- Home
- Entertainment
- తెలుగు సినిమాదే పై చేయి, తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్ ఏంటో తెలుసా?
తెలుగు సినిమాదే పై చేయి, తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్ ఏంటో తెలుసా?
సౌత్ నుంచి వరుసగా పాన్ ఇండియా సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమాల హవా మామూలుగా లేదు. ఫస్ట్ డే కలెక్షన్లు విషయంలో టాప్ 10 లో తెలుగు సినిమాలు ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ ప్లేస్ ఏ సినిమాది?

10. దేవర పార్ట్ 1 (2024)
ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు కలెక్షన్: 142 కోట్లు
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. శ్రుతి మరాఠే, సైఫ్ అలీ ఖాన్ కూడా నటించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల వరకూ వసూలు చేసింది.
9. లియో (2023)
ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు కలెక్షన్: 142.90 కోట్లు
దళపతి విజయ్ హీరోగా నటించిన తమిళ సినిమా త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్ కూడా ఈ చిత్రంలో నటించారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 605.9 కోట్లు వసూలు చేసింది.
8. పవన్ కళ్యాణ్ OG (2025)
ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు కలెక్షన్: 144 కోట్లు
పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ తెలుగు సినిమా ఇది. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించిన ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 270 కోట్లు వసూలు చేసింది. పవర్ స్టార్ చాలా కాలం తరువాత మాస్ పాత్రలో నటించిన ఈసినిమాలో బాలీవుడ్ రొమాంటికి హీరో ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో నటించగా ప్రియాంక అరుళ్ మోహన్ కీలక పాత్రల్లో నటించారు.
7. కూలీ (2022)
ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు కలెక్షన్: 153 కోట్లు
రజనీకాంత్ హీరోగా నటించని ఈ సినిమాను తమిళ యంగ్ స్టార్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించగా, తెలుగు స్టార్ హీరో కింగ్ నాగార్జున విలన్ గా నటించారు. మలయాళ నటుడు సౌబిన్ షాహిర్, రచితా రామ్, ఉపేంద్ర ఈసినిమాలో నటించి మెప్పించారు. ఇక బాలీవుడ్ స్టార్ సీనియార్ హీరో ఆమిర్ ఖాన్ అతిధి పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 518 కోట్లు వసూలు చేసింది.
6. సలార్ పార్ట్ 1: (2023)
ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు కలెక్షన్: 158.10 కోట్లు
ప్రభాస్ నటించిన ఈ తెలుగు చిత్రానికి కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషించగా శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. సలార్ ఫైనల్ రన్ లో ప్రపంచవ్యాప్తంగా 617.75 కోట్లు వసూలు చేసింది.
5. కేజీఎఫ్ చాప్టర్ 2 (2025)
ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు కలెక్షన్: 159 కోట్లు
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్ ప్రధాన పాత్రలో నటించాడు. ఆయనతో పాటు సంజయ్ దత్, రవీనా టాండన్ ముఖ్యమైన పాత్రలు పోషించగా, యష్ జోడీగా శ్రీనిధి శెట్టి నటించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1215 కోట్లు వసూలు చేసింది.
4. కల్కి 2898 AD (2024)
ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు కలెక్షన్: 177.70 కోట్లు
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ తెలుగు చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1042.25 కోట్లు వసూలు చేసింది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించగా, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ వంటి భరతీయ దిగ్గజ నటులు ఈ చిత్రంలో సందడి చేశారు.
3. బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (2017)
ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు కలెక్షన్: ₹217 కోట్లు
ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ తెలుగు చిత్రానికి S.S రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, సత్యరాజ్, రమ్య కృష్ణన లాంటి సీనియర్స నటించారు. ప్రపంచ వ్యాప్తంగా పైనల్ రన్ లో ఈ మూవీ 1788.06 కోట్లు వసూలు చేసింది.
2.ఆర్ఆర్ఆర్ (2022)
ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు కలెక్షన్: 223 కోట్లు
ఈ తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹1300 కోట్ల వరకూ వసూలు చేసింది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించగా, అజయ్ దేవగన్ , అలియా భట్, శ్రీయా కూడా నటించారు. టాలీవుడ్ కు తొలి ఆస్కార్ సాధించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచిపోయింది.
1. పుష్ప 2: ది రూల్ (2024)
ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు కలెక్షన్: 275.20 కోట్లు
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ తెలుగు చిత్రంలో ఫహద్ ఫాజిల్, రష్మిక మందన్న, రావు రమేష్, జగపతి బాబు కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్త ఫైనల్ రన్ లో ₹1742 కోట్లు వసూలు చేసింది.