MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 10 సినిమాలు , 3 ఏళ్లుగా ఓటీటీలో దుమ్మురేపుతోన్న సినిమా ఏది?

నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 10 సినిమాలు , 3 ఏళ్లుగా ఓటీటీలో దుమ్మురేపుతోన్న సినిమా ఏది?

Netflix Top 10 Trending Movies : ఇంట్లో కూర్చుని సినిమాలను  ఆస్వాదించే ఆడియన్స్ కు నెట్‌ఫ్లిక్స్ ఒక వరంలా మారింది.  ప్రతి వారం కొత్త కంటెంట్  ఆకట్టుకుంటుంది ఓటీటీ. ఇక  ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న 10 సినిమాల ఎవో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 14 2025, 11:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
వార్ 2
Image Credit : Film

వార్ 2

నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 10 సినిమాలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది వార్ 2 హిందీ వెర్షన్ మూవీ.  హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ నటించిన ఈ సినిమా హిందీ, తమిళ వెర్షన్లు మొదటి స్థానంలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన  ఈ స్పై యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
కాంతార
Image Credit : Film

కాంతార

కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన సినిమా కాంతార.  2022 లో సైలెంట్ గా వచ్చి, భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇక ఈమూవీ మూడేళ్లుగా ఓటీటీలో మంచి రెస్పాన్స్ తొ కొనసాగుతోంది.  తాజాగా కాంతార  హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో రెండో స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు రీసెంట్ గా ప్రీక్వెల్ కూడా రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 

310
మహావతార్ నరసింహ
Image Credit : Film

మహావతార్ నరసింహ

ఒక యానిమేటెడ్ మూవీ భారీ విజయం సాధించడం నిజంగా అందరిని ఆశ్చర్యపరిచిన విషయం. దాదాపు 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన మహావతార్ నరసింహా సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.  ఈ సినిమాను సౌత్ ఇండియన్ ప్రొడక్షన్ హౌస్ క్లీమ్ ప్రొడక్షన్స్ నిర్మించింది, హోంబలే ఫిల్మ్స్ సమర్పించింది. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో  మూడో స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది.

410
ది వుమన్ ఇన్ క్యాబిన్ 10
Image Credit : Film

ది వుమన్ ఇన్ క్యాబిన్ 10

ఇక ఇండియాలో ట్రెండింగ్ లో ఉన్న హాలీవుడ్ మూవీ  ది వుమన్ ఇన్ క్యాబిన్ 10.  ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా నాలుగో స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ బ్రిటిష్ సినిమాకు సైమన్ స్టోన్ దర్శకత్వం వహించారు. కైరా నైట్లీ, గై పియర్స్ లాంటి నటులు ముఖ్య పాత్రలు పోషించారు.

510
వార్ 2
Image Credit : Film

వార్ 2

ఇక నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్‌లో మరోసారి వార్ 2  మరోసారి ట్రెండింగ్ లిస్ట్ లోకి యాడ్ అయ్యింది.  అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' తెలుగు వెర్షన్ ఐదో స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ నటించారు. 

610
సన్ ఆఫ్ సర్దార్ 2
Image Credit : Film

సన్ ఆఫ్ సర్దార్ 2

అజయ్ దేవగన్, మృణాల్ ఠాకూర్, రవి కిషన్ లాంటి సీనియర్ తారలు నటించి మెప్పించిన సినిమా సన్ ఆఫ్ సర్ధార్ 2. విజయ్ కుమార్ అరోరా డైరెక్ట్ చేసిన  ఈ కామెడీ సినిమా ఓటీటీ ఫ్టాట్ ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్‌ లో ఆరో స్థానం సాధించి ట్రెండింగ్‌లో ఉంది.

710
ధడక్ 2
Image Credit : Film

ధడక్ 2

ఈ రొమాంటిక్ డ్రామాలో సిద్ధాంత్ చతుర్వేది, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు షాజియా ఇక్బాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్‌లో ఏడో స్థానంలో  ఉంది.

810
సైయారా
Image Credit : Film

సైయారా

ఈ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఎనిమిదో స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. మోహిత్ సూరి దర్శకత్వంలో అహాన్ పాండే, అనీత్ పడ్డా  హీరో హీరోయిన్లుగా నటించారు. 30 కోట్ల చిన్న బడ్జెట్ తో రూపొందిన ఈమూవీ బాక్సాఫీస్ దగ్గర దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. 

910
ఇన్‌స్పెక్టర్ జెండే
Image Credit : Film

ఇన్‌స్పెక్టర్ జెండే

 నెట్‌ఫ్లిక్స్‌ లో తొమ్మిదో స్థానంలో కామెడీ థ్రిల్లర్ 'ఇన్‌స్పెక్టర్ జెండే' ట్రెండింగ్‌లో ఉంది. మనోజ్ బాజ్‌పేయి, జిమ్ సర్భ్, సచిన్ ఖేడేకర్, గిరిజా ఓక్ లాంటి నటులున్న ఈ సినిమాకు చిన్మయ్ మాండ్లేకర్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తుంది ఈ మూవీ. 

1010
ఓడుమ్ కుతిర చాడుమ్ కుతిర
Image Credit : Film

ఓడుమ్ కుతిర చాడుమ్ కుతిర

ఇది మలయాళ రొమాంటిక్ కామెడీ సినిమా. దీనికి అల్తాఫ్ సలీం దర్శకత్వం వహించారు. 10వ స్థానంలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ సినిమాలో పుష్ప ఫేమ్  ఫహద్ ఫాసిల్, కళ్యాణి ప్రియదర్శన్, రేవతి, ధ్యాన్ శ్రీనివాసన్ నటించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
తమిళ సినిమా
ఓటీటీ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
2025 లో 500 కోట్ల వసూళ్లు దాటిన 4 సినిమాలు, కాంతార చాప్టర్ 1 తో పాటు మిగతా 3 ఏవి?
Recommended image2
బామ్మర్ది కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్.. రెండు అదిరిపోయే బహుమతులు, దెబ్బకు నితిన్ కెరీర్ సెట్ ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved