MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `కన్నప్ప`లో మంచు విష్ణు, ఏపీలో జగన్‌ మామయ్య.. ఇదెక్కడి ర్యాగింగ్‌రా నాయన.. ట్రోలర్స్ రచ్చ

`కన్నప్ప`లో మంచు విష్ణు, ఏపీలో జగన్‌ మామయ్య.. ఇదెక్కడి ర్యాగింగ్‌రా నాయన.. ట్రోలర్స్ రచ్చ

`కన్నప్ప`లో మంచు విష్ణుకి, సీఎంగా ఉన్నప్పుడు వైఎస్‌ జగన్‌కి ముడిపెడుతూ ర్యాగింగ్‌ చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఇక ట్రోలర్స్ మాత్రం రెచ్చిపోతున్నారు.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 15 2024, 01:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న మూవీ `కన్నప్ప`. భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా మైథలాజికల్‌ మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. మంచు విష్ణు అన్నీ తానై చేస్తున్న మూవీ ఇది. మోహన్‌బాబు కీలక పాత్రలో నటిస్తూ తెరవెనుక అన్నీ చూసుకుంటున్నారు. భారీ కాస్టింగ్‌ ఇందులో భాగం కావడంతో సినిమాపై హైప్‌ బాగా పెరిగింది. ప్రభాస్‌, మోహన్‌లాల్‌, అక్షయ్‌ కుమార్‌, శరత్‌ కుమార్‌, కాజల్‌ ఇందులో భాగమయ్యారు. ఇంకా చాలా మంది ప్రముఖ ఆర్టిస్టులు కనిపిస్తున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

తాజాగా `కన్నప్ప` టీజర్‌ విడుదలైంది. విజువల్‌గా బాగుంది. యాక్షన్‌ సీన్లు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. అదే సమయంలో ఇందులో ప్రభాస్‌, మోహన్‌లాల్‌, అక్షయ్‌ కుమార్‌, మోహన్‌బాబు, కాజల్‌ల గెస్ట్ సీన్లు హైలైట్‌ అని చెప్పాలి. ఆయా హీరోల ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. వీరంతా ఉండటంతో ఈ టీజర్‌ కోసం ఆడియెన్స్ ఎగబడి చూశారు. 
 

38

కానీ ఇప్పుడు ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. మీమర్స్ అయితే దారుణంగా ర్యాగింగ్‌ చేస్తున్నారు. అయితే ఇందులో వైసీపీ నాయకులు సైతం మంచు విష్ణుని ట్రోల్‌ చేయడం ఇప్పుడు హైలైట్‌గా నిలిచింది. పలువురు వైసీపీ అకౌంట్ల నుంచి `కన్నప్ప` టీజర్‌లో మంచు విష్ణు అరిచే సీన్‌ కి, ఏపీలో జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు ఓ కార్యక్రమంలో స్కూల్‌ విద్యార్థి.. జగన్‌ మమయ్యా అని స్టేజ్‌పై అరిచే సీన్‌ని లింక్‌ చేస్తూ ట్రోల్‌ చేయడం గమనార్హం. 
 

48

అంతేకాదు నెటిజన్లు కూడా మరింతగా రచ్చ చేస్తున్నారు. సినిమాలో మంచు విష్ణునే మైనస్‌ అంటున్నారు. మౌంటేన్‌ ఏరియాలో ఫైట్‌ సీన్‌ ఉంటుంది. అందులో వెనకాల ఉన్న సైన్యం అంతా విలన్‌ని చూస్తుంటే మంచు విష్ణు కెమెరాని చూస్తున్నాడని చెబుతూ ట్రోల్‌ చేస్తున్నారు. 
 

58

మరోవైపు విష్ణు చేసే యాక్షన్‌ సీక్వెన్స్ లో ఏమాత్రం ఎమోషన్స్ లేవని అంటున్నారు. ఆయన లుక్‌ కూడా సెట్‌ కాలేదని చెబుతున్నారు. మరోవైపు టీజర్‌ ప్రారంభంలో డబ్బింగ్‌ సెట్‌ కాలేదని, వరస్ట్ గా ఉందని అంటున్నారు. విజువల్స్ బాగున్నాయి. యాక్షన్స్ బాగున్నా వాటిలో ఎమెషన్స్ కనిపించడంలేదని దీంతో తేలిపోయినట్టుగా ఉందని ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు. 
 

68

`కన్నప్ప` టీజర్‌ ఫర్వాలేదు, కానీ ఈ మూవీ ఒప్పుకున్నందుకు ప్రభాస్‌, అక్షయ్‌, మోహన్‌లాల్‌, కాజల్‌ వంటి వారికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే అంటున్నారు. టీజర్‌కి ఆడియెన్స్ రెస్పాన్స్ భయంకరంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. సీరియల్‌ని తలపించేలా ఉందని కొందరు అంటున్నారు. 

78
Kannappa Teaser

Kannappa Teaser

ప్రభాస్‌ షాట్‌ తప్ప ఏదీ ఇంట్రెస్టింగ్‌గా లేదని, అటెన్షన్‌ గ్రాబ్‌ చేసేలా లేదని, కాన్సెప్ట్ టీజర్‌లా ఉందని రచ్చ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది న్యూజిలాండ్‌లో ఎందుకు తీశారని, విష్ణు జూమ్‌ షాట్‌ ఎందుకు పెట్టినట్టు అంటూ ర్యాగింగ్‌ చేస్తున్నారు. మొత్తంగా `కన్నప్ప` టీజర్‌పై రచ్చ రచ్చ చేస్తున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

88

సుమారు వంద కోట్లకుపైగా బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మోహన్‌బాబు. తమ కెరీర్‌లోనే దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. మరి ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ మూవీని ఈ ఏడాది చివర్లో విడుదల చేసే అవకాశం ఉంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Kriti Sanon Net Worth: నటి మాత్రమే కాదు, సక్సెస్ ఫుల్ బిజినెస్‍వుమన్.. ప్రభాస్ హీరోయిన్ ఆస్తి ఎంతో తెలుసా?
Recommended image2
Taapsee Pannu: ప్యాడెడ్ బ్రా వేసుకోమన్నారు .. సౌత్ సినిమాపై తాప్సీ సంచలన కామెంట్స్
Recommended image3
26 ఏళ్లలో కేవలం 5 హిట్లు.. ఆస్తి మాత్రం 500 కోట్లు పైనే.. ఈ హీరోయిన్ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవుతారు.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved