- Home
- Entertainment
- Trisha Krishnan: తిరుగులేని స్టార్ గా త్రిష.. ఆ నటితో పోల్చితూ ఆకాశానికి ఎత్తుతున్న కోలీవుడ్.. కారణమిదే
Trisha Krishnan: తిరుగులేని స్టార్ గా త్రిష.. ఆ నటితో పోల్చితూ ఆకాశానికి ఎత్తుతున్న కోలీవుడ్.. కారణమిదే
Trisha Krishnan: రెండు దశాబ్దాలుగా తమిళ ఇండస్ట్రీలో త్రిష ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోంది. ఆమె సక్సెస్ వెనుక నటన మాత్రమే కాదు, ఆమె వ్యక్తిత్వం, స్నేహం, సింప్లిసిటీ కూడా ముఖ్య కారణాలని అంటున్నారు.

రెండు తరాల ఆడియెన్స్ మనసు దోచుకున్న త్రిష
మోడలింగ్ నుంచి ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా త్రిష
మోడలింగ్‌తో కెరీర్ మొదలుపెట్టిన త్రిష, అందాల పోటీల్లో గెలిచి సినిమాల్లోకి వచ్చారు. `వర్షం` చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన త్రిష తొలి చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తర్వాత `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`,`అతడు` వంటి చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ విజయాలు అందుకుంది. తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అదే సమయంలో తమిళంలోనూ అదే స్థాయిలో హిట్స్ అందుకుంది త్రిష.
'గిల్లి' ధనలక్ష్మి... అభిమానులకు ఆల్-టైమ్ ఫేవరెట్!
త్రిషకి తమిళంలో 'గిల్లి' సినిమా ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. అందులో ఆమె పోషించిన 'ధనలక్ష్మి' పాత్ర ఇప్పటికీ బాగా హైలైట్ అయ్యింది. విజయ్‌తో ఆమె కెమిస్ట్రీ, అల్లరి నటన, ఎమోషనల్ సీన్స్ సినిమా సక్సెస్‌కు కీలకంగా నిలిచాయి. ఏళ్లు గడిచినా ఆ పాత్రను అభిమానులు గుర్తుంచుకోవడమే ఆమె నటనకు దక్కిన గౌరవం. ఇది తెలుగులో వచ్చిన `ఒక్కడు`కి రీమేక్.
సక్సెస్ కన్నా మానవత్వాన్ని ఎక్కువగా ప్రేమించే నటి త్రిష
స్నేహం కోసం ఏదైనా చేసే మంచి స్నేహితురాలు త్రిష
స్నేహితుల విజయంలో ఆనందాన్ని పంచుకునే గుణం
తమిళనాడు సీఎం విజయ్‌తో చెదరని స్నేహం
సీఎం విజయ్‌తో త్రిషకు చాలా కాలంగా మంచి స్నేహం ఉంది. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్‌ను ఆమె నేరుగా కలిసి అభినందించారు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరై తన సంతోషాన్ని పంచుకున్నారు. స్నేహితుడి జీవితంలోని ముఖ్యమైన క్షణంలో పక్కన నిలబడటమే నిజమైన స్నేహం అని త్రిష నిరూపించుకున్నారని అభిమానులు అంటున్నారు.
వృత్తిపరంగా రాజీపడని అంకితభావం
జంతువులపై ప్రేమ, సామాజిక బాధ్యత
వదంతులు వచ్చినా మౌనంతో త్రిష సమాధానం
ఇంత సుదీర్ఘ కెరీర్‌లో ఎంతో మంది స్టార్లలాగే త్రిషపైనా ఎన్నో రూమర్లు వచ్చాయి. కానీ ఆమె వాటికి అనవసర ప్రయారిటీ ఇవ్వకుండా, తన పనిపైనే దృష్టి పెట్టారు. కొత్త సినిమాలు, కొత్త పాత్రలతో తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తూనే ఉన్నారు.
అభిమానుల ప్రేమను గౌరవించే నటి
తనను ఈ స్థాయికి తీసుకొచ్చింది అభిమానులేనని త్రిష ఎప్పుడూ చెబుతుంటారు. షూటింగ్ స్పాట్‌లో అభిమానులతో ఫోటోలు దిగడం, సోషల్ మీడియాలో వారి విషెస్‌కు థ్యాంక్స్ చెప్పడం వంటివి చేస్తుంటారు. అందుకే ఇప్పటికీ యంగ్ జనరేషన్ అభిమానులు కూడా ఆమెను అంతే ఆరాధిస్తారు.
స్టార్‌డమ్‌కి కారణాలివే
త్రిషపై ప్రేమ కురిపిస్తున్న అభిమానులు
తెరపై ఎన్నో మర్చిపోలేని పాత్రలతో మనసు గెలుచుకున్న త్రిష, నిజ జీవితంలో తన వినయం, స్నేహంతో ఎంతో మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. తరాలు మారినా, ఆమెపై అభిమానుల ప్రేమ తగ్గకపోవడానికి కారణం ఆమె సినిమాలు మాత్రమే కాదు, మంచి వ్యక్తిగా ఆమె సంపాదించుకున్న గౌరవం కూడా. ఇలా ఇప్పటికీ ఎవర్ గ్రీన్‌గా రాణిస్తోంది త్రిష. అందుకే ఆమెని నేటితరం సరోజాగా అభివర్ణిస్తున్నారు.

