- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: మహిళా మణుల నోరు మూయించిన తులసి.. రాజ్యలక్ష్మి గుట్టు రట్టు చేసిన తాతయ్య!
Intinti Gruhalakshmi: మహిళా మణుల నోరు మూయించిన తులసి.. రాజ్యలక్ష్మి గుట్టు రట్టు చేసిన తాతయ్య!
Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. భర్త తనని అపార్థం చేసుకున్నందుకు మదన పడుతున్న ఒక కొత్త పెళ్లికూతురు కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 12 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో రాములమ్మ తులసి దగ్గరికి వచ్చి నందు బాబు గారు అయోమయంలో ఉన్నారు. ఎవరికైనా నచ్చని మనుషులతో ఉండటం అంటే కష్టమే. అందులో తప్పేముంది ఎందుకు నందు బాబు గారిని ఇబ్బంది పెడుతున్నారు అని నిలదీస్తుంది. నేను ఇబ్బంది పెట్టడం ఏంటి అంటుంది తులసి. మీరు చెప్పడం తోనే ఆ పెద్ద వాళ్ళు ఇద్దరు కూడా నందు బాబు వెనక లేకుండా పోయారు.
నందు బాబుని చూస్తే జాలి వేసిందమ్మా అంటుంది రాములమ్మ. నా సలహా అడిగితే చెప్పాను కానీ పాటించమని చెప్పలేదు కదా అంటుంది తులసి. మరోవైపు బాధపడుతున్న దివ్య దగ్గరికి వచ్చి కూర్చుంటాడు విక్రమ్. అతని భుజం మీద తలవాల్చి నాకు కష్టం వస్తే నేను కోరుకునేది ఈ భుజాన్నే. ఏ భార్యకైనా భర్త భుజం మీద తలవాలిస్తే ఆమెకి కొండంత ధైర్యం. నేను నీ నుంచి కోరుకునేది అదే విక్రమ్ అంటుంది దివ్య.
ఈ భుజం ఎప్పటికీ నీదే అంటాడు విక్రమ్. నేను ఎంతో ఇష్టపడే మా నాన్న కటకటాల్లో ఉండేసరికి తట్టుకోలేకపోయాను అదే బాధతో ఇంటికి వచ్చి నీ ఒళ్ళో పడుకొని నా బాధను చెప్పుకోవాలి అనుకున్నాను కానీ గుమ్మంలో నిలబడి నన్ను నిలదీసే సరికి నాకు బాగా కోపం వచ్చింది అందుకే అందరి ముందు నీతో ఎదిరించి మాట్లాడాను నన్ను క్షమించు అంటుంది దివ్య.
చిన్నప్పటినుంచి నాకు మా అమ్మే ప్రపంచం తను నీకోసం బాధపడుతుంటే భరించలేకపోయాను అందుకే అలా మాట్లాడాను. ఇంతకీ మావయ్య గారు జైలుకు ఎందుకు వెళ్లారు అని అడుగుతాడు విక్రమ్. జరిగిందంతా చెప్తుంది దివ్య. ఎలాంటి సాయం అవసరమైన నా సహాయం నీకు ఎప్పుడూ ఉంటుంది అంటూ భార్యని దగ్గరకు తీసుకుంటాడు విక్రమ్. ఇదంతా చూసిన బసవయ్య విషయం అంతా రాజ్యలక్ష్మి కి చెప్తాడు.
ఏం జరిగినా మన మంచికే అమ్మకి తెలియకుండా మాటిచ్చి..అమ్మ మాటకి కట్టుబడి మాట తప్పుతాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య నిప్పురగులుకుంటుంది అప్పుడు నేను గెలిచినట్లు కదా అంటుంది రాజ్యలక్ష్మి. ఆ మాటలకి సంతోషిస్తాడు బసవయ్య. మరోవైపు మీరు పూర్తిగా మారిపోయారు ఇంట్లో ఎవరిని పట్టించుకోవడం లేదు అని తులసితో అంటుంది రాములమ్మ. ఏం జరిగింది అంటుంది తులసి.
నందు బాబు జైలు నుంచి వచ్చిన దగ్గరనుంచి ఏమి తినలేదు ఒంటరిగా ఉండిపోయారు అంటుంది రాములమ్మ. చూసుకోవటానికి అత్తయ్య మామయ్య ఉన్నారు అంటుంది తులసి. మీరున్నారని వాళ్లు పట్టించుకోవట్లేదు అంటుంది రాములమ్మ. అంతలోనే అనసూయ అక్కడికి రావడంతో పంతాల కోసం భోజనం మానేయ వద్దని మీ అబ్బాయికి చెప్పండి నేను చెప్పానని చెప్పకండి అంటుంది తులసి.
నందు దగ్గరికి వెళ్లిన అనసూయ సమస్యలు వస్తే భోజనం మానేస్తావా చిన్నపిల్లాడివి అయితే చెవి మెలేసి భోజనం తినిపించేదాన్ని అంటుంది. నాకు తినాలనిపించడం లేదమ్మా తులసికి చేసిన అన్యాయానికి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను అంటాడు నందు. గతాన్ని తప్పుకోవద్దు అంటుంది తులసి. మరోవైపు లాస్య మహిళా మండలి ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇంటి ముందు ధర్నా చేస్తుంది. పెళ్ళాన్ని గౌరవించడం లేదంటూ నందుని తిడతారు ఆ ఆడవాళ్లు. నిజా నిజాలు తెలుసుకోకుండా నా కొడుకుని ఏమీ అనొద్దు అంటుంది అనసూయ. నువ్వేనా ఆయన గారి తల్లివి ఏం పెంచావు అంటూ పరందామయ్య దంపతులని కూడా చులకనగా మాట్లాడుతారు ఆ ఆడవాళ్లు.
ఏది మొగుణ్ణి వదిలేసిన కూడా ఇంకా మొగుడు చంకనే కూర్చున్న తులసి ఇంట్లో ఉందా లేకపోతే వెనుకదారి నుంచి పారిపోయిందా రమ్మనండి అంటూ అసహ్యంగా మాట్లాడుతారు వాళ్ళు. కోపాన్ని ఆపుకోలేక బయటకు వచ్చి నేను వాళ్ళ ఇంటిలో ఉండటం కాదు వాళ్లే మా ఇంట్లో ఉంటున్నారు కావాలంటే డాక్యుమెంట్స్ చూపిస్తాను అంటుంది తులసి. వాళ్ళెందుకు మీ ఇంట్లో ఉంటున్నారు లేకపోతే నువ్వు ఎందుకు నీ భర్తకి బెయిల్ విషయంగా హెల్ప్ చేస్తున్నావు అని అడుగుతారు వాళ్ళు. మీరెందుకు ఏ సంబంధమూ లేకపోయినా లాస్యకి హెల్ప్ చేస్తున్నారు నేను అందుకే ఆయనకి హెల్ప్ చేస్తున్నాను.
కేసు కోర్టులో ఉంది తీర్పు ఇవ్వాల్సింది కోర్టు మీరు కాదు అప్పటివరకు ఓపిక పట్టండి లేకపోతే నేనే మీ మీద కేసు పెడతాను అంటూ రివర్స్ అటాక్ చేస్తుంది తులసి. నువ్వు అన్నట్లే ఓపిక పడతాము ఒకవేళ లాస్య కి అన్యాయం జరిగితే మాత్రం ఆమె వెనకాతల మేము ఉంటాము అంటారు సదరు మహిళామణులు. తరువాయి భాగంలో అత్తగారు నిజ స్వరూపం గురించి దివ్యకి చెప్తారు విక్రమ్ వాళ్ళ తాతయ్య. నిజం తెలుసుకున్న దివ్య నివ్వెర పోతుంది.