ఆ పాత్ర చేయాలంటే భయపడుతున్న జూనియర్ ఎన్టీఆర్, తారక్ డ్రీమ్ రోల్ అదేనట.
నటనను ప్రేమించే ప్రతీ నటుడికి ఛాలెంజింగ్ రోల్స్ అంటే ఇష్టం ఉంటుంది. కొంత మందికి అందే డ్రీమ్ రోల్ కూడా అవుతుంది. అది నేరవేర్చుకోవడంకోసం జీవితంలో ఏదో ఒక సందర్భంలో రిస్క్ చేస్తుంటారు. ఇక అలంటి పాత్రే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కూడా ఉందట.
ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఎంత పెద్ద నటుడికి అయినా.. అన్ని పాత్రలు చాలా ఈజీగా అయిపోవు.. దానికోసం చాలా కష్టపడతారు.. ఎంతో శ్రమపడతారు. కొన్ని పాత్రల కోసం ప్రాణాలు కూడా లెక్క చేయకుండా రిస్క్ చేస్తుంటారు. అయితే అదే టైమ్ లో ప్రతీ నటులకు ఓ డ్రీమ్ రోల్ ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో అది నెరవేర్చుకోవాలి అని ఆశ ఉంటుంది. ఇక ఈనేపథ్యంలోయంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కూడా ఇదేతరహాలో ఓ డ్రీమ్ రోల్ ఉందట.
టాలీవుడ్ నుంచి హాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ లో.. ఎదిగి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని గ్లోబర్ స్టార్‌గా పేరు తెచ్చకున్న హీరో ఎన్టీఆర్. ఆయన ఎన్ని సినిమాలు చేసినా.. తనకు సంతృప్తి నిచ్చే పాత్ర మాత్రం ఇంకా చేయాల్సి ఉందట. ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నరు. కానీ అలాంటి రోల్ చేసే అవకాశం ఇంత వరకూ రాలేదు.
టాలీవుడ్ నుంచి హాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ లో.. ఎదిగి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని గ్లోబర్ స్టార్‌గా పేరు తెచ్చకున్న హీరో ఎన్టీఆర్. ఆయన ఎన్ని సినిమాలు చేసినా.. తనకు సంతృప్తి నిచ్చే పాత్ర మాత్రం ఇంకా చేయాల్సి ఉందట. ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నరు. కానీ అలాంటి రోల్ చేసే అవకాశం ఇంత వరకూ రాలేదు.
తారక్ అలా వెనకడుగు వేయడానికి కూడా ఓ కారణం ఉంది. టాలీవుడ్లో శ్రీ కృష్టుడు, రాముడు అంటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది సీనియర్ ఎన్టీఆర్. అలానే జూనియర్ ఎన్టీఆర్ కూడా వాళ్ల తాత మాదిరిగా కృష్ణుడి పాత్రలో ఒక్కసారైనా నటించాలని ఆశపడ్డారట. కాని అలాంటి పాత్ర.. ఆయన మనవడిగా తాను చేస్తున్నాను అంటే ఎక్స్ పెక్టేషన్స్ భారీలలెవల్లో ఉంటాయి. అవి నేను ఆ పాత్ర సరిగ్గా చేయకపోతే.. పరిస్థితి వేరేలా ఉంటుంది. తాత పేరు కూడా చెడగొట్టినట్టు అవుతుంది అని తారక్ భావిస్తున్నారట.
అందుకే తనకు అదే డ్రీమ్ రోల్ గా ఉన్నా..ఇంత వరకూ ట్రై చేయలేదు అంటున్నాడు తారక్ కానీ, ఇంత వరకు అటువంటి పాత్రలో నటించే అవకాశం యంగ్ టైగర్‌కు రాలేదట. వస్తే మటుకు టైమ్ తీసుకుని అయినా.. పర్ఫెక్ట్ గా చేయాలని చూస్తున్నాడట ఎన్టీఆర్. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.ఈ సినిమా ద్వారానే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
అంతే కాదు... బాలీవుడ్ సీనియర్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, రమ్యకృష్ణ, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరెక్కుతుండగా..ఫస్ట్ పార్ట్ ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.