తెలుగు తెరపై రికార్డ్ సునామీ సృష్టించిన హీరో.. సూపర్ స్టార్ కృష్ణ తొలి వర్ధంతి
తెలుగు తెరకు వెలుగుల రారాజు, వెండితెరపై వెలిగిన తారా జువ్వ.. టాలీవుడ్ కు కొత్త సంప్రదాయాలు నేర్పిన హీరో.. సూపర్ స్టార్ కృష్ణ మొదటి వర్ధంతి నేడు.
కృష్ణ మరణించి అప్పుడే ఏడాది అయ్యింది. సినీ వినీలాకాశంలో రారాజుల్లా వెలిగిన తారలంతా ఒక్కొక్కరిగా రాలిపోతూనే ఉన్నారు. కృష్ణ, కృష్ణం రాజు, శరత్ బాబు.. ఈమధ్యనే చంద్రమోహన్.. వీరంతా తెలుగు సినీపరిశ్రమకు పిల్లర్ల మాదిరి కాపు కాశారు. పరిశ్రమకు గట్టి పునాదులు వేసి.. తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు.
మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ రికార్డ్ లు తెలుగులో ఎవరూ బ్రేక్ చేయలేనివి. ఎందుకుంటే.. ప్లేన్ తెలుగు సినిమాకు రంగులద్దింది ఆయనే.. టెక్నాలజీని నేర్పింది అతనే.. మొదటి కౌవ్ బాయ్ కూడా కృష్ణనే.. అంతేనా.. డూప్ లేకుండా ఫైట్లు.. యాక్షన్ సీన్స్ చేసే సాహసం చేసి..నిజమైన సాహసవీరుడు.. రియల్ హీరో అనిపించుకున్నాడు కృష్ణ.
25 సినిమాల్లో ద్విపాత్రాభినయం చేయగా, 7 సినిమాల్లో త్రిపాత్రాభినయం చేసి రికార్డు సృష్టించారు. తొమ్మిదేళ్ళలో 100 సినిమాల్లో నటించిన ఎవర్‌గ్రీన్ రికార్డూ కృష్ణకే సొంతం. నటుడిగానే కాదు దర్శకుడిగా, నిర్మాతగా కూడా రాణించారు. వివిధ భాషల్లో దాదాపు 50 చిత్రాలను నిర్మించారు. అలాగే 12కి పైగా చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు
అంతే కాదు ఒక ఏడాదిలో కృష్ణ 16 సినిమాలు రిలీజ్ అయ్యాయి అంటే.. ఎంత నిర్విరామంగా పనిచేసేవారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నికార్డ్ ఇంత వరకూ ఏ హీరో కూడా బ్రేక్ చేయలేకపోయారు. బ్రేక్ చేయలేరు కూడా. ఆయన అంత పనిచేశారు కాబట్టే.. ఆయన వారసుడు మహేష్ మాత్రం ఏడాదికి ఒక్క సినిమానే చేస్తున్నాడు..
అంతే కాదు కృష్ణ అన్ని సినిమాలు చేసినా.. సంపాదించింది మాత్రం అందరికంటే తక్కువే.. ఎందుకంటే.. ప్రొడ్యూసర్ లాస్ అవ్వకూడదు అని నమ్మేవ్యక్తి కృష్ణ.. అందుకే ఆయన్ను మోసం చేయడం.. డబ్బులు ఎగ్గొట్టం ఎక్కువగా జరిగేవట.. కృష్ణ గారి డెస్క్ లో చెల్లనిచెక్కుల కట్టలు నోట్ల కట్టలకంటే ఎక్కువుండేవంటేనే తెలుస్తుంది..ఆయన మంచితనం.
ఆకాలంలో ఉన్న ఇతర హీరోలతో పోలిస్తే సాంకేతికంగా చాలా అడ్వాన్స్ సినిమాలు చేసారు కృష్ణ. తెలుగు తెరపై తొలి స్కోప్ సినిమా.. తొలి ఈస్ట్ మన్ కలర్ సినిమా.. తొలి డీటీఎస్ సినిమా.. తొలి 70ఎంఎం సినిమా.. తొలి కౌబోయ్ సినిమా.. తొలి స్పై సినిమాని చేసింది ఆయనే. అంతేకాదు ఎక్కువ సినిమాలకు సమర్పకుడిగా..నిర్మాతగా.. దర్శకుడిగా ఎక్కువ సినిమాలు తెరకెక్కించిన హీరోగా కృష్ణ రికార్డులను ఎవరూ చెరిపివేయలేరు.
Super Star Krishna
తొలి 70 ఎంఎం సినిమా: సింహాసనం 1986 లో వచ్చింది. ఈ సినిమా కృష్ణ స్వీయ దర్శకత్వంలో ఒకేసారి తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీ్ అయ్యింది. ఈరకంగా ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఇదే అనొచ్చు. ఇప్పట్లో ఈ సినిమాను తెరకెక్కించాలంటే దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్ అవుతుందని పలు సందర్భాల్లో కృష్ణ వెల్లడించారు. తెలుగులో తొలి 70MM, 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సినిమా సింహాసనం ను అందించిన ఘనత కృష్ణ దే. ఈ సినిమాతో తొలిసారి మెగాఫోన్ పట్టుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ
Super Star Krishna Birthday
అత్యధిక హీరోయిన్లతో నటించిన హీరో కూడా కృష్ణనే.. కృష్ణ దాదాపు 80మందికిపైగా హీరోయిన్లతో నటించారు. అయితే ఎక్కువగా సినిమాలు చేసింది మాత్రం విజయనిర్మలతోనే. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో 48 సినిమాలొచ్చాయి. ఆ తర్వాత జయప్రదతో 47 సినిమాలు..
Super Star Krishna
శ్రీదేవితో 31 సినిమాలు... రాధతో 23 సినిమాల్లో నటించిన ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించాడు సూపర్ స్టార్. ఇలా చెప్పుకుంటూ పోతే.. సూపర్ స్టార్ కృష్ణ రికార్డ్ లు వస్తూనే ఉంటాయి. ఆయన మరణించి ఏడాది అయిన సందర్భంగా.. కృష్ణను తలుచుకుంటూ..నివాళి.