- Home
- Entertainment
- Intinti gruhalakshmi: తోటి ప్రయాణికులకు ధైర్యం ఇచ్చిన తులసి.. ఒకే గదిలో ఉండబోతున్న తులసి,సామ్రాట్!
Intinti gruhalakshmi: తోటి ప్రయాణికులకు ధైర్యం ఇచ్చిన తులసి.. ఒకే గదిలో ఉండబోతున్న తులసి,సామ్రాట్!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఆగస్ట్ 15వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... లాస్య,నందులు ప్లేన్ వెనకన మాట్లాడుకుంటూ ఉండగా ఎయిర్ హోస్ట్రెస్ దయచేసి సీట్లోకి వెళ్లి కూర్చోండి అని అంటుంది.అప్పుడు వాళ్ళు సీట్ దగ్గరకి వచ్చేస్తారు.మరోవైపు సామ్రాట్ తులసి తో, మీరు నాతో ఏమీ మాట్లాడొద్దు.మీరు మొదటిసారి ఫ్లైట్ ఎక్కడం కదా! ఈ క్షణాలను మీరు అనుభవించండి నాతో మాట్లాడుతూ ఉంటే టైం అయిపోతుంది అని అంటాడు. అప్పుడు తులసి, తమ గురించే కాకుండా పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచించే మగవాళ్ళని నేను ఇప్పుడే మొదటిసారి చూస్తున్నాను అని అంటుంది.
ఆ మాట విన్న లాస్య చూసావా నందు ఇప్పుడు నిన్ను మంచోడు కాదు అని ఇండైరెక్టుగా చెప్తుంది అని రెచ్చకొడుతుంది.ఈ లోగ సామ్రాట్ కళ్ళు మూసుకుని జారబడుతూ ఉంటాడు. తులసి మాత్రం ఫోటోలు తీసుకుంటూ నవ్వుకుంటూ సంతోషంగా ఉంటుంది.అలా ఒకేసారి పడుకుండిపోతుంది.అప్పుడు తులసికి చలి వేస్తుంది అని సామ్రాట్ తన కోట్ ని తులసి మీద కప్పుతాడు. అప్పుడు లాస్య, చూసావా నందు ఇలాంటివి నువ్వు ఎప్పుడైనా నాకు చేసావా చూసి నేర్చుకో అని అంటుంది. అప్పుడు తులసి ఒకేసారి లెగుస్తుంది అప్పుడు సామ్రాట్ చలిగా ఉంటుందని కప్పాను ఏమి అనుకోవద్దు అని అంటాడు పర్లేదు అని చెప్పి కోట్ తిరిగి ఇచ్చేస్తుంది తులసి.
ఆ తర్వాత సీన్లో ప్రేమ్ శృతి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడ ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఈ లోగా అంకిత ఫోన్ చేసి ఎక్కడున్నావ్ ప్రేమ్ అని అడగగా, శృతి వాల్ల ఇంటికి వచ్చాను. కానీ తాళం వేసి ఉంది తిరిగి వచ్చేద్దాం అనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు అంకిత, నువ్వు మళ్ళీ ఇంటికి వస్తే లేనిపోని ఆలోచనలు వచ్చి మనసు మార్చుకుంటావు కనుక శృతి తిరిగి వచ్చేవరకు అక్కడే ఉండు. శృతిని ఒప్పించి ఇంటికి తీసుకురా. నేనేం చెప్పినా మీ మంచి కోసమే అని సలహా ఇస్తుంది. ఆ తర్వాత సీన్లో ఇంకొంచెం సేపట్లో మనం వైజాగ్ చేరుకుంటున్నాము అని సామ్రాట్ తులసి తో అంటాడు.
అప్పుడే వచ్చేస్తుందా నాకు ఇంకొంచెం సేపు ఇలా గాల్లో ఉండాలని ఉంది అని అంటుంది తులసి. ఈ లోగ ఒకేసారి ప్లేన్ షేక్ అవుతుంది. అందరూ కంగారుపడి లెగుస్తారు. ఈ లోగ, అందరూ సీట్ బెల్ట్ పెట్టుకొని కూర్చోండి. చిన్న టెక్నికల్ ప్రాబ్లెమ్ వల్ల సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది అని అనౌన్స్మెంట్ వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కంగారు పడిపోతూ అరుస్తూ ఉంటారు. చాలామంది అక్కడున్న ఎయిర్ హోస్టెస్ మీద కూడా అరుస్తారు. తీపి జ్ఞాపకాలు తీసుకొని వెళ్దాం అనుకుంటే పరీక్ష ఏంటి స్వామి అని తులసి మనసులో అనుకుంటుంది.సామ్రాట్ తులసిని చూసి బాధపడతాడు.
ఈ లోగ నందు అక్కడున్న ఎయిర్ హాస్టల్స్ ని తిడుతూ ఉంటాడు. అప్పుడు తులసి లెగిసి ఒక ఆడపిల్ల తన ఉద్యోగధర్మం చేస్తుంటే తనని తిట్టడం న్యాయమా? ఇక్కడ ఏమైనా జరిగితే మనతో పాటు తన ప్రాణాలు కూడా పోతాయి కానీ తను మన గురించి బాధపడుతూ ఉంది.అలాంటి వారిని అలా అనడం తప్పు ఇదే సమయంలో మీ కొడుకుకి కార్ యాక్సిడెంట్ అవుతే మీరు తట్టుకోగలరా అని అడగగా నందు మనసులో, హనీని కార్ తో గుద్దిన సంగతి సామ్రాట్ కి చెప్పేస్తుందేమో సైలెంట్ గా ఉండడం మంచిది అని చెప్పి కూర్చుండిపోతాడు. అప్పుడు తులసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ధైర్యం చెబుతూ ఎవరు బాధపడొద్దు. ధైర్యంగా ఉంటే అంతా మంచే జరుగుతుంది అని అంటుంది.ఇంతట్లో ప్లేయింగ్ కి ఏ ప్రమాదం లేదు మనం సురక్షితంగా కిందకు దిగుతున్నాము అని అనౌన్స్మెంట్ వస్తుంది అప్పుడు అందరూ చప్పట్లు కొడతారు.
అప్పుడు సామ్రాట్, మీ ధైర్యమే మనల్ని కాపాడింది అని అనగా బత్తాయి బాలరాజు నందు దగ్గరికి వెళ్లి మీరు అలా చూస్తూ ఉండండి ఏదో ఒక రోజు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు అని అంటాడు.తర్వాత ప్లేన్ వైజాగ్ లో దిగుతుంది. నలుగురూ వాళ్ళ హోటల్ బయట ఉండగా సామ్రాట్ కి ఒక ఫోన్ వస్తుంది. మీరు రెండు గంటలు లేట్ చేసినందువలన వాళ్లకి ఇంకేదో మీటింగ్ ఉంది అంత. కనుక ఈ మీటింగ్ రేపటికి వాయిదా వేశారు అని అంటాడు. చేసేదేమీ లేక ఈరోజు ఇంక హోటల్ లో గడపడమే అని అంటాడు సామ్రాట్. లాస్య నందుతో, ఇదంతా సామ్రాట్ కావాలనే చేశాడు అని అంటుంది. ఆ తర్వాత సీన్లో రిసెప్షన్ దగ్గరికి వెళ్లి సామ్రాట్ తన పేరు చెప్తాడు.
మీకు రెండు గదులు ఉన్నాయి సార్ అని అంటుంది ఆ అమ్మాయి. మాకు ఇంకా ఒక గది కావాలి అని అనగా ప్రస్తుతానికి లేవు అని అంటుంది. అప్పుడు లాస్య నందు తో, కావాలనే ఇదంతా సామ్రాట్ నడిపిస్తున్నాడు ఇప్పుడు తులసి సామ్రాట్ ఒక గదిలో ఉంటారు అని అంటుంది. అప్పుడు నందు వాళ్ళిద్దరూ ఎలా ఒక గదిలో ఉంటారు అని అనగా పెళ్లికి ముందు మనిద్దరం కూడా గదిలోనే ఉండే వాళ్ళం కదా అని అంటుంది. అప్పుడు సామ్రాట్ నందు,లాస్య ల తో, ముందు మీరిద్దరూ మీ గది లోకి వెళ్ళండి.మేమిద్దరం ఏం చేయాలో ఆలోచిస్తామని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే!