'బ్రో' మూవీ చూసి కంటతడి పెట్టుకున్న త్రివిక్రమ్.. సముద్రఖని చేయి గట్టిగా పట్టుకుని..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి తొలిసారి నటించిన 'బ్రో'. ఈ చిత్రం జూలై 28న విడుదల కానున్న సంగతి తెలిసిందే. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వినోదయ సీతంకి రీమేక్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి తొలిసారి నటించిన 'బ్రో'. ఈ చిత్రం జూలై 28న విడుదల కానున్న సంగతి తెలిసిందే. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వినోదయ సీతంకి రీమేక్. ఇది పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ఇద్దరి ఇమేజ్ కి భిన్నమైన చిత్రం అని చెప్పొచ్చు. ఈ మూవీలో కేతిక శర్మ, ప్రియా వారియర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇప్పటికే ట్రైలర్స్, సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ మాస్ చిత్రాల రేంజ్ లో బజ్ లేకపోయినప్పటికీ.. ఈ విభిన్న చిత్రాన్ని ఎంజాయ్ చేయాలని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే బ్రో చిత్రం గురించి పలు ఆసక్తికర అంశాలు వినిపిస్తున్నాయి. రెండు గంటల 14 నిమిషాల రన్ టైంతో ఈ చిత్రం ఉండబోతోంది. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ గా.. సెకండ్ హాఫ్ ఆలోచింపజేసే పవర్ ఫుల్ మెసేజ్ తో ఎమోషనల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మొదట తేజు పాత్రతో ఈ చిత్రం మొదలుకానుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ టైంతో మ్యాజిక్ చేస్తారు. చివర్లో నేను, త్రివిక్రమ్ అన్న కలసి మ్యాజిక్ చేస్తాం అని సముద్రఖని అన్నారు.
తమిళంలో హిట్ అయిన వినోదయ సీతం చిత్రంలో మార్పులు చేసి సముద్రఖని తెలుగులో తెరకెక్కించారు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడం విశేషం. తాజాగా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సముద్రఖని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. బ్రో మూవీ గురించి చెబుతూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
త్రివిక్రమ్ అన్న ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక మూవీ చూశారు. ఈ చిత్రానికి రచన అందించింది ఆయనే. ఆయన మాట్లాడుతూ.. నాకు ఈ చిత్రంలో ఏం జరగబోతోందో ముందే తెలుసు.. డైలాగ్స్ నేనే రాశాను కాబట్టి. అయినా కూడా నాకు కన్నీళ్లు వచేస్తున్నాయి అని అన్నారు. క్లైమాక్స్ చూసి కన్నీళ్లు పెట్టుకుని సముద్రఖని చేతిని గట్టిగా పట్టుకున్నారట. మన పనిని మనం కరెక్ట్ గా చేశాం అని అప్పుడే అనిపించింది అని సముద్రఖని అన్నారు.
అలాగే భోళా శంకర్ డైరెక్టర్ మెహర్ రమేష్ కూడా బ్రో మూవీ చూశారట. మెహర్ రమేష్ కి ఈ చిత్రం గురించి ఏమి తెలియదు. నేను పిలిస్తే ఒక కామన్ ఆడియన్ లాగా వచ్చి చూశారు. ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి తన జీవితం మొత్తం గుర్తుకు వస్తోంది అని చెప్పారట. ప్రేక్షకులకు కూడా అంతే బాగా ఈ మూవీ రీచ్ అవుతుందని సముద్రఖని విశ్వాసం వ్యక్తం చేశారు. హిందీ, కన్నడలో కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తానని సముద్రఖని అన్నారు.