- Home
- Entertainment
- Intinti gruhalakshmi: నందుని రెచ్చగొడుతున్న లాస్య... విమానం ఎక్కాలనే కల నెరవేరబోతుందనే ఆనందంలో తులసి!
Intinti gruhalakshmi: నందుని రెచ్చగొడుతున్న లాస్య... విమానం ఎక్కాలనే కల నెరవేరబోతుందనే ఆనందంలో తులసి!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఆగస్ట్ 10వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... తులసి సామ్రాట్ లు ఒక్కటైపోతున్నారు అని నందు లాస్యకి చెప్పి కుళ్ళుకుంటూ ఉంటాడు. అప్పుడు లాస్య ఇదంతా నీ కారణంగానే జరిగింది నందు అని చెప్తుంది.నందు గతంలో జరిగిన ఒక సీన్ ని గుర్తు తెచ్చుకుంటాడు. గతంలో ఒకరోజు తులసి మంచం మీద కూర్చొని తన చిన్నచిన్న కోరికలన్నీ పుస్తకం మీద రాసుకుంటూ ఉంటుంది. సముద్రంలో ఆడుకోవాలని,విమానం ఎక్కాలని,ఇంగ్లీష్ నేర్చుకోవాలని.
ఇలాగ తన కోరికలు రాసుకుంటూ ఉండగా నందు అక్కడికి వచ్చి ఏం రాస్తున్నావ్ అని అడుగుతాడు. నా చిన్న చిన్న కోరికలు మీరే తీర్చాలి అని తులసి అంటే నేను అల్లావుద్దీన్ దీపాన్ని కాదు ఆ పుస్తకం చీరలో మడిచి లోపల దాచుకో అని తిడతాడు. ఆ విషయాన్ని గుర్తుతెచ్చుకున్న నందు నేనేమీ తప్పు చేయలేదు అని లాస్యతో అంటాడు. నువ్వు చేసింది తప్పు కాదు కానీ తులసికి అది తప్పే ఇప్పుడు రెక్కలు వచ్చాయి తులసికి ఎటువైపు ఎగురుతాదో తెలీదు.కరెక్టుగా అదే సమయంలో సామ్రాట్ కూడా తులసికి సపోర్ట్ చేస్తున్నాడు.ఇలా చేస్తే ఎప్పటికైనా తులసి మన బాస్ అయిపోతుంది ఏమో అని కావాలని నందు ని రెచ్చగొడుతుంది లాస్య.
మనం ఇప్పుడే ఏదైనా చేయాలి. వాళ్ళని ఒకటవకుండా ఎలాగైనా ఆపాలి అని అనుకుంటాడు నందు. దాని తర్వాత లాస్య మనసులో ఇలా ప్రతిసారి నందుని బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటేనే కానీ పని జరగదు అని అనుకుంటుంది. సీన్లో తులసి, అమ్మ నాన్నల్ని వదిలిపెట్టి అత్తగారింటికి వచ్చేసినప్పుడు ఏమనిపించలేదు. కానీ మిమ్మల్ని వదిలి ఇప్పుడు బయటికి వెళ్లాలంటే భయంగా ఉంది అని అందరితో అంటుంది. అప్పుడు అనసూయ, నువ్వు ఇవేవీ మనసులో పెట్టుకోకుండా క్షేమంగా వెళ్లి నీ పని చేసుకుని రా అంటుంది. అప్పుడు తులసి అంకిత తో నేను మొదటిసారి ఫ్లైట్ ఎక్కడం కదా ఎలా ఉంటుంది? అని అడగగా చిన్నప్పుడు నుంచి నేను ఫ్లైట్ లోనే తిరగా ఆంటీ ఫ్లైట్లో ఉన్న వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నప్పుడు నవ్వుకునే దాన్ని
కానీ ఆ విలువ నాకు ఇప్పుడు తెలుస్తుంది అని విమాన ప్రయాణం గురించి కొంచెం సేపు కుటుంబ సభ్యులందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. దాని తర్వాత ఇంక లేట్ అవుతుంది పడుకోవాలి మళ్ళీ రేపు ఉదయాన్నే లెగాలి కదా అని తులసి పడుకోవడానికి వెళుతుంది. అప్పుడు సామ్రాట్ ఫోన్ చేసి రేపు ఉదయం 8 గంటలకి కారు తెస్తాను పది కళ్ళ ఫ్లైట్ ఉంది అని అనగా నేను ఆటోలో వస్తాను. ఒంటరి ప్రయాణం నేర్చుకోవాలి నా కాళ్ళు మీద నేను నిలబడాలి అని అంటుంది తులసి. దాని తర్వాత రోజు ఎనిమిది గంటలకి సామ్రాట్ తులసికి ఫోన్ చేసి టైం ఎనిమిది దాటింది ఫస్ట్ ఫ్లైట్ వెళ్లిపోయి సెకండ్ ఫ్లైట్ కూడా కొంచెం సేపట్లో వెళ్ళిపోతుంది ఎక్కడున్నారు అని అడగ్గా ఒళ్ళు తెలియకుండా పడుకుండి పోయాను క్షమించండి అని కంగారుగా తులసి అంటుంది.
తయారవ్వడానికి లెగుస్తుండగా మంచం మీద నుంచి కింద పడిపోతుంది తులసి. ఈలోగా అదంతా కల అని తెలిసి టైం చూసేసరికి ఉదయం 4:00 అవుతుంది. హమ్మయ్య అనుకుంటుంది ఏమైనా మంచి జరిగే ముందు ఇలాంటి చెడు కలలు వస్తాయని పెద్దవాళ్ళు అంటారు. ఇది మన మంచికే అనుకొని ఇంక తయారైపోతుంది. అంతా సర్దుకొని దేవుడి దగ్గరికి వెళ్లి, ఈ పని విజయవంతంగా జరగాలి అని కోరుకుంటుంది. అంకితని ఇంట్లో టిఫిన్ మాత్రమే చేశాను వంట నువ్వే చేయాలి అని చెప్పి
దివ్యతో నానమ్మ తాతీయులకు ఏ అవసరం ఉన్నా నువ్వే తీర్చాలి అని చెప్పి జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది. ఈలోగా ఆటో వచ్చింది అని ప్రేమ్ చెప్తాడు. అందరూ ఆటో దగ్గరికి వెళ్తున్న సమయంలో ఇంట్లో వాళ్ళందరూ కలిసి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు.అప్పుడు ప్రేమ్ నువ్వు మా అమ్మవి. మా అందరికీ చాలా ముఖ్యమైన దానివి జాగ్రత్త అమ్మా అని అనగా తులసి ఎంతో ఆనంద పడిపోతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే!