- Home
- Entertainment
- పాపం.. నాని కొడుకు బుక్కయ్యాడుగా.! నేచురల్ స్టార్ చేసిన పనికి ఫ్యాన్స్ ఏమంటున్నారంటే?
పాపం.. నాని కొడుకు బుక్కయ్యాడుగా.! నేచురల్ స్టార్ చేసిన పనికి ఫ్యాన్స్ ఏమంటున్నారంటే?
హీరో నాని అంటే అభిమానులకు ఎంత ఇష్టమో తెలిసిందే. ఎలాంటి విషయాన్నైనా నేచురల్ స్టార్ తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంటారు. ఈ క్రమంలో తాజాగా పంచుకున్న పోస్ట్ పై ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

నేచురల్ స్టార్ నాని (Nani) బ్యూటీఫుల్ మూవీస్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నారు. మంచి కంటెంట్ తో అభిమానులనే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ ను కూడా ఆకట్టుకుంటున్నారు. రీసెంట్ గా ‘హాయ్ నాన్న’ Hai Nannaతో అలరించారు.
ఇదిలా ఉంటే.. నాని సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. తన అభిమానులకు తన గురించిన అన్ని విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. ఫ్యాన్స్ ప్రశ్నలకూ సమాధానాలు ఇస్తుంటారు. నేచురల్ స్టార్ అభిమానులు కూడా మొహమాటం లేకుండా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు.
అయితే, డిసెంబర్ 25న (నిన్న) క్రిస్టమస్ ఫెస్టివల్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నాని కొడుకు అర్జున్ (Arjun) ఎంతో ప్రేమగా క్రిస్టమస్ ట్రీ బొమ్మ వేసి, తన భావాలను, తండ్రిపై ప్రేమను తెలిపే కొటేషన్లను ఓ పేపర్ పై రాశాడు. దాన్ని తండ్రి నానికి గిఫ్ట్ గా బహుకరించాడు.
దానికి నాని సర్ ప్రైజ్ అయ్యారు. వెంటనే అభిమానులతో ఫొటోలను పంచుకున్నారు. క్రిస్టమస్ కు ఇదే బెస్ట్ గిఫ్ట్ అని కూడా చెప్పారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. తండ్రి, కొడుకుల ప్రేమను చూసి మురిసిపోతున్నారు.
ఈ క్రమంలో నాని కొడుకు రైటింగ్ పై ఫన్నీగా కూడా కామెంట్లు పెడుతున్నారు....చిన్నోడి రైటింగ్ అర్థం కావడం లేదు అన్నా.. నాని అన్న మనోడి స్కూల్ ను అర్జెంట్ గా మార్చేయండి.. అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. విషయం అటు తిరిగి ఇటు తిరిగి నాని కొడుకు చదువుకు కాడికి రావడం ఆసక్తికరంగా మారింది.
ఇక నాని తన కొడుకుతో ఎంత ప్రేమగా ఉంటారో తెలిసిందే. సమయం దొరికితే ముద్దుల కుమారుడు జున్ను Junnu (Arjun)తో కలిసి అల్లరి చేస్తుంటారు. అప్పుడప్పుడు వీడియోలు, ఫొటోలూ పంచుకుంటూ ఉంటారు. సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీకే కేటాయిస్తుంటారు. మరోవైపు అభిమానులకూ కిక్కిచ్చే అప్డేట్స్ ను అందిస్తూనే ఉంటారు. నాని నెక్ట్స్ Hit3లో నటిస్తున్నారు.