MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rao Bahadur 3 Day Collections: రావు బహదూర్‌కి బాక్సాఫీసు షాక్‌.. సత్యదేవ్‌ మూవీ షెడ్డుకెళ్లిందా.. 3 రోజుల కలెక్షన్లు

Rao Bahadur 3 Day Collections: రావు బహదూర్‌కి బాక్సాఫీసు షాక్‌.. సత్యదేవ్‌ మూవీ షెడ్డుకెళ్లిందా.. 3 రోజుల కలెక్షన్లు

విలక్షణ నటుడు సత్యదేవ్‌ హీరోగా నటించిన `రావు బహదూర్‌` మూవీ క్రిటికల్‌గా ప్రశంసలందుకున్నా, బాక్సాఫీసు వద్ద మాత్రం దారుణమైన రిజల్ట్ ని చూస్తోంది. ఆదివారం బాక్సాఫీసు షాకిచ్చింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 06 2026, 10:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రావు బహదూర్‌ మూవీకి బాక్సాఫీసు షాక్‌
Image Credit : X/@SrichakraasEnts

రావు బహదూర్‌ మూవీకి బాక్సాఫీసు షాక్‌

అద్భుతమైన నటనతో మెప్పించడంలో ముందుంటాడు సత్యదేవ్‌. ఇప్పుడున్న ఆయన తరం హీరోల్లో సత్యదేవ్‌ బెస్ట్ యాక్టర్‌ అని చెప్పొచ్చు. `రావు బహదూర్‌` చిత్రంలోనూ అదే స్థాయిలో నటనతో మెప్పించాడు. తన నటనే సినిమాకి ప్లస్‌ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మూడు డిఫరెంట్‌ ఏజ్‌ ఉన్న పాత్రలో ఆయన బాగా నటించి ప్రశంసలందుకున్నారు. దీనికితోడు కొత్త కథ. అయితే దాన్ని తెరపై ఆవిష్కరించడంలో తడబాటు కనిపిస్తుంది. వెంకటేష్‌ మ్యాజిక్‌ చేయలేకపోయాడు. దీంతో మూవీకి ఆడియెన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రావు బహదూర్‌ మూవీకి 3 రోజుల కలెక్షన్లు
Image Credit : X/@SrichakraasEnts

రావు బహదూర్‌ మూవీకి 3 రోజుల కలెక్షన్లు

`రావు బహదూర్‌` మూవీ మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు పుంజుకుంది. మంచి వసూళ్లని రాబట్టింది. కానీ మూడో రోజు డీలా పడింది. ఆదివారం ఈ చిత్రాన్ని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో దారుణమైన కలెక్షన్లు వచ్చాయి. ఇండియాలో ఇది ఫస్ట్ డే కోటిన్నర చేస్తే, రెండో రోజు రెండున్నర కోట్లు వసూలు చేసింది. దీంతో సినిమా పుంజుకుంటుందని టీమ్‌ భావించింది. కానీ మూడో రోజు గట్టి దెబ్బపడింది. కేవలం కోటి రూపాయలే రాబట్టింది. దీంతో ఇండియాలో ఈ మూవీకి రూ.4.85కోట్ల నెట్‌ కలెక్షన్లు వచ్చాయి. ఇండియా గ్రాస్‌ రూ.5.5కోట్లుగా ఉంది.

Related Articles

Related image1
Rao Bahadur Review: రావు బహదూర్‌ మూవీ రివ్యూ.. సత్యదేవ్‌ పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరైందా?
Related image2
Peddi OTT Release: 'పెద్ది' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
34
షెడ్డుకే వెళ్లబోతున్న రావు బహదూర్‌
Image Credit : X/@SrichakraasEnts

షెడ్డుకే వెళ్లబోతున్న రావు బహదూర్‌

`రావు బహదూర్‌`కి ఓవర్సీస్‌లో మూడు కోట్ల వరకు వచ్చాయి. ఇక మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో అంటే తొలి వీకెండ్‌లో రూ.8.52కోట్లు రాబట్టింది. ఈ లెక్కన ఈ సినిమాకి షేర్‌ రూపంలో వసూలు చేసిన కలెక్షన్లు రూ.4.25కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఈ మూవీకి దాదాపు రూ.40కోట్ల బడ్జెట్‌ అయ్యిందని సమాచారం. నాన్‌ థియేట్రికల్‌గా రూ.12కోట్లు రాబట్టింది. ఓటీటీ రైట్స్ ని నెట్‌ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దీనికి రూ.7కోట్లు  వచ్చినట్టు సమాచారం. అలాగే శాటిలైట్‌, ఆడియో రైట్స్ రూపంలో మరో ఐదు కోట్లు వచ్చాయని సమాచారం. థియేట్రికల్‌గా ఈ సినిమాకి ఇంకా రూ.25-28కోట్లు రావాలి. అంటే సుమారు రూ.50కోట్ల గ్రాస్‌ని వసూలు చేయాలి. ఇప్పుడు వస్తున్న కలెక్షన్లని బట్టి చూస్తే ఈ మూవీ సోమవారంతోనే షెడ్డుకు వెళ్లే పరిస్థితి నెలకొంది. ఈ లెక్కన ఇది మరో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మారబోతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

44
మహేష్‌ బాబుపై విమర్శలు
Image Credit : X/@SrichakraasEnts

మహేష్‌ బాబుపై విమర్శలు

సత్యదేవ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో దీపా థామస్‌ హీరోయిన్‌గా చేసింది. మహేష్‌ బాబుకి చెందిన జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శరత్‌ చంద్ర, అనురాగ్‌ వంటి వారు నిర్మించారు. అనుమానం నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది. ఒక రాజవంశానికి చెందిన వారసుడు తన చిన్న కొడుకు తనకే పుట్టాడా అనే అనుమానంతో దిగజారిపోతాడు, అనారోగ్యానికి గురవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే సినిమా కథ. ఈ మూవీ అద్భుతంగా ఉందని మహేష్‌బాబు ట్వీట్‌ చేశారు. సినిమా చూశాక నెటిజన్లు ఆయన్ని ట్రోల్‌ చేస్తున్నారు. ఏం చూసి అద్భుతం అన్నారని కామెంట్‌ చేస్తున్నారు. మహేష్‌ బాబు ట్వీట్‌లన్నీ పెయిడ్‌ ట్వీట్లేనా అని కామెంట్‌ చేస్తుండటం గమనార్హం. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: జ్యోకు తిట్లు-శివన్నారాయణకు పోటీగా దక్షిణమూర్తి-సూరజ్ కు చెంప దెబ్బ
Recommended image2
Illu Illalu Pillalu Today Epiosde: వల్లి గురించి నిజం మొత్తం కక్కేసిన నకిలీ డాక్టర్.. చెంప పగలగొట్టిన వేదవతి
Recommended image3
Aishwarya Lekshmi: ఎంబీబీఎస్ చదివా, కానీ డాక్టర్‌ని కాలేదు.. ఐశ్వర్య లక్ష్మి కామెంట్స్
Related Stories
Recommended image1
Rao Bahadur Review: రావు బహదూర్‌ మూవీ రివ్యూ.. సత్యదేవ్‌ పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరైందా?
Recommended image2
Peddi OTT Release: 'పెద్ది' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved