అక్కడ టాటూ చూపించిన ప్రభాస్ బ్యూటీ.. ఆ టాటూ అర్థం ఏమిటో తెలుసా?
Trisha Krishnan: ఎవర్‌గ్రీన్ బ్యూటీ త్రిష ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు వేసుకున్న ఓ టాటూ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇంతకీ ఆ టాటూ స్పెషాలిటీ ఏమిటో తెలుసా?

ఎవర్ గ్రీన్ బ్యూటీ బ్యూటీ
Trisha Krishnan: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ బ్యూటీ, హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘నీమనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది త్రిష, ఆ తర్వాత ప్రభాస్ సరసన ‘వర్షం’లో నటించి గ్రాండ్ సక్సెస్ అందుకుంది. ఆ సినిమా హిట్ తో స్టార్ హిరోయిన్‌గా మారిపోయింది. వరుసగా నువ్వస్తానంటే నేనొద్దంటానా, అతడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇలా సూపర్ హిట్స్ తో దాదాపు ప్రతి స్టార్ హీరోతో కలిసి నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ప్రతి స్టార్ తో త్రిష స్క్రీన్ పంచుకుంది.
తమిళ స్టార్ హీరోయిన్
త్రిష కేవలం తెలుగులోనే కాదు, తమిళ్ సినిమాల్లోనూ అగ్ర హీరోయిన్‌గా వెలుగొందింది. కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్ లోనూ తన నటనతో ఆకట్టుకుంది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా కెరీర్ కొనసాగిస్తున్న త్రిష వయసు ఇప్పుడు 40 పైబడినా, అందం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అందుకే ఆమెకు ఎవర్ గ్రీన్ బ్యూటీ అన్న ట్యాగ్ దక్కింది.
త్రిష టాటూ ప్రత్యేకత
త్రిషకు సినిమాలకే కాకుండా పచ్చబొట్లంటే కూడా ప్రత్యేకమైన ఇష్టం. ఇప్పటికే తన శరీరంపై పలు టాటూలు వేయించుకున్నది. తాజాగా ఓ ఈవెంట్‌లో తన భుజంపై ఉన్న టాటూను ఫ్యాన్స్‌కు చూపించింది. త్రిష భుజంపై ఉన్న ఆ టాటూ ప్రత్యేకత ఏంటంటే – కెమెరా డిజైన్. కెమెరా ముందు కెరీర్‌ను నిర్మించుకున్న త్రిష, అదే కెమెరాను టాటూగా భుజంపై వేయించుకోవడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ఈవెంట్‌కు హాజరైనప్పుడు ఆమె వేసుకున్న డ్రెస్ మొత్తం బాడీని కవర్ చేసినా, ఆ టాటూ మాత్రం స్పష్టంగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో క్రేజీని పెంచుతున్నాయి. “సినిమా కోసం కెమెరా ముందు మెరిసే త్రిష.. కెమెరానే భుజంపై టాటూగా వేసుకోవడం సింబాలిక్” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
లేటెస్ట్ సినిమాలు
త్రిష సినిమాల విషయానికి వస్తే, ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన థగ్ లైఫ్ లో త్రిష నటించింది. సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని సాధించకపోయినా, త్రిష నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఆమె చేతిలో పలు తమిళ్ సినిమాలు, అలాగే టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి సరసన వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. 22 ఏళ్లకు పైగా హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తున్న త్రిష తన కెరీర్‌ను ఇంకా అదే జోష్‌తో కొనసాగిస్తోందని చెప్పొచ్చు.