MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నందమూరి హీరో సినిమా అంత దారుణమా? జీరో కలెక్షన్లా?.. ఇదేం ట్రోలింగ్‌ రా బాబు..

నందమూరి హీరో సినిమా అంత దారుణమా? జీరో కలెక్షన్లా?.. ఇదేం ట్రోలింగ్‌ రా బాబు..

నందమూరి ఫ్యామిలీ హీరోలకు భారీగా ఫ్యాన్‌ బేస్ ఉంది. హీరో ఎవరైనా, సినిమా ఎలా ఉన్నా వాళ్లు చూస్తారు, ఆదరిస్తారు. కానీ తాజాగా నందమూరి హీరో సినిమా మాత్రం జీరో కలెక్షన్లు అంటూ ట్రోల్‌ నడుస్తుంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 31 2023, 10:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఎన్టీఆర్ తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ, హరికృష్ణ హీరోలుగా మారారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌, తారకరత్నలు సైతం హీరోలుగా మెప్పించారు. అయితే తారకరత్న ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో కూడా ఉన్నాడు. నందమూరి జయకృష్ణ కుమారుడు చైతన్యకృష్ణ కూడా ఉన్నారు. ఆయన 20ఏళ్ల క్రితమే `ధమ్‌` అనే చిత్రంలో హీరోగా నటించారు. ఒకటి రెండు సినిమాల్లో మెరిశాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కానీ ఏమైందో ఏంటో గ్యాప్‌ వచ్చింది. మళ్లీ ఇటీవల `బ్రీత్` అనే సినిమాతో వచ్చాడు. ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ రీ లాంఛ్‌ అయ్యారు. వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించిన ఈ మూవీ కోసం బసవతారక రామ క్రియేషన్స్ కూడా స్టార్ట్ చేశారు. మెడికల్‌ మాఫియా నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. డిసెంబర్‌ 2న విడుదలైంది. అయితే సినిమా ఇప్పుడు ట్రోల్‌కి గురవుతుంది. సోషల్‌ మీడియాలో సినిమాని దారుణంగా ఆడుకుంటున్నారు నెటిజన్లు. 
 

36

ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్ అవుతుంది. ఈ మూవీ 123కోట్లు కలెక్ట్ చేసిందంటూ రచ్చ చేస్తున్నారు. వంద కోట్ల ఓపెనింగ్స్ అంటున్నారు. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ అంటున్నారు. అయితే ఇదంతా పెద్ద ట్రోలింగ్‌ కావడం విశేషం. ఈ మూవీ జీరో కలెక్షన్లు, జీరో షేర్‌ అని అంటున్నారు. నందమూరి హీరోలకు సంబంధించిన అత్యంత చెత్త మూవీగా వర్ణిస్తున్నారు. ఆయన అద్భుతమైన యాక్టింగ్‌ని నిదర్శనమని సెటైర్లు పేలుస్తున్నారు. 

46

దాదాపు రూ. నాలుగు కోట్లతో `బ్రీత్‌` చిత్రాన్ని నిర్మించారు. మంచి కథ దొరకడంతో ఈ మూవీని చేసినట్టు ఇంటర్వ్యూలో చైతన్య కృష్ణ తెలిపారు. సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. వరుసగా ఇంటర్వ్యూలిచ్చారు. తన ఫ్యామిలీకి సంబంధించిన అనేక విషయాలను బయటపెట్టాడు. దీంతో కొన్ని రోజులపాటు ట్రెండింగ్‌లోకి వచ్చాడు చైతన్య కృష్ణ. దీంతో సినిమాకి బాగానే ప్రమోషన్‌ జరిగింది. 
 

56

కానీ తీరా సినిమా రిలీజ్‌ అయ్యాక అది పూర్తిగా తేడా కొట్టింది. కనీసం సినిమాని అభిమానులు కూడా చూడలేదని అంటున్నారు. జీరో షేర్ అంటే సినిమాని అభిమానులు కూడా పట్టించుకోలేదని తెలుస్తుంది. ఇండస్ట్రీలో అంత పెద్ద ఫ్యాన్స్ బేస్‌ ఉన్న నందమూరి ఫ్యామిలీ హీరో సినిమాకి ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా చాలా బాధాకరం. ఈ సినిమాని థియేటర్ల రెంట్ కట్టి ఆడించారట. అసలే బడ్జెట్‌ బొక్క, పైగా థియేటర్ల రెంట్‌ ఇంకా పెద్ద బొక్కగా మారిందని అంటున్నారు. అయితే `యానిమల్‌` ప్రభావంలో ఈ మూవీ కొట్టుకుపోయిందని చెప్పొచ్చు. ఇందులో నిజమెంతో కానీ, నందమూరి హీరో సినిమాలపై ఇంతటి దారుణంగా ట్రోల్‌ జరగడం అత్యంత విచారకరం.

66

నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ బేస్‌ ఇప్పుడు విడిపోయింది. నందమూరి బాలయ్య వర్గం, ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్‌ వర్గంలా తయారైంది. టీడీపీలో కొంత మంది బాలయ్యకి, మరికొంత మంది తారక్‌ ఫ్యామిలీకి షిఫ్ట్ అయ్యారు. గత కొన్నిరోజులుగా ఈ రెండు వర్గాల ఫ్యాన్స్ మధ్య వార్‌ జరుగుతూనే ఉంది. అంతేకాదు ఇటీవల కళ్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ, వచ్చే ఏపీ ఎన్నికల్లో ఎవరికి సపోర్ట్ అనేది తాము ఆలోచించి, చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంటే వాళ్లు `టీడీపీ`తో లేరనే విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేస్తుంది. ఈ రెండింటి మధ్య చైతన్యకృష్ణ కొట్టుకుపోయాడని తెలుస్తుంది. కానీ ఒక నందమూరి హీరో సినిమాకి ఇలా జరగడం విచారకరం.   
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Alia Bhatt Movies: అలియా భట్ కెరీర్ లో టాప్ 5 బిగ్గెస్ట్ హిట్స్ ఇవే.. మొదటిది మన తెలుగు సినిమానే
Recommended image2
Toxic Cast Fees: టాక్సిక్ స్టార్ల రెమ్యూనరేషన్స్, యశ్‌కు 50 కోట్లు.. మరి కియారా, నయన్ ఎంత తీసుకున్నారంటే?
Recommended image3
Isakapatnam: ఐశ్వర్య రాజేష్ 'ఇసకపట్నం' వెబ్ సిరీస్ తప్పకుండా చూడడానికి 5 కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved