హైపర్ ఆదికి త్రివిక్రమ్ వార్నింగ్ ఇచ్చారా.. అసలేం జరిగింది ?
బుల్లితెరపై పంచ్ లతో అలరించే హైపర్ ఆది కూడా సార్ చిత్రంలో నటించాడు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆది చేసిన కామెంట్స్, ఆ తర్వాత త్రివిక్రమ్ ఆది గురించి మాట్లాడడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన తాజా చిత్రం 'సార్'. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే లాంటి చిత్రాలతో వెంకీ అట్లూరి మంచి గుర్తింపు పొందారు. ధనుష్ నే మెప్పించి ఆయనతో సినిమా చేయడం మామూలు విషయం కాదు. విలక్షణ నటనతో ధనుష్ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. సార్ చిత్రం విద్యావ్యవస్థలో లోపాలను ఎత్తి చూపే విధంగా ఉండబోతోంది.
ఫిబ్రవరి 17న ఈ చిత్రం రిలీజ్ కానుండడంతో ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ధనుష్ తెలుగులో స్ట్రైట్ గా చేస్తున్న తొలి చిత్రం ఇదే. ప్రీరిలీజ్ ఈవెంట్ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అతిథిగా హాజరయ్యారు. బుల్లితెరపై పంచ్ లతో అలరించే హైపర్ ఆది కూడా సార్ చిత్రంలో నటించాడు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆది చేసిన కామెంట్స్, ఆ తర్వాత త్రివిక్రమ్ ఆది గురించి మాట్లాడడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది మాట్లాడుతూ.. త్రివిక్రమ్ పై ప్రశంసలు కురిపించారు. ఆయన దర్శకత్వ శైలి అంటే తనకు పిచ్చి అని ఆది అన్నాడు. నువ్వే నువ్వే, అత్తారింటికి దారేది లాంటి చిత్రాలని ప్రస్తావించాడు. ఖలేజా చిత్రాన్ని యావరేజ్ అన్నారు. కానీ టీవీల్లో మాత్రం పదే పదే చూశాం. అది త్రివిక్రమ్ అంటే అంటూ ఆది పొగడ్తలు కురిపించారు.
ఇక ప్రీరిలీజ్ వేదికపై హైపర్ ఆది పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చాడు. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ ని ప్రస్తావించాడు. వర్షం, వేడి బజ్జీలు.. ధోని, లాస్ట్ బాల్ కాంబినేషన్ ఎంత బావుంటుందో.. పవన్, త్రివిక్రమ్ కాంబో అంత బావుంటుంది అని హైపర్ ఆది అన్నారు. సందర్భం కాని చోట పవన్ ప్రస్తావన తీసుకువచ్చాడని త్రివిక్రమ్ భావించారో ఏమో కానీ.. ఆ తర్వాత ఆయన ఆది గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కొంతమంది అయితే ఆదికి త్రివిక్రమ్ వార్నింగ్ ఇచ్చారా అని చర్చించుకుంటున్నారు.
త్రివిక్రమ్.. హైపర్ ఆది వంక వేలు చూపిస్తూ నీతో చాలా చాలా విషయాలు పర్సనల్ గా మాట్లాడాలి, స్టేజి మీద కాదు అని చెప్పడం వైరల్ గా మారింది. నీ ప్రేమకు నేను అందిస్తున్నాను అని త్రివిక్రమ్ అన్నారు.
హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కి మద్దతుగా జనసేన పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. మరి హైపర్ ఆదిని త్రివిక్రమ్ పర్సనల్ గా మీట్ అయి ఏమైనా సలహాలు ఇస్తారా లేక అసందర్భంగా పవన్ పేరు వాడొద్దని వార్నింగ్ ఇస్తారో చూడాలి.