- Home
- Entertainment
- సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహానికి ఘన నివాళి.. మహేశ్ బాబును ఓదార్చిన టాలీవుడ్ స్టార్స్.. ఫొటోలు!
సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహానికి ఘన నివాళి.. మహేశ్ బాబును ఓదార్చిన టాలీవుడ్ స్టార్స్.. ఫొటోలు!
సూపర్ స్టార్, సీనియర్ నటుడు కృష్ణ (Krishna) మరణ వార్తను సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంటివద్దకు చేరుకున్న ఆయన పార్థివదేహానికి టాలీవుడ్ స్టార్స్ పూలమాలలు వేసి ఘన నివాళి అర్పిస్తున్నారు.

నట శేఖరుడు, సీనియర్ నటుడు కృష్ణ తుదిశ్వాస విడవటంతో అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. కృష్ణ నివాసం వద్దకు చేరుకుకొని ఆయన పార్థివ దేహానికి ఘన నివాళి అర్పిస్తున్నారు. ఇప్పటికే అన్న రమేశ్ బాబు, తల్లి ఇందిరా దేవిని కోల్పోయిన బాధలో ఉన్న మహేశ్ కు తండ్రి కృష్ణ కూడా దూరం కావడం పట్ల చింతిస్తున్నారు. సూపర్ స్టార్ ను పరామర్శిస్తూ భరోసా వ్యక్తం చేస్తున్నారు.
నట శేఖరుడు కృష్ణ తుదిశ్వాస విడవటంతో తీవ్రంగా చింతించారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). కృష్ణ లేరనే వార్త తెలియగానే క్షణాల్లోనే ట్వీటర్ వేదికన ఎమోషనల్ నోట్ వదిలారు. కృష్ణతో తనకున్న అనుబంధాన్ని వెల్లడిస్తూ సంతాపం ప్రకటించారు. తాజాగా కృష్ణ పార్థివ దేహానికి కూడా పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)ను పరామర్శించి.. ధైర్యం చెప్పారు.
సీనియర్ నటుడు కృష్ణ తుదిశ్వాస విడవటంతో ఉదయం నుంచి సోషల్ మీడియా వేదికన అభిమానులు, సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు సంతాపం ప్రకటిస్తున్నారు. టాలీవుడ్ నటుడు దగ్గుబాటి వెంకటేశ్ కూడా తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కృష్ణ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మహేశ్ ను గుండెలకు హత్తుకొని భరోసా వ్యక్తం చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కృష్ణ నివాసం వద్దకు చేరుకుకొని ఆయన పార్థివ దేహానికి పూలమాలతో ఘన నివాళి అర్పిస్తున్నారు. చివరిసారిగా ది లెజెండరీ నటుడికి వందనం చేశారు. ఉదయమే జనసేన పార్టీ తరుపున భావోద్వేగ భరితమైన ప్రకటనతో సంతాపం తెలిపారు. తాజాగా కృష్ణ ఇంటికి చేరుకుని మహేశ్ బాబును, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అన్న రమేశ్ బాబు, తల్లి ఇందిరా దేవిని కోల్పోయిన బాధలో ఉన్న మహేశ్ కు తండ్రి కృష్ణ కూడా దూరం కావడంతో పుట్టెడు శోకంలో కూరుకుపోయారు. ఇలాంటి దుఃఖ స్థితిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ NTR కూడా మహేశ్ బాబును ఓదార్చే ప్రయత్నం చేశారు. కృష్ణ పార్థివ దేహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కూడా కృష్ణ మరణవార్త గురించి తెలుసుకొని ఎంతగానో చింతించారు. కృష్ణ ఇంటికి చేరుకొని ఆయన పార్థివ దేహానికి పూలమాల వేశారు. శోక సంద్రంలో ఉన్న మహేశ్ బాబుకు ధైర్యం చెప్పారు. అనంతరం కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
పుట్టెడు శోకంలో ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబును పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తాజాగా పరామర్శించారు. కృష్ణ పార్థివదేహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఆయనకు చివరి సారిగా ప్రత్యేక వందనం చేశారు. అనంతరం మహేశ్ బాబుతో చాలాసేపు ప్రత్యేకంగా కూర్చొని ఓదార్చారు. దిగమింగలేని బాధలో ఉన్న మహేశ్ కు ధైర్యం చెప్పారు. ప్రభాస్ వెంట అక్కినేని యంగ్ హీరో అఖిల్ కూడా ఉన్నారు.
తండ్రి కృష్ణను కోల్పోయిన బాధలో ఉన్న మహేశ్ బాబును టాలీవుడ్ స్టార్స్ ఒక్కొక్కరుగా పరామర్శిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కలిసి కృష్ణ పార్థివ దేహానికి నివాళి అర్పించారు. పూలమాలతో శ్రద్ధాంజలి ఘటించారు.
టాలీవుడ్ నటుడు, ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కృష్ణ గారి నివాసానికి చేరుకున్నారు. ఆయన పార్థివదేహానికి పూలమాలతో నివాళి అర్పించారు. చివరిసారిగా ఆయనకు గౌరవందనం తెలిపారు. అనంతరం మహేశ్ బాబును పరామర్శించారు.
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ కూడా కృష్ణ గారి పార్థివ దేహానికి వందనం చేశారు. పూలమాల వేసి నివాళి అర్పించారు. మహేశ్ బాబు, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణీ (Keeravani MM) కృష్ణ పార్థివదేహాన్ని సందర్శించుకున్నారు. ప్రత్యేక వందనం చేశారు. పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. కృష్ణ లేరనే బాధను వ్యక్త పరిచారు. మహేశ్ బాబు, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.