MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `జబర్దస్త్` షో క్లోజ్‌ అనే వార్తలో నిజమెంతా? మల్లెమాల నిర్వాహకులు ఏం చేస్తున్నారంటే?

`జబర్దస్త్` షో క్లోజ్‌ అనే వార్తలో నిజమెంతా? మల్లెమాల నిర్వాహకులు ఏం చేస్తున్నారంటే?

`జబర్దస్త్` కామెడీ షో క్లోజ్‌ అవుతుందంటూ ఇటీవల కొన్ని వార్తలు వినిపించాయి. తాజాగా దీనికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. తెరవెనుక జరుగుతున్న కథేంటో లీక్‌ అయ్యింది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Dec 09 2023, 09:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

`జబర్దస్త్` కామెడీ షో పదేళ్లుగా రన్‌ అవుతున్న విషయం తెలిసిందే. తెలుగు కామెడీ షోస్‌లో అదొక ట్రెండ్‌ సెట్టర్‌లా నిలిచింది. ఇప్పటి వరకు దాన్ని కొట్టే కామెడీ షోస్‌ రాలేదు. ఇతర ఛానెల్స్ చాలా ప్రయోగాలు చేసినా ఏదీ సక్సెస్‌ కాలేదు. ఓ షో పదేళ్లుగా నిరంతరంగా రన్‌ అవుతుందంటే అది మామూలు విషయం కాదు. ఒక రికార్డుగానే చెప్పాలి. వారానికి రెండు రోజులు ప్రసారం అవుతూ ఇన్నేళ్లలో వేల కామెడీ స్క్రిప్ట్ లతో అలరించారు జబర్దస్త్ కమెడియన్లు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఎంతో మందికి ఈ షో లైఫ్‌ ఇచ్చింది. గుర్తింపు తెచ్చింది. వందల మంది ఈ షో ద్వారా పాపులర్‌ అయ్యారు. ఇప్పుడు సినిమాల్లో సెటిల్‌ అయ్యారు. కొందరు లైఫ్‌లో ఇతర రంగాల్లోనూ సెట్‌ అయ్యారు. సుడిగాలి సుధీర్‌ లాంటి వాళ్లు హీరోగా చేస్తున్నారు. వేణు దర్శకుడిగా బిజీ అవుతున్నారు. అనసూయ నటిగా బిజీగా ఉంది. హైపర్‌ ఆది నటుడిగా, రాజకీయ నాయకుడిగానూ మారాడు.  ఈ షో చేసిన తర్వాత రోజా మంత్రి అయ్యింది. ఒకప్పటి తారలు ఇప్పుడు రీఎంట్రీఇస్తున్నారు. యాంకర్లు స్టార్ యాంకర్లుగా మారారు. ఇలా ఎంతో మందిని స్టార్స్ ని చేసింది జబర్దస్త్. 

36

ఈ నేపథ్యంలో ఇప్పుడు క్లోజ్‌ కాబోతుందనే వార్తలు ఊపందుకున్నాయి. షో కి రేటింగ్‌ అంతగా రావడం లేదని, కమెడియన్ల స్కిట్లు పేలడం లేదనే కామెంట్లు వస్తున్నాయి. గతంలో మాదిరిగా హాస్యం పండటం లేదంటున్నారు. జబర్దస్త్ నుంచి చాలా మంది ఆర్టిస్టులు వెళ్లిపోవడంతో ఆ కిక్‌ పోయిందంటున్నారు. అనసూయ మానేయడం, హైపర్‌ ఆది, సుధీర్‌లు వెళ్లిపోవడంతో కామెడీలో దమ్ము ఉండటం లేదంటున్నారు.
 

46

కామెడీ మాత్రమే కాదు, దాన్ని మించిన ఎంటర్‌టైన్‌మెంట్‌ పెళ్లి స్కిట్లు, సుధీర్‌, రష్మిల కెమిస్ట్రీ వర్కౌట్‌ అవుతుందనే చూసేవాళ్లు. ఇప్పుడు వాళ్లు లేకపోవడంతో ఆ మజా రావడం లేదనే విమర్శలు వచ్చాయి. దీంతో ఈ కారణంతోనే మల్లెమాల నిర్వహకులు ఈ షోని క్లోజ్‌ చేయాలనుకుంటున్నట్టు వార్తలొచ్చాయి. అయితే అసలు వాస్తవం ఏంటనేది తాజాగా బయటకు వచ్చింది. నిజానికి ఈ షోని క్లోజ్‌ చేస్తున్నారు. కానీ క్లోజ్‌ చేయడం లేదు. అందులోనే పెద్ద ట్విస్ట్ ఉంది. ఇప్పుడు జబర్దస్త్ షో రెండు ఎపిసోడ్లుగా ప్రసారం అవుతుంది.
 

56
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

 గురువారం `జబర్దస్త్` షో, శుక్రవారం `ఎక్స్ట్రా జబర్దస్త్` షో ఉంటుంది. గురువారం షోలో ఇప్పుడు సిరి యాంకర్‌గా ఉంది. అంతకు ముందు సౌమ్య రావు ఉండేది. అంతకు ముందు అనసూయ యాంకర్‌గా ఉండేది. ఇందులో కృష్ణభగవాన్‌, ఇంద్రజ జడ్జ్ లుగా ఉన్నారు. ఇక శుక్రవారం షోకి రష్మి గౌతమ్‌ యాంకర్‌, కృష్ణభగవాన్‌, ఖుష్బు జడ్జ్ లుగా ఉండేది. ఖుష్బు స్థానంలో మహేశ్వరి జడ్జ్ గా వచ్చింది. 

66

అయితే ఈ రెండు షోస్‌ కాకుండా రెండు కలిపి ఒక్కటి చేయబోతున్నారట. రెండు అయితే స్కిట్లు అంతగా పేలడం లేదు. దీంతో రెండు కలిపి ఒకటి చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ప్రాథమిక ఐడియా మాత్రమే. కానీ ఇప్పుడు దీనికి సంబంధించి తెరవెనుక చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ నిర్ణయానికి కారణం మరోటి ఉందట. కొత్తగా మరో షోని ప్లాన్‌ చేస్తున్నారట. ఆ వచ్చే షోని గురు గానీ, శుక్రగానీ అడ్జెస్ట్ చేసి, మిగిలిన రోజుని జబర్దస్త్ షోని నిర్వహించాలనుకుంటున్నారట. మరి ఆ కొత్త షో వర్కౌట్‌ అయితేనే దీన్ని ఇంప్లిమెంట్‌ చేస్తారని, లేదంటే యదావిధిగా దీన్ని రెండు షోలను కొనసాగిస్తారని సమాచారం. మొత్తానికి షో మాత్రం కచ్చితంగా ఉండబోతుంది. ఇది జబర్దస్త్ అభిమానులు రిలాక్స్ అయ్యే విషయమనే చెప్పొచ్చు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రష్మీ గౌతమ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Karuppu Movie: త్రిష, సూర్య మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయాల్సింది.. ఎలా మిస్సయ్యారో తెలుసా ?
Recommended image2
Cast Fees: మృణాల్ ఠాకూర్ ముందు తేలిపోయిన పూజా హెగ్డే.. రెమ్యునరేషన్ లో క్లియర్ డామినేషన్
Recommended image3
CM Vijay: సీఎం చైర్‌ చూడగానే విజయ్‌కి గుర్తొచ్చిన సినిమా ఇదే.. అర్జున్‌తో మనసులో మాట బయటపెట్టిన దళపతి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved