతో ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాడు అని అంటుంది లాస్య. అప్పుడు నందు వెళ్లి పరంధామయ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటుండగా ఇంతలో మాధవి మోహన్ అక్కడికి వస్తారు. అప్పుడు ఆల్ ది బెస్ట్ రా అన్నయ్య అని అంటుంది మాధవి. ఇప్పుడు మాధవిని చూసి అందరూ సంతోష పడుతూ ఉంటారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నేను ఇంట్లోకి రాగానే నన్ను మెడబట్టి బయటకు గెంటేటేస్తావు  అనుకున్నాను. ఈ ఒక్క పూట మమ్మల్ని ఇంట్లో ఉండనివ్వు వెళ్లేటప్పుడు టిఫిన్ ఖర్చు భోజనం ఖర్చు ఇచ్చి వెళ్తాను అని సరదాగా అంటుంది మాధవి. అప్పుడు మాధవి వెళ్లి నందుని హత్తుకుంటుంది. అప్పుడు అందరూ సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు మోహన్ ఇంత సేపు అయింది అల్లుడు వచ్చారు ఎవరు పలకరించడం లేదు ఏంటి అనడంతో పరంధామయ్య అక్కడికి వెళ్లి నిన్ను ఎప్పుడు అల్లుడుగా భావించలేదు నా కొడుకుగా భావించాను అని అంటాడు పరంధామయ్య. అప్పుడు మాధవి శుభమా అని బయటకు వెళ్ళేటప్పుడు నేను ఎదురు వచ్చాను ఒక్క నిమిషం కూర్చొని నీళ్లు తాగి వెళ్ళు అన్నయ్య అంటుంది.
 

36

నువ్వేం టెన్షన్ పడకు మాధవి గుమ్మం దగ్గర నేను ఎదురొస్తాను అంటుంది లాస్య. అప్పుడు ప్రేమ్ నో అనడంతో నీకేంటి ప్రాబ్లం అనగా మొన్న నువ్వు ఎదురొచ్చినప్పుడు బ్యాంకు వాళ్లు కార్ లాకెళ్ళారు కదా అదే వాళ్ళ భయం అంటుంది భాగ్య. అప్పుడు లాస్య బలవంతంగా నందుకు ఎదురొస్తుంది. ఆ తర్వాత నందు ఇంటర్వ్యూ కి వెళ్లడంతో అక్కడ నందు వయసును చూసి అందరూ ఇంత లేటుగా ఇంటర్వ్యూ కి వస్తారా అని అవమానిస్తారు. కొడుకు లాంటి మేము ఇంటర్వ్యూ లోకి వస్తే మీరు మాకు పోటీగా రావడం ఏంటి సార్ అనడంతో తండ్రి కొడుకుల మీద ఆధారపడకుండా తన బ్రతుకుని చూసుకోవడం మంచిదే కదా అంటాడు. ఆ తర్వాత అందరూ కలిసి ముగ్గులు వేస్తూ ఉంటారు.
 

46

పరంధామయ్య, ప్రేమ్ ఇద్దరు అల్లరి చేస్తుండగా అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అనసూయ పరంధామయ్య సరదాగా పోట్లాడుకుంటూ ఉండగా అది చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. తులసి సంక్రాంతి పండుగ గొబ్బెమ్మల గొప్పతనం గురించి చెబుతూ ఉంటుంది.   ఆ తర్వాత అందరూ సరదాగా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా అది చూసి లాస్య,భాగ్య కుళ్లుకుంటూ ఉంటారు. అప్పుడు దివ్య అందరూ ముగ్గులు వేస్తుండగా అవి వీడియోలు తీస్తూ ఉంటుంది. అప్పుడు లాస్య ముగ్గును చూసి మురిసిపోతూ తాను ఒక ఇంటి ఇల్లాలుగా ముగ్గు వేస్తున్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది. అప్పుడు భాగ్య మనకు ఎలాంటి సాంగులు సెట్ అవ్వవులే లాస్య అని అంటుంది.
 

56

 అప్పుడు మామ్ ఈ వ్రతం ఎందుకు వేస్తారు మామ్ అనడంతో దాని గురించి వివరిస్తూ ఉంటుంది తులసి. తర్వాత ముగ్గులు వేయడం పూర్తి అవ్వడంతో విజేతను ప్రకటించాలి అని మోహన్ ని అడ్డంగా ఇరికిస్తారు. అప్పుడు పండగపూట మా ఆవిడనే విజేతగా ప్రకటిస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి పరుగులు తీస్తాడు మోహన్. అది చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. మరొకవైపు ఇంటర్వ్యూలో కంపెనీ హెచ్ఆర్ వచ్చి ఇంతకుముందే ఇంటర్వ్యూ ముగిసింది అనగా మమ్మల్ని ఎవరినీ పిలవలేదు కదా ఎలా ముగిసింది అని అక్కడ ఉన్నవారు అడగడంతో గంటకు పైగా ఇక్కడ సీసీ కెమెరాలు బిగించాం అప్పుడు మీ అందరి ఓపికను చూసాము.
 

66

మాకు కావాల్సిన క్వాలిటీస్ అని నందగోపాల్ గారిలో ఉన్నాయి మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారు మీరు వెళ్లి క్యాబిన్ లో కూర్చోండి అని అంటారు హెచ్ఆర్. మరొక వైపు తులసి మాధవి మోహన్ లతో మాట్లాడుతూ మీ అన్నయ్య నిన్ను అంత దారుణంగా అవమానించినప్పటికీ ఆత్మ అభిమానం దెబ్బతిని బంధం తెంచుకొని మళ్లీ ఇంటి ముఖం చూడలేదు. నువ్వు చాలా మంచి పని చేశావు అంటూ మాధవి తో మాట్లాడుతూ ఉంటుంది తులసి.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Epic First Semester 11 Days Collection: డిజాస్టర్‌ దిశగా ఎపిక్‌ మూవీ, 11 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంతనా?
Recommended image2
Chiranjeevi: హాలీవుడ్ లో పుట్టి ఉంటే ఆస్కార్ అవార్డు వచ్చేది.. అలాంటి నటుడికి దర్శకత్వం వహించిన చిరంజీవి
Recommended image3
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved